అక్షర

వ్యక్తిత్వ వికాసానికి దిశా నిర్దేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమృత వర్షిణి
-డా.కె.వి.రమణ
వెల: రు.50/-
ప్రతులకు: శ్రీ వేదగిరి
కమ్యూనికేషన్స్
బ్లాక్-6.. ఫ్లాట్ 10
హెచ్‌ఐజి-1, బాగ్‌లింగంపల్లి,
హైదరాబాద్-500 044
**
‘అమృతవర్షిణి‘ కృతికర్త డా.కే.వి. రమణ జగమెరిగిన జనబంధు. బహుముఖ ప్రజ్నానిధి. పునరుక్తమైనా సమీక్షకు నేపథ్యంగా అతి సంగ్రహంగా కొన్ని వాక్యాలు:
పరిపాలన, సాహిత్యం, కళలు, సంస్కృతి, ఆధ్యాత్మికత, సమాజ సేవాది రంగాల వికాసం కోసం విశిష్ట కృషి చేయడమే కాక ప్రతీ రంగంపైనా తనదైన విలక్షణ ముద్ర సుస్థిరం చేసిన ప్రతిభామూర్తి డా.కె.వి.రమణ. ప్రతి రంగానికి ఆప్తుడాయన. వేలాది ఉత్తమాభిమానులలో ప్రతి ఒక్కరిని పేరుపెట్టి పిలిచి ఆప్యాయతను పంచే సుహృన్మణి. గళం విప్పినా కలం కదిపినా విషయ సమగ్రత, భావ సాంద్రత, పాండితీ ప్రాభవం, అభివ్యక్తిగరిమ ప్రస్ఫుటమవుతాయి. రసాయన శాస్త్రంలో స్నాతకోత్తర పట్టం అందుకున్నా, మాతృభాషపై అభిమానంతో మూడు వందలకు పైగా 1991-2000 మధ్య వెలువడిన పద్య కావ్యాలన్నిటినీ విశే్లషించి ‘పద్యకవిత్వం-వస్తు వైవిధ్యం’పై నిబద్ధతతో పరిశోధన చేసి, పిహెచ్‌డి స్వీకరించిన పరిశోధక శేఖరుడు. ఐఎఎస్ అధికారిగా డిప్యుటీ కలెక్టరు మొదలు సచివాలయంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి వరకు ఎన్నో ఉన్నత పదవులు అత్యంత సమర్థంగా నిర్వహించి, ప్రతి పదవికి వనె్న తెచ్చిన పాలనామ్రవణుడాయన. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం సలహాదారుగా ఆయనకు ఆయనే సాటి. ప్రజలనుంచి ప్రభుత్వంనుంచి గొప్ప మన్ననలు పొందిన ఘనత ఆయనది. డిప్యుటీ కలెక్టరు తరువాత పదోన్నతిపై వెడుతున్న సందర్భంలో వీడ్కోలుకు ఆయన హృదయ స్పందన ‘్భవిష్యత్తులో ప్రజలే నా లక్ష్యం. ప్రజలే నా చిరునామా కావాలి. నేనేం చేసినా వారికది ఉపయోగపడాలి’. అన్ని స్థాయిల అధికారులకు ఇది అనుసరణీయం. ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అన్నట్టు ఆయన ‘క్రమశిక్షణ, మానవీయతను మేళవించుకున్న ధీమంతుడు, సంప్రదాయాన్ని ఆధునికతను సమతులంగా జీర్ణించుకున్న జిజ్ఖాసి.
ఆకాశవాణిలో ప్రసారమైన ‘్భవన’ ప్రసంగాలు, రచన పత్రిక కోసం రాసిన వ్యాసాలు మొత్తం 50 ఈ గ్రంథంలో సంపుటీకరించారు.వ్యక్తి ఉత్తమ జీవిత ప్రధాన ప్రస్థానించడానికి ఈ వ్యాసాలు వెలుగుబాటలు పరుస్తయి. ‘లోకసహజమైన అంశాలపట్ల అప్పుడప్పుడు తీగలుగా సాగిన భావ వల్లరికి అక్షర రూపమే ఈ ప్రయత్నం‘ అంటారు రచయిత. సక్రమ జీవితానికి, సద్గుణ సంపదకు, ధర్మాచరణకు సమస్యా పరిష్కారానికి తాత్విక చింతనకు వ్యక్తిత్వ వికాసానికి ఇది దిశా నిర్దేశం చేస్తాయి. అందుకు తగిన వస్తువరణం చేసారు. సజ్జన సాంగత్యం, వినయ విధేయతలు, ఓర్పు, వేదన, శీలం, దానం, భయం, నేను, ఆనందం తామరాకులా నిలవాలి వంటి శీర్షికలతో లలిత సుందర శైలిలో సాగిన ఈ వ్యాసాలు పరమ పఠనీయంగా వున్నాయి. భావన వ్యాసాలకు రచయిత విలక్షణమైన ప్రసంగ శైలి ఉఫయోగించడం ఒక ప్రత్యేకత. వాక్యనిర్మాణం ఆకట్టుకునే రీతిలో వుండడం గమనార్హం. ఇక అంశాన్ని మరింత రూడిగా చెప్పేందుకు ఆయా సందర్భాలలో ఒకమాటన పునరుక్తం చేసారు. కొన్నిచోట్ల దీర్ఘ వాక్యాలు ఆశ్చర్యపరుస్తాయి. ఇది పాఠకుల హృదయాలను ఆయా అంశాలు గాఢంగా హత్తుకునేందుకు ఉపకరిస్తాయి. సామెతలు, నానుడులు, పురాకథలు, శ్లోకాలు, పద్య భాగాలు, ఉపమానాలు, మహనీయుల హితోక్తులు, సూక్తులు మొదలైనవాటిని ఉదహరించి ఆయా ప్రతిపాదింతాంశాలను ప్రమాణబద్ధం చేసారు. అంశంపై ఉత్కంఠను కలిగించే వాక్యంతో వ్యాసం ఆరంభమవుతుంది. వ్యాసాంతంలో పాఠకులు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన సంక్షిప్త వాక్యం ఉంటుంది.
