అక్షర

సృజనాత్మక అనువాదంలో అలతి పదాల సోయగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శిఖరం
*
-జలజం సