అక్షర

కాబోయే కథకులకు పెద్దబాలశిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘కథానిక- పాఠాలు’’ (విమర్శా వ్యాసాలు)
సంపా: వల్లూరుశివప్రసాద్, ఆం.ప్ర. అభ్యుదయ
రచయితల సంఘం, గుంటూరు
వెల: 100 రూ. పే: 182;
ప్రతులకు: విశాలాంధ్ర మరియు నవ చేతన
అన్ని బ్రాంచీలు.
**
అరసం శాఖ గుంటూరులో నిర్వహించిన కథానిక పాఠశాలలో బోధకులు సమర్పించిన ప్రసంగ వ్యాసాలతోపాటు, గతంలో కొంతమంది ప్రముఖులు కథారచన మీద రాసిన వ్యాసాలను కలిపి ‘‘కథానిక-పాఠాలు’’పేరిట ఈ సంకలనాన్ని వెలువరించడం ఆహ్వానించదగిందే.
నూతన ఆవిష్కరణలు, పారిశ్రామిక విప్లవంతో యూరప్‌లో ఆధునికతకు బీజం పడింది. వలస పాలనలో మగ్గుతున్న భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు తర్వాత ఈస్టిండియా కంపెనీ నుండి బ్రిటీష్ పార్లమెంట్ చేజిక్కించుకుంటుంది. వారు ప్రవేశపెట్టిన మార్పులు, సంస్కరణలతో మన దేశంలో ఆధునికత ప్రారంభమయిందని చెప్పాలి. ఆంగ్ల భాషాభ్యాసనం వల్ల కొత్తగా వచన రీతులు ఏర్పడడం, ఆంగ్ల సాహిత్య ప్రభావంతో దేశ భాషలలో కూడా జనాకర్షక సాహిత్య రూపాల ఆవిష్కరణకు మార్గం ఏర్పడిందని ‘‘ఆధునిక తెలుగు సాహిత్యం-పుట్టుక, నేపథ్యం’’లో కాత్యాయనీ విద్మహే సోదాహరణంగా వివరించారు. కథారచన గురించీ, కథల యొక్క సాంఘిక ప్రయోజనం గురించీ, కథకుడు నిర్వహించవలసిన పాత్ర గురించి సరియైన అభిప్రాయాలు వ్యాప్తిచెందినట్లయితే ‘‘రేపటి కథాసాహిత్యం’’ ఉజ్జ్వలంగా వుంటుందని కొడవటిగంటి కుటుంబరావు అభిప్రాయం. సమాజ శ్రేయస్సుకు దోహదప్రాయమైన ప్రజాసాహిత్య నిర్మాణంలో కథానిక తనవంతు పాత్రను తాను ఎంతవరకు నిర్వహించగలిగిందో బేరీజువేసే ప్రయత్నాన్ని మధురాంతకం రాజారాం చేశారు. కథ రాయడం అన్నదే కష్టమైన పని అనుకుంటే, ఇక ‘‘మంచికథ’’రాయడం మరింత కష్టమైన పని అని నిర్ధారించిన కోడూరి శ్రీరామమూర్తి, చివరికి నీతికి జాతికి సమన్వయం కుదిరినప్పుడు కథ మంచి కథగా ఎదగగలుగుతుందని తేల్చివేశారు. ‘‘సామాజిక ఉ ద్యమాల వెలుగులో తెలుగు కథానికా వికాసం’’ గురించి వివరంగా, విశే్లషణాత్మకంగా, ఆసక్తికరంగా తీర్చిదిద్దిన వ్యాసం రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డిగారిది. ఒకరి ఆలోచనలకూ, భావాలకూ, ఒక ధోరణిలో అక్షర రూపాన్ని ఇవ్వడం శైలి అని నిర్వచించిన శీలా వీర్రాజుగారు ఉదాహరణ ప్రాయంగా అద్భుతమైన శైలీ విన్యాసాన్ని ప్రదర్శించిన తెలుగు కథకులను పరిచయంచేసిన విధానం బాగుంది. ‘‘కథానిక: వస్తువు- శిల్పం’’ పేరిట వున్న మేడిపల్లి రవికుమార్ వ్యాసం కథాంశాల గురించి చర్చించింది.
