అక్షర

ఒక పోరాటం.. ఒక జీవితం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామ్రేడ్ పద్మ
-జంపా గౌతమ్‌రావు,
వెల:రూ.75
ప్రచురణ: జయంతి
పబ్లికేషన్స్,
కార్ల్‌మార్క్స్‌రోడ్,
విజయవాడ
---
పదిహేనేళ్ల క్రితం ఈ పుస్తకం ఆమె జీవితమే.. ఒక పోరాటం రూపంలో వెలువడింది. అంతకుముందే పుచ్చలపల్లి సుందరయ్యగారు వీర తెలంగాణ పోరాటం గురించి రాసిన పుస్తకంలో కామ్రేడ్ పద్మ గురించి ప్రత్యేకంగా
ప్రస్తావించారు.
---
నిజాం నిరంకుశ పాలన నుంచి, రజాకార్ల దారుణకాండ నుంచి ప్రజలను విముక్తిచేయడానికి తెలంగాణ ప్రాంతంలో సాగిన చారిత్రక సాయుధ పోరాటంలో కామ్రేడ్ పద్మది అసమాన పాత్ర. నలభయ్యో దశకం చివరినాటి తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకి చేతబట్టి వీరోచితంగా పోరాడిన కామ్రేడ్ పద్మ గురించి వెలువడిన చారిత్రక సాహిత్యం నిజానికి చాలా తక్కువే.
పదిహేనేళ్ల క్రితం ఈ పుస్తకం ఆమె జీవితమే.. ఒక పోరాటం రూపంలో వెలువడింది. అంతకుముందే పుచ్చలపల్లి సుందరయ్యగారు వీర తెలంగాణ పోరాటం గురించి రాసిన పుస్తకంలో కామ్రేడ్ పద్మ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కామ్రేడ్ పద్మ స్ఫూర్తిదాయక, పోరాట పటిమను ఇతివృత్తంగా తీసుకుని వుప్పల లక్ష్మణరావుగారు గెరిల్లా అనే పుస్తకాన్ని కూడా రాశారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో అమరుడైన భర్తను ఆదర్శంగా తీసుకుని.. ఆయన ఆశయ పథంలో అత్యంత క్లిష్టమైన బాధ్యతలు నెరవేర్చిన పద్మ.. తన సహచర కామ్రేడ్‌ను పార్టీ ప్రోత్సాహంతో కులాంతర పునర్వివాహం చేసుకుంటారు. అయితే సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించాల్సిన దశ వచ్చినప్పుడు వారికి పుట్టిన బిడ్డను పురిట్లోనే పరాయివారికి అప్పగించాల్సి వస్తుంది. అది పార్టీ నిర్ణయం. సుదీర్ఘకాలం కొనసాగబోయే సాయుధ పోరాటానికి ఈ పసికందు అడ్డంకి అని పార్టీ భావించి వేరేవాళ్లకు అప్పగిస్తుంది. ఇంతాచేసి సాయుధ పోరాటాన్ని ఏడాదిలోపే విరమించుకుంటారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో మహత్తర త్యాగాలను చేయవలసి వచ్చింది. భర్తను బస్తరు అడవులకు పంపి, కన్నబిడ్డను పరాయివాళ్లకు అప్పగించిన కామ్రేడ్ పద్మ త్యాగం ఉన్నత స్థాయినందుకున్నది అని పుచ్చలపల్లి సుందరయ్యగారు తన పుస్తకంలో రాశారు.
అయితే... ప్రజాఉద్యమాల్లో.. ముఖ్యంగా.. కుటుంబాన్ని, పిల్లలను, ప్రాణాలను ఫణంగాపెట్టి పాల్గొనే సాయుధ ఉద్యమాల్లో మహిళల పాత్ర ఏమిటి? వారిపట్ల.. వారిని నడిపించే పార్టీ నాయకత్వాలకు మహిళల సమస్యలపై వున్న అవగాహన ఏమిటి? అనే దానిపై తర్వాత కాలంలో చాలా ఆలోచనాత్మక చర్చ జరిగింది, జరుగుతోంది.
కామ్రేడ్ పద్మ పుస్తకం.. ఒక వ్యక్తి జీవిత చరిత్ర కాదు. ఒక తరం జీవిత చరిత్ర. ఒక చారిత్రక రైతాంగ పోరాటంలో అసమాన పాత్ర పోషించిన ఒక మహిళ చరిత్ర. గతంలోనూ, వర్తమానంలోనూ, భవిష్యత్తులోనూ ఇటువంటి పోరాటాలలో మహిళల పాత్రకు సంబంధించి లోతుగా విశే్లషించుకోవడానికి ఉపకరమైన చరిత్ర.. కామ్రేడ్ పద్మ జీవిత చరిత్ర.

- వాసిరెడ్డి