అక్షర

ఆసక్తి గొలిపే మహారాజశ్రీ మామ్మగారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మహారాజశ్రీ
మామ్మగారు’
(నవల)
మనె్నం శారద
వెల: రు.120/-
కాపీలు దొరుకు స్థలం జ్యోతివలబోజు
-్ఫన్ నంబర్ 8096310140
**

మనె్నం శారదగారు ఎన్నో కథలు ఎన్నో నవలలు రాసి పాఠకుల మెప్పు పొందారు. చాలా కాలంనుంచి రాస్తున్న రచయిత్రుల్లో మనె్నం శారదగారొకరు. మధ్యలో కొన్నాళ్లు, కలానికి విశ్రాంతి కలిగించినా మళ్లీ రచనా రంగంలో కలంపట్టారు. చిగురాకు రెపరెపలలోనే (ఆమె మాటల్లోనే) భావ పుష్ఠి, రచనా శక్తి వున్న వ్యక్తి కనుక కథలు, నవలు రాస్తూ వచ్చారు. ప్రముఖ దిన వార పత్రికల్లో వీరి నవలలు కథలు పాఠకులకు సుపరిచితం. ఈ నవల ఆంధ్రప్రభ డైలీలో చాల కాలం క్రితం ధారా వాహికంగా ప్రచురించబడింది. ఇది కేవలం హాస్యభరితం కాదు-నవరసభరితం. చిన్న డిటెక్టివ్ నవలగా కూడా అనిపిస్తుంది. మామ్మగారూ, దుర్గాంబిక గారూ, తరువాత మనవరాలు హరిణీ కూడా డిటెక్టివ్‌ల్లా పనిచేస్తారు. చివరంటూ ఆసక్తిగా చదివిస్తుంది నవల. పుస్తకాన్ని అందంగా ముద్రించారు జె.వి.పబ్లికేషన్స్. ఏకబిగిన చదివించే నవల. మామ్మగారు అలాంటి ఇలాంటి మామ్మకాదు-్ధర్యశాలి! మరి చదవండి.

-శారదా అశోక్ వర్ధన్