అక్షర

తెలంగాణ పోరాట వారసత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-జి.రాములు
వెల: రూ.25/-
ప్రతులకు: నవతెలంగాణ
పబ్లిషింగ్ హౌస్
ఎం.హెచ్.్భవన్,
ప్లాట్ నెం.21/1
అజామాబాద్,
ఆర్‌టిసి కళ్యాణ
మండపం దగ్గర,
హైదరాబాద్-20.
040-27660013
**
తెలంగాణ సాయుధ పోరాటం గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా ఉత్తేజకరంగానే ఉంటుంది. ఈ మహత్తర పోరాటంపై వచ్చినన్ని రచనలు, సాహిత్యం రాష్ట్రంలో మరే ఇతర పోరాటానికి రాలేదంటే అతిశయోక్తి కాదు. స్వాతంత్య్ర పోరాటం తర్వాత దేశంలోనే గుర్తించబడ్డ అతి పెద్ద పోరాటమిది. విప్లవోద్యమకారులకి దొక పాఠ్యాంశంగా మిగులుతుందనడంలో సందేహముండబోదు.
నిరంకుశ రాజరికానికి వ్యతిరేకంగా, భూస్వాముల నిర్బంధ దోపిడీ, వెట్టిచాకిరీ నుండి విముక్తికై సాగిన వీరోచిత పోరాటమది. నిరుపేదలుగా, నిరక్షరాస్యులుగా దుర్భర జీవితాలు గడుపుతున్న సామాన్య జనం వీర కిశోరాలై, రాజరికాన్ని, భూస్వామ్య దోపిడీని సవాల్ చేసి విజయం సాధించిన చారిత్రాత్మక ఘట్టం తెలంగాణ రైతాంగ పోరాటం.
ఆ వారసత్వ బాటలో ఎవరున్నారు? ఎవరు దానికి ద్రోహం చేస్తున్నారు? ఎవరు దానిని వక్రీకరిస్తున్నారు? అనే అంశాలు ప్రస్తుత తరానికి తెలిపే ప్రయత్నమే ఈ పుస్తకం. పోరాట నేపథ్యం, వీరోచిత ప్రజల పోరాటం, సాధించిన విజయాలు, అనుభవాలు, గుణపాఠాలు సంక్షిప్తంగానైనా ప్రస్తావించుకోవడం అవసరం. *