అక్షర

రోజుకో నీతి కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-పి.రాజేశ్వరరావు
వెల: రూ.250/-
ప్రతులకు:
నవచేతన,
నవ తెలంగాణ
ప్రజాశక్తి బుక్‌హౌస్‌లు
**

ఇటీవల సర్వేల ప్రకారం రోజుకు మూడు గంటలు టీవీ చూసేవారికంటే రోజుకు కనీసం ఒక గంటయినా పుస్తకాలు చదివే వారి ఆయుష్షు పెరుగుతుందని అన్నారు శాస్తజ్ఞ్రులు. అసలు చదివితే మాకేంటి లాభం? అనే పిల్లలూ నేడు లేకపోలేదు. ఏ పుస్తకాలు చదివితే ఏ ప్రయోజనం ఉంటుంది అనే విషయం పిల్లలకే కాదు, ఎంతోమంది పెద్దలకు కూడా తెలియదు. మహానుభావుల ఆత్మకథలు, జీవిత చరిత్రలు చదివితే వారు తమ జీవితంలో ఎన్ని కష్టాలు పడిందీ, ఆ కష్టాలను ఎలా ఎదుర్కొందీ తెలుస్తుంది. వాటిని మన జీవితాలకు అన్వయించుకొని అపజయాలు ఎదురైనపుడు నిరాశా నిస్పృహలు చెందకుండా విజయాలను సాధించవచ్చు. నీతి కథల్లాంటివి చదువుతున్నప్పుడు ఆ పాత్రలన్నీ మన కళ్ల ముందు కదలాడుతున్నట్టే ఉండి, మన జీవితంలో ఎలా నడచుకోవాలో, ఎలా నడచుకోకూడదో తెలియజేస్తాయి. పుస్తకాలు చదివే అలవాటున్న పిల్లలు వారు చదివింది తొందరగా అర్థం చేసుకోగలరు. పుస్తకాలు చదవడం వల్ల పిల్లల్లో ఆలోచనా శక్తి పెరుగుతుంది. కొత్త పదాలు తెలుస్తాయి. చక్కని భాష వొంటబట్టి మంచి శైలి అబ్బుతుంది. నేటి కాలానికి అనుగుణంగా ఈ పుస్తకంలో 365/366 నీతి కథల్ని ‘రోజుకో నీతికథ’ పేరుతో నేటి పిల్లలకు, పెద్దలకు, ఉపాధ్యాయులకు, రాజకీయ నాయకులకు అందించారు.