అక్షర

పరిచయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశం అతి పురాతన కాలం నుండి సంస్కృతీ సత్సంప్రదాయాలకు ఆటపట్టయి ప్రపంచంలోని వివిధ దేశాలకు తలమానికముగా నిలిచినది. వివిధ శాస్త్రాలలో ఉన్నతాభ్యాసానికి పలు దేశాల విద్యార్థులు ప్రాచీన కాలమున భారతదేశం నాశ్రయించి రనుటకు అనేక నిదర్శనాలున్నాయి. ప్రాచీన భారతీయ శాస్త్ర గ్రంథాలు ఏనాడో ఇతర దేశ భాషలలోకి తర్జుమా చేయబడినవి. భారతీయ విజ్ఞాన జ్యోతి ప్రపంచానికి కొత్త వెలుగులు ప్రసాదించింది. అయతే, ఈనాడు మన ప్రాచీనులను గురించి, మన ప్రాచీన గ్రంథాలను గురించి పలువురి భారతీయుల ఆలోచన తమను తాము కించపరచుకొనేదిగా ఉన్నది. పాశ్చాత్యుల ప్రభావానికి లోనయిన అనేకులు ప్రాచీన భారతీయులు వివిధ శాస్త్ర పరిజ్ఞానము లేక మూఢ నమ్మకాలతో మత విశ్వాసాలతో జీవించేవారని భావించేవారు. వేద కాలమున పశు వైద్యం ప్రాథమిక దశలో నున్నది. అనేక విధములగు రోగములను నివారించుటకు మంత్రములు, తాయెత్తులు సూచింపబడినవి. పశు పాలన, పోషణ విషయమై వేద కాలమున చూపబడిన శ్రద్ధ ప్రశంసనీయమనీ, ఆయా అంశాలను ఎంతో చక్కగా ఈ గ్రంథంలో క్రోడీకరించారు.

ప్రాచీన భారతీయ పశు విజ్ఞానం.. -డా.సూర్యదేవర రవికుమార్
వెల: రూ.100/- ప్రతులకు: గుళ్లపల్లి సుబ్బారావు సేవా సంస్థ, 2వ లైను, నలందా నగర్, గుంటూరు - 522 006.