అక్షర

సమాజగతం - సమాజహితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘లొంగిన ప్రతిసారీ....’’ కవిత్వం
పచ్చల కిరణ్‌కుమార్
ప్రతులకు:
అన్ని ప్రముఖ
పుస్తక కేంద్రాలలో

దేశానికి వెనె్నముక అని చెప్పబడే ఆ కష్టజీవి- ‘‘ఒక్క ఘడియైనా ఉపశమనం ఇవ్వలేని ‘కౌలు’ భూమితో ఎంత వ్యవసాయం చేసినా ‘‘కంచంలో పిడికెడు
మెతుకులు వేయలేని’’ జీవితంతో తన
కుటుంబాన్ని
సాకుతుంటాడు అంటాడు.

సంఘజీవిగా మనిషి ఎప్పుడూ తననుతాను ఉన్నతుడిగా నిరూపించుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. కొన్ని సఫలాలు, కొన్ని విఫలాలు కొందరు విజేతలు, కొందరు అపజయులు. ఈ అత్యాధునిక యుగంలో ప్రపంచీకరణ నేపథ్యంలో కొత్త కోణంలో ఆవిష్కరించుకునే ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. స్వార్థం, త్యాగం ఒక్కచోట నిలువలేనట్లే ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలో విలువలు, వైరుధ్యాలుగా మారతూనే ఉన్నవి. ఆర్థిక సంబంధాలు అడ్డుగోడలై మనుషుల్ని వేరుచేస్తూనే ఉంటాయి. ఇందులో రాజకీయాలవి ప్రత్యేకమైన పద్ధతిలో ఉంటాయి. గాలిలో వాసనలా కలిసి ఉండే కనిపించని కొన్ని అన్యాయాలను కనిపెట్టిన కలాలు కవితా కరవాలాల్ని ఝుళిపిస్తూనే ఉన్నాయి. ‘లొంగిన ప్రతిసారీ...’ కవితా సంపుటి చదివితే ఆ కనిపించని అన్యాయాలు కనిపిస్తాయి. పచ్చల కిరణ్‌కుమార్ వ్రాసిన కవిత్వమంతా ఆవేదనను, ఆక్రందనను వ్యక్తపరుస్తూ పాఠకుల మెదళ్ళను పదునుపెడ్తుంది. ‘మరణాన్ని ఆహ్వానించిన పేదరికం’ అనే కవితలో
‘‘మనుగడకు/ భద్రతా భరోసాలేని/ అప నమ్మకాల భయం’’ అని కృషీవలుని పక్షాన మాట్లాడుతాడు కవి. రైతుల జీవితాల్లో అభద్రత ఎట్లాచోటుచేసుకుందో చూసిన కిరణ్‌కుమార్ దేశానికి వెనె్నముక అని చెప్పబడే ఆ కష్టజీవి- ‘‘ఒక్క ఘడియైనా ఉపశమనం ఇవ్వలేని ‘కౌలు’ భూమితో ఎంత వ్యవసాయం చేసినా ‘‘కంచంలో పిడికెడు మెతుకులు వేయలేని’’ జీవితంతో తన కుటుంబాన్ని సాకుతుంటాడు అంటాడు. ఇది స్వయంకృతాపరాధం కాదు. సమాజం తప్పిదం కొంత, పాలకుల తప్పిదం కొంత, లోపభూయిష్టమైన రాజకీయాలది కొంత సమతుల్య పర్యావరణం లేకపోడంవల్లా రైతులు నష్టపోతున్నారు. లోపం ఎక్కడున్నది? అన్యాయం ఎట్లా జరుగుతున్నది? అని వ్యధ చెందుతూ రైతుపాలిట ఏడ్పు మిగులుతున్నదన్న నిర్దుష్టమైన దృశ్యాన్ని ఆవిష్కరించాడు కిరణ్‌కుమార్. ‘‘కోల్పోయిన దానికోసం’’ అనే కవిత కవి బాధ్యతను సూచిస్తుంది. ‘‘వదులుకోలేని బంధానికి/ కుదించుకుపోతున్న జీవితానికి- మధ్య కాలం దహించుకుపోవడం అనివార్యం కాదు’’ అంటున్నప్పుడు వ్యక్తి చైతన్యమే జాతి చైతన్యమనే సిద్ధాంతానికి కొనసాగింపుగా ‘‘ఎవరి బతుక్కివారు భరోసానిచ్చుకోలేనప్పుడు ప్రళయమై వెంటాడుతున్నట్లే ఉంటుంది’’- అంటూ, ‘చలనం లేనితనాన్ని’ గురించి చెప్పడం గమనిస్తే, అది కవి హెచ్చరికగా అన్పిస్తుంది. ఎవరి బాధ్యతలువారు సక్రమంగా నిర్వహించు కుంటూ పోవాల్సిందే అంటాడీ కవి. ఎన్నో ఏళ్ళుగా ఎందరో కవులు కవితా సంపుటాలను వెలువరిస్తూనే ఉన్నారు. మంచి పుస్తకాలే కలకాలం నాలుకలపై నిలుస్తాయి. కవిత్వమంతా సామాన్యుని స్థాయికి అందాలనీ, ఆత్మాశ్రయ భావజాలాన్ని వదులుకొని, అభ్యుదయంగా, మార్క్సిజం భావాలతో సాగాలనీ, వచన కవిత్వానికి వ్యాకరణమైనా, అలంకారాలైనా ప్రజలేనని ఫ్రీవర్స్ ఫ్రంట్ స్థాపించిన కుందుర్తిగారు ఎన్నో విషయాలు వ్యక్తపరిచారానాడు. ‘‘కవిత్వం వ్రాసే కవి తాను సమాజంలో ఒకడుగా భావించుకొని, వర్తమాన స్వరూపాన్ని మార్చే కృషికి దోహదకారిగా కవితలు వ్రాయాలని’’ కుందుర్తి ఆంజనేయులుగారు చెప్పింది అక్షర సత్యం. కవులు నిజాయితీతో, చిత్తశుద్ధితో కవిత్వం వ్రాయాలి. సమస్యల పట్ల అవగాహన ఉండి బలమైన అభివ్యక్తితో వ్రాయాలి. పచ్చల కిరణ్‌కుమార్ కవిత్వంలో ఇది పుష్కలంగా ఉంది. ఈయన ఈ పుస్తకాన్ని ముందుమాట వ్రాసిన వరవరరావుగారు, ‘‘కిరణ్‌కుమార్ ఆర్టీసీ కార్మికుడుగా నిత్యం ప్రజలతో సంబంధం ఉన్న యువ కార్మికుడు’’ అని అంటూనే ‘‘జీవితంలోని నిత్య సమస్యలు, పోరాటాలు అర్థమవుతాయి. కార్మిక వర్గ దృక్పథం ఉన్నవాడు కాబట్టి ఆ వైయక్తిక సమస్యల్లోని సార్వజనీనతని పట్టుకొని శాస్ర్తియ పరిష్కారాలను వివరించగల చైతన్యము ఉంది’’అని కిరణ్‌కుమార్ కవిత్వాన్ని విశే్లషిస్తూ అన్నారు. వృత్తివల్ల, కవి హృదయంవల్ల మంచి కవిత్వం వచ్చింది. ఈ పుస్తకంలో ‘‘అద్దంముందు నిలబడి’’ అనే కవిత నుండి ‘‘విముక్తిపథం’’అనే కవితవరకున్న ఈ 39 కవితల్లో ప్రజాపోరాటాలు, విప్లవ పోరాటాలు, వీరులు, వారి మరణాలు, సామ్రాజ్యవాదుల అన్యాయాలు, దోపిడీవర్గాల అక్రమాలు, ప్రకృతి బీభత్సాలు, సమకాలీన సమస్యలు అన్నీ పేర్చి కవితలుగా తీర్చి మనసున్న మనుషుల ముందు ఆలోచనాగ్నిని అంటించేట్లు వ్రాశాడు.
