అక్షర

కల్పనలో చిత్రీకరించబడ్డ జీవిత వాస్తవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంచికి చేరిన కథ (నవల)
-కొట్టి రామారావు,
పేజీలు: 71,
వెల: రూ.80/-
కాపీలకు: రచయిత,
మచిలీపట్నం.

కొట్టి రామారావుగారి నవల ‘‘కంచికి చేరని కథ’’ వాస్తవంగా కూడా కంచికి చేరకుండా ఆగిపోయిన, రజని అనే ఓ మధ్యతరగతి యువతి కథ. ‘సాహిత్యంలోని ప్రతీ ప్రక్రియ-అంటే, పద్యం, గద్యం, వ్యాసం- పాఠకులకు ఓ సందేశాన్ని ఇవ్వాలి’అని అనుకుంటే, ఈ నవల ఆ స్థాయిదాకా రాకుండానే ముగింపబడినదిగా అనుకోవాలి.
ప్రేమించబడిన వ్యక్తే కొంతకాలం తరువాత ద్వేషించబడటం; మళ్ళీ ఏదో ఒక్కగానొక్క గుణంవల్ల ఆకర్షితులు కావటం ఆ స్ర్తిపురుషులు ఇద్దరూ సన్నిహితులు కావటం, మళ్ళీ విడిపోవటం- రచయిత మాటల్లోనే- ‘‘్భమి గుండ్రంగా ఉంది. రజని (ఈ నవలా నాయకి) బొబ్బిలినుండి హైదరాబాదు వచ్చాక ఒక రౌండు వేసి ఒంటరిదయింది. ఇప్పుడు మరో రౌండు వేసి మరల ఏకాకిగా మిగిలిపోయింది.’’అని చెప్పటంవల్ల పాఠకుడి సానుభూతి పొందుతుంది కాని సందేశం ఇవ్వలేకపోతుంది.
‘ఒక స్ర్తిమూర్తి యదార్థ జీవితగాథకు నవలా రూపం’అని చెప్పుకోబడిన ఈ నవల కథాపరంగా, శైలిపరంగా బావుంది కాని పాత్రల చిత్రీకరణలో ఇంకొంచెం ‘రిఫైన్‌మెంటు’ కావాలి.
‘‘ముంబై వన్’’ అనే పక్ష పత్రికలో ధారావాహికంగా వెలువడి పుస్తక రూపంగా ఇప్పుడు మనముందుకు వచ్చిన ఈ నవలలో, రజని అనే ఏ ఆకర్షణా లేని మధ్యతరగతి కంటే మరో మెట్టు క్రిందున్న ఉద్యోగిని, వెంకట్రావు అనే కొలీగ్ ‘ప్రపోజ్’చేయగా కులాంతర వివాహం చేసుకుంటుంది. ఏడాది తిరిగేసరికి వారి సాంసారిక జీవనంలో, ఓ అనారోగ్యం, ఓ అబార్షను చోటుచేసుకుంటుంది. బంధువుల అమ్మాయిపై మోజుపెంచుకుని వెంకట్రావు రజనికి విడాకులిస్తాడు. ఒంటరి అయిన రజని, రాజశేఖర్ అనే సాహితీ ప్రేమికునికి దగ్గరవుతుంది. రాజశేఖర్ వివాహితుడు. ఇద్దరు పిల్లలు. రజనీ రాజశేఖర్‌లు ‘సహజీవనం’ గడుపుతుంటారు. కొణ్ణాళ్ళకు రాజశేఖర్ మరణిస్తాడు. ‘మళ్ళీ రజని ఒంటరిదవుతుంది. ఆమె జీవిత కథ మళ్ళీ మొదటికి వస్తుంది.
ఉద్యోగార్థం ఉన్న ఊరు విడిచి, హైద్రాబాదు వచ్చిన రజని పాత్ర చిత్రీకరణ విషయంలో రామారావుగారు రజనికి అన్యాయం చేసాడనే చెప్పుకోవాలి. రజనిని గొప్ప వ్యక్తిత్వంగల మనిషిగా చిత్రించి కూడా, ఆమెకు తగినంత లోకజ్ఞానం ఆపాదించలేదు. రాజశేఖరంతో కలిసి నడవటానికి అంగీకరించాకనైనా ‘వివాహం’అన్న చట్టబద్ధమైన ముద్ర అవసరం అని అనుకోదు. తన డబ్బుకూడా కలిపి రాజశేఖరం ఇల్లుకొంటే, తన పేరు కనీసం జాయింటుగానైనా- ఉండాలనుకోదు. రాజశేఖరం మరణం తరువాత ఇంట్లోంచి వెళ్ళగొట్టబడుతుంది. అప్పుడు ఆవిడకు జ్ఞానోదయమవుతుందో లేదో కాని రచయిత ‘‘నౌ ఇటీజ్ టూ లేట్’’ అంటాడు.
ప్రముఖ కథకులు వ్యాసకర్త సమీక్షకులు విహారిగారి ప్రకారం కొట్టి రామారావుగారు ‘‘విమర్శ శక్తి, వివేచనాసక్తీ కలిగిన సాహితీప్రియుడు. కవి, కథకుడు, నాటకకర్త స్వీయ జీవిత గ్రంథకర్త మరియు సాహిత్య సంకలనాల సంపాదకుడు’’అంతే కాదు ‘కథకుడుగా రామారావుది విలక్షణమైన పద్ధతి. ఉత్తమ మానవీయ విలువల ఆవిష్కరణకీ మానవ సంబంధాలలోని వైరుధ్యాల చిత్రణకీ చిన్నకథని వా‘హికగా చేసుకున్నవాడు’. మునిపల్లెరాజుగారి ప్రశంసలు కూడా పొందిన రామారావుగారి ఈ నవల ఇంకొంచెం సందేశాత్మకంగా మరికొంత ఆదర్శనీయంగా రజనిని చిత్రీకరిస్తే బావుండేది.

-కూర చిదంబరం