అక్షర

ప్రాణ రసాన్ని పంచే కవితలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పత్రహరితం
దర్భశయనం శ్రీనివాసాచార్య
పేజీలు: 68;
వెల: రూ.80/-
ప్రతులకు: ప్రముఖ
పుస్తక కేంద్రాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా
**
దర్భశయనం శ్రీనివాసాచార్యగారు దశాబ్దాలుగా కవిత్వం రాస్తున్నారు. ప్రపంచాన్ని, ప్రకృతిని, వ్యక్తుల్ని, సంఘటనల్ని పరిశీలిస్తూ ఆయన తన అనుభూతుల్ని ఆవిష్కరిస్తూపోతున్నారు. జీవన రస రహస్యం తెలిసిన కవి ఆయన. విస్పష్టంగా, సూటిగా మన హృదయాల్ని తాకే కవితలు ఆయనవి.
ఆయన యిటీవలి కవితా సంపుటి ‘పత్రహరితం’. తమ మధురమయిన వాక్యాలు, యుద్ధ సన్నద్ధంచేసే కవితలూ రాస్తారు. కానీ రెండో వాటికే ప్రాధాన్యమిస్తాను’ అంటారు. అంటే చైతన్యానికే ఆయన ప్రథమ స్థానమిస్తాడు.
ఒక ఏకాంత ప్రశాంతత నించి గొప్ప శక్తిని అందుకుంటాం. దానికి మనం సిద్ధంగా వుండాలి. సౌందర్య దృష్టి వుండాలి.
లేచీ లేవడంతోనే ఆకాశ వేదికమీద సూర్యుని
ఉదయగాన ప్రశాంతతను విను
గానాన్ని వింటూ శుభ్రపడే ధాత్రీ క్షేత్రపు సోయగాన్ని చూడు
అంటూ సాగి రాలిన పూల రాగాల్ని వినమంటాడు. చెరువు నీరు తేట గానాన్ని వినమంటాడు. అరణ్య ఆనందాన్ని జుర్రుకోమంటాడు. పక్షుల్తో కలిసి ప్రయాణించమంటాడు. నక్షత్రాకాశాన్ని చూసి పరవశించమంటాడు. విద్యకు ముందు వీటన్నిటికి తలవంచి నమస్కరించమంటాడు.
పరవశంతో ప్రకృతిని పరిశీలించే కవి ఆయన. ప్రకృతి నించి ప్రాణశక్తిని గ్రహిస్తాడు. పది మందికి పంచుతాడు.
ఏ దృశ్యం చూసినా ఆశ్చర్యంగా పసివాడిలా ప్రతిస్పందిస్తాడు. ఇక సమాజాన్ని చూసినా ఆ సామాజిక సమస్యల్ని ఎదుర్కోడానికి ఆంతరిక ప్రయాణం అవసరం అంటాడు.
ఈ అంతర్ దర్శనం లేకుండా రేపు
ఏ బాహ్య దర్శనానికెళ్ళగలను?
ఈ విచక్షణ, వివేకం ఆయనది. ఈ సమన్వయంతోనే ఆయన ఒక సామరస్యాన్ని, సౌమనస్యాన్ని సాధించాడు.
ఆయన బలానికి, భావుకత్వానికి ఈ కవితలు నిదర్శనాలు.

-సౌభాగ్య