వౌఖిక కథకు, లిఖిత కథకు మధ్యగల తారతమ్యాలను విశే్లషించిన డా.కేతు విశ్వనాథరెడ్డి, జానపద కథకుడి కంటే ఈనాటి కథానికా రచయితకు బరువుబాధ్యతలు ఎక్కువగా వుంటాయని హెచ్చరిస్తున్నారు. మామూలు రచయిత కథలో విషయ వివరణ చేస్తాడు. మంచి రచయిత దాన్ని ఆలోచనాత్మకం చేస్తాడు. కళాసూత్రాలు తెలిసిన గొప్ప రచయిత సౌందర్యమయం చేస్తాడని ‘‘కథాసౌందర్యం’’లో పాపినేని శివశంకర్ ఉదాహరణలతోసహా నిరూపించారు. మనుషుల్లో మాదిరి భాషలోకూడా కొన్ని తేడాలు వుండటం సహజం. అయినప్పటికీ ఈ తేడాలు స్వల్పమైనవే. ఏకరూపతే ఎక్కువ అంటూ పోరంకి దక్షిణామూర్తి ‘‘్భషాప్రయోగాలు- భావ వైచి(రు)త్యాలు’’అనే వ్యాసంలో వివరించారు. రూప విమర్శలో భాగంగా కథ-అనుబంధ ప్రక్రియల గురించి కె.పి.అశోక్‌కుమార్ చర్చించారు. తెలుగు కథకులు తొలినాటినుంచీ పాశ్చాత్య కథానికా లక్షణాలను అనుసరిస్తున్నా, యెప్పుడూ తమదైన తెలుగుదనాన్ని కూడా అవలంభిస్తూనే వున్నారని మధురాంతకం నరేంద్ర తెలియజేశారు. ఎల్లంపాటి వెంకట సుబ్బయ్య, రాసిన ‘‘కథ చదవడం ఎలా?’’అనే వ్యాసంలో రచయిత దృక్పథంనుంచి కథను శ్రద్ధగా చదివి అర్ధం చేసుకోవడం, పాఠకుని దృక్పథంనుంచీ కథ ఇచ్చిన జీవితానుభవాన్నీ, అనుభూతినీ విలువకట్టడం- ఈ రెండు అంశాల నేపథ్యంలో చేసిన చర్చ ఇందులో కనబడుతుంది. ‘‘కథానికా రచన-మెళకువలు’’ గురించి విహారి రాసిన వ్యాసం బాగుంది. కథలు రాయడానికి ఖచ్చితమైన సూత్రాలు లేవంటూనే సింగమనేని నారాయణ ‘కథ రాయడం గురించి..’ అనేక విశేషాలను తెలియజేశారు. ‘‘కథలెలా రాస్తారు?’’అనే వ్యాసంలో కాళీపట్నం రామారావు, రచనా రహస్యాన్ని ఛేదించిన కొంతమంది రచయితలను పరిచయం చేస్తూ కొత్త రచయితలకు కొన్ని ముఖ్యాంశాలను బోధించారు. ఇదే శీర్షికలో చందు సుబ్బారావు తెలియని విషయాల గురించి ఎలా రాయకూడదో తెలిసిన విషయాల్లో కూడా అనర్హమైన అంశాలను ఇతివృత్తాలుగా స్వీకరించకూడదంటూ మంచి సలహానే ఇచ్చారు. ‘‘కాబోయే కథకులకు పనికొచ్చే చిట్కాలు’’ పేరిట ఆరుద్ర రాసిన వ్యాసాన్ని కూడా చివరన చేర్చడం బాగుంది. సమాచారాత్మకంగా, విజ్ఞానాత్మకంగా వున్న ఈ వ్యాసాలు కథావిమర్శకు సరికొత్త ఊపునిస్తాయి. తెలుగు కథానికా ప్రక్రియకు అరసం అందిస్తున్న ఒక అపురూప కానుకైన ఈ వ్యాస సంకలనం ఒక శాస్ర్తియ కథానికా శాస్త్రం. కథానికా పాఠ్యగ్రంథం కొత్తగా రచనలు చేయాలనుకునే వారికీ, చేసేవారికీ, చేస్తున్నవారికి కూడా ఇది కరదీపికలా ఉపయోగపడుతుంది.

-కె.పి.అశోక్‌కుమార్