అక్షర

హృద్యంగా సాగిన ప్రినె్సస్ యశోధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రినె్సస్ యశోధర
చారిత్రక నాటకం
-సి.శ్రీనివాసరాజు
ఖరీదు 125 రూపాయలు
లభించే చోటు: ఇ.వౌనిక, ఇం.నెం.7-2-447,
మంకమ్మతోట,
కరీంనగర్- 505001.
**
ఈ నాటకం గౌతమ బుద్ధుడి సతీమణి యశోధర గాథ.
నాటకం లక్షణం సూత్రధారి ముందుగా వచ్చి నాందీ ప్రస్తావన చేయడంతో నాటకం ప్రారంభం అవుతుంది. కపిలవస్తు రాజు శుద్ధ్ధోనుడు భార్య, గౌతమీదేవిల పుత్రుడు సిద్ధార్థుడు. కోలీయు రాజపుత్రిక యశోధర. ఆమె సిద్దార్థుడిని ప్రేమించి అన్నగారిని, తండ్రిని కూడా ఎదిరించి అతనినే వివాహం చేసుకుంటుంది.
లోకంలో ఉన్న దుఃఖం, వార్థక్య మరణాలు, దారిద్య్రం చూసి వికల మనస్కుడైన సిద్దార్థుడు వివాహానంతరం భిక్షువుగామారి దేశం విడిచి వెళ్లిపోతాడు.
గర్భవతియైన యశోధర పుత్రుడిని కంటుంది. రాజు కావాల్సిన కొడుకు సన్యాసిగా వెళ్లిపోడం శుద్ధ్ధోనుడు వేదనకి కారణం అవుతుంది. భర్త సన్యాసిగా మారడం బాధగా ఉన్నా, యశోధర భర్త అభీష్టాన్ని గౌరవించి అతని నిష్క్రమణాన్ని హుందాగా స్వీకరిస్తుంది.
కుమారుడు ఏడేళ్ల ప్రాయంలోకి వచ్చాక తల్లి, తండ్రులను, భార్యను, కుమారుడిని చూసేందుకు వచ్చిన సిద్ధార్థుడు కుమారుడు రాహుల్‌ని కూడా తనతోపాటు భిక్షువుగా తీసుకుని వెళ్లిపోడంతో హతాశురాలవుతుంది యశోధర.
చివరికి ఆమె కూడా భిక్షునిగా మారి భర్త అడుగుజాడల్లో నడిచి వృద్ధాప్యం రావడంతో మహాభి నిష్క్రమణం చేస్తుంది.
యశోధర ఒక మహోన్నత స్ర్తిమూర్తిగా ఇందులో మనకి కనిపిస్తుంది.
ప్రారంభంలో కన్యగా సిద్ధార్థుడిపైన మనసు పడడం, అతనితో వివాహానికి అన్నగారిని ఎదిరించడం, భర్తతో సమానంగా చమత్కారంగా మాట్లాడడం, ఇవన్నీ ఒక సాధారణ యువతిగానే మనకి కనిపించిన యశోధర సిద్దార్థుడు భిక్షువుగా మారడంతో దుఃఖాన్ని గుండెల్లో అణచుకుని భర్త అడుగుజాడల్లో నడవడం హృదయాన్ని ద్రవింపచేస్తుంది.
అపూర్వమైన వ్యక్తిత్వంకల యశోధరని అంత అద్భుతంగా చూపించే ప్రయత్నం చిన్న, చిన్న సన్నివేశ కల్పనలతో ఎంతో చక్కగా చూపించారు రచయిత.
సిద్దార్థుడు తనను వదలి వెళ్లి తరువాత ఆమె ప్రదర్శించిన నిగ్రహం, సౌశీల్యం, ధర్మబద్ధమైన జీవితం ఆమెను ఉన్నతస్థాయికి చేర్చాయి. ఆమె ఔన్నత్యంవల్లనే సిద్ధార్థుడు విజయం సాధించగలిగాడు... బుద్ధుడిగా సర్వసంగ పరిత్యాగిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. బుద్ధుడు ధర్మపత్నిగా యశోధర కూడా సర్వస్వం త్యాగంచేసి వృద్ధాప్యం రాగానే నిర్యాణం చెందడానికి భర్త అనుమతి కోరుతుంది.
ప్రదర్శనాత్మకంగా చక్కగా రచించిన ఈ నాటకం ఎంతో హృద్యంగా ఉంది. ప్రినె్సస్ యశోధర అని పేరుపెట్టడం చాలా బాగుంది.

-అత్తలూరి విజయలక్ష్మి