‘‘శ్రమచేసి అక్షరాలను నెత్తినెత్తుకోవడమేగాని/ చెమట సెలమల్లో మునిగి గుడ్డకట్టుకోవడమేగాని/ ఎవడ్నో దోచేసో/ ఎవడ్నార్పేసో/ నేను బతకడం లేదు.’ అనగలడు. శ్రమజీవి పిడికిట శక్తితో పొట్టనింపుకోవడం, బుద్ధిజీవి విద్యార్జనతో జ్ఞానవాటికను నింపుకోవడం రెండూ ఉదారంగా తెచ్చుకునేవిగావు. ధనగర్వంతో విర్రవీగిన కరిమబ్బు ఒకటి చేసే ఛీత్కార వర్షాన్ని వ్రాస్తాడీకవి, మెరవని అగ్నిగా చెప్పగలుగుతాడీ కవి. ‘‘అసమానతల ఊబిలోనుండి/ నువు బయటకు రాలేకపోతున్నావని’’ తన ‘నిచ్చెనమెట్లు’ కవితలో అన్నా, ‘‘యుద్ధం ఎవరిముందు కాదురా/ బతుకు అనివార్యమైనప్పుడు’’అని ‘రణం తప్పదు కవితలో అన్నా, ‘‘కనుకొనుకుల్లో సంద్రాలను సృష్టిస్తున్న/ పోటీ ప్రపంచాన్ని/ ఇంకా కేబుల్ బంధంలా అల్లుకుపోలేను’’ అని ‘లొంగిన ప్రతిసారి’ అనే పతాక శీర్షిక వంటి కవితలో అన్నా కవి గొప్పనమ్మకంతో కవిత వ్రాశాడనవచ్చు. అన్యాయం, అధర్మం విషం కక్కినప్పుడు కవి గొంతుక లేస్తుంది. సాంఘిక అసమానత, రాజకీయ పరాధీనత ఖండించని కవి కవిగాడు. ఎప్పుడో ముప్పయ్యవ దశకంలోనే అభ్యుదయ కవితాఝరి ప్రవచించిన నేల మన నేల. దీర్ఘకాలిక సాయుధ పోరాటాలను, కమ్యూనిస్ట్, రైతాంగ పోరాటాలను జరిపిన నేల ఈ నేల. దళిత వాదం, స్ర్తివాదం, మైనారిటీవాదం, విప్లవవాదాలకు బాసటగా నిలిచిన సాహిత్య క్షేత్రం ఇది. మరి వీటి ప్రభావం పడిన కవిగా పచ్చల కిరణ్‌కుమార్ కవిత్వం తనదైన శైలితో సాగుతుంది. ‘‘నూరేళ్ళ కాళోజి చూపులనుండి / ఏ గుట్టను తడిమినా నెత్తుటి చెమ్మే’’ అని వ్రాయగలడు, ‘‘ఎండిన డొక్కలు/ వొలికిన కన్నీరు/ మండిన గుండెలు/ ఇవన్ని మనకెందుకని/ సామ్రాజ్యవాద విష సంస్కృతిలో/ భారంగానో/ బరువుగానో/ ఎవరి గదిలోవారు/ ఒకరికొకరం/ తెలియనట్టే బతికేద్దాం’’అని వ్రాయగలడు. ఘశ జఒ ఆ్దళ ౄళ్ఘఒఖూళ యచి ళ్పళూక ఆ్దజశ అనే సంధేశంతో ఉన్న కవిత్వం డఆళ్ఘౄ యచి ష్యశఒషజ్యఖఒశళఒఒ ని తనలో ఇముడ్చుకుంటూ చైతన్యధారతో ఇట్లా సాగుతూనే ఉంటుందని ఈ ‘‘లొంగిన ప్రతిసారీ’’ పుస్తకం చదివితే తెలుస్తుంది.

-కొండపల్లి నీహారిణి