ప్రతి వ్యాసంలోను ఉదహరించతగిన అంశాలెన్నో వున్నాయి. సమీక్షా పరిమితి దృష్ట్యావాదిగా కొన్ని వ్యాసాలనే ప్రస్తావించే అవకాశం ఉంది. ‘మనిషి ఆశాజీవి’ వ్యాసంలో ‘ఆశ నావకు చుక్కానిలా మానవుని పురోగమనానికి దోహదపడుతుంది. ప్రతి మనిషికీ కోరికలు వుండడం సహజమే. కానీ గొంతెమ్మ కోరికలు కోరడం మానుకోవడం శ్రేయస్కరం’ అంటారు. ‘నేటి యువతీ యువకులు స్వార్ధం, దౌష్ట్యం, లౌల్యం విడనాడి సత్వరజోస్తమో గుణాలకు అతీతులై సద్గుణ సంపన్నులై, రత్నదీపాల్లా జాతి రత్నాల్లా భాసిల్లాలి’ అని హితం పలుకుతారు ‘మానవుల్లో తెగలు’ వ్యాసాంతంలో. ‘వినయ విధేయతలు’ వ్యాసం తల్లిదండ్రులందు దయలేని పుత్రుడు పుట్టనేమి? వాడు గిట్టనేమి? వేమన పద్యభాగంతో మొదలవుతుంది. ‘ఆత్మీయత’ వ్యాసంలో దంపతులకిచ్చిన సూచన ‘్భర్యాభర్తల మధ్య ఉండాల్సిన అనువర్తనం ఉభయ నిష్ఠం-హెచ్చుతగ్గులకు తావీయనట్టి స్థితి.’’. ‘ఓర్పు’ వ్యాసంలో సుందర పాండ్య చక్రవర్తి తన ‘ఆద్యావళి’లో చెప్పిన శ్లోకాన్ని ఉదహరించారు. ‘ఓర్పుగల నేర్పరులుగా మనల్ని మనం మలచుకోవడానికి ప్రయత్నిద్దాం’ అని ముగిస్తారు. ‘వేదన’ వ్యాసంలో కానవచ్చే అద్భుత భావం ‘మనిషి మనస్సుకు కలిగే వేదన’ ‘మధ’నమైతే ఆ మధనంలో నుండి వికసించే ఆలోచనే వేదందం-అదే జ్ఞానం’ శే్వతకేతువు కథ ‘నాలుగు దిక్కులు’ వ్యాసానికి ఆధారమవుతుంది. ‘మాటల్లో ఆటలు’ వ్యాసంలో 23 రకాల ఆటలు పేర్కొనడం రచయిత నిశిత పరిశీలనకు తార్కాణం. ‘నీటిపై తామరాకులా నిలవాలి’ వ్యాసంలో చేసిన తాత్విక బోధన ‘మనం దేహత్మ భ్రాంతిని త్యజించాలి. ‘తాను’ వేరు, ‘మేను’ వేరు అని తెలిసికొని మసలాలి’ ఆ వ్యాసం గీతా శ్లోకంతో ప్రారంభిస్తారు. ‘మనకున్న విలువైన సంపద-సమయమే’ వ్యాసంలో సమయం విలువ విద్యార్థి, గుమాస్తా, ఎడిటర్, రోజుకూలీ, ఫ్లైట్ మిస్సయిన ప్రయాణీకుడు, అథ్లెట్‌లకు ఎలా వర్తిస్తుందో చెప్పిన తీరు ఆశ్చర్యపరుస్తుంది.
అన్ని వయో వర్గాల వారికి అత్యంత ప్రయోజనకరమైన ‘అమృత వర్షిణి’ గ్రంథాన్ని రచించిన డా.కె.వి.రమణ అభినందనీయులు. ఇదే క్రమంలో మున్ముందు వ్యాస సంపుటాలు రూపొందించాలని పాఠకలోకం కోరుకుంటుంది.

-జిఆర్కే