అక్షర

సంక్షిప్తంగా సాయుధ పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ సాయుధ
ప్రజాపోరాటం
-పుచ్చలపల్లి సుందరయ్య
వెల: రూ.100
ప్రతులకు: నవ తెలంగాణ
బుక్‌హౌస్,
ప్రజాశక్తి బుక్‌హౌస్ బ్రాంచీలు

నిజాం నవాబుపై, రజాకార్లపై, దొరలపై ఎర్రజెండా నాయకత్వాన తెలంగాణ రైతాంగం తిరగబడి సాగించిన సాయుధ పోరాటం గురించి పుచ్చలపల్లి సుందరయ్యగారు సంక్షిప్తంగా వివరించిన పుస్తకం ఇది. తెలంగాణ సాయుధ పోరాటం గురించి ఎన్ని వేల పేజీలు రాసినా.. ఇంకా రాయవలసింది మిగిలే వుంటుంది. ఆ పోరాటం గురించి సుందరయ్య విపులమైన రచనలు అనేకం చేశారు. ఈ పుస్తకం మాత్రం సంక్షిప్తంగా నాలుగు అధ్యాయాలలో 165 పేజీలతో ముగుస్తుంది. తెలంగాణ సాయుధ పోరాటం గురించి రేఖామాత్రంగా తెలుసుకోవడానికి ఈ పుస్తకం దోహదపడుతుంది. ఇది చదివిన తరువాత నాటి పోరాటాన్ని గురించి మరింత లోతుగా తెలుసుకోవాలనే జిజ్ఞాస కలుగుతుంది. ఈ పుస్తకంలో అనేక పోరాట ఘట్టాలు, అనేక మంది పోరాటయోధుల గురించి ప్రస్తావన లేకపోవడం వాస్తవం. అయితే.. ఇది సంక్షిప్త పుస్తకం. వౌలిక విషయాలు, వివరాలు తెలుసుకోవడానికి ఉపకరించే పుస్తకం. తెలంగాణ సాయుధ పోరాటం గురించి సుందరయ్యగారే రాసిన బృహత్ గ్రంథం చదివి, మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ప్రేరేపించే పుస్తకం. 1951 అక్టోబర్ 21న సాయుధ పోరాటాన్ని కమ్యూనిస్టు పార్టీ విరమించుకున్న రెండు దశాబ్దాల తర్వాత.. నాటి పోరాటానికి నేపథ్యం, అందులో సాధించిన విజయాలు, ఎదుర్కొన్న అపజయాలు, పార్టీపరంగా జరిగిన పొరపాట్లు, వ్యూహాత్మక తప్పిదాలను, ఒప్పిదాలను సమీక్షిస్తూ రాసిన పుస్తకం ఇది.

-వాసిరెడ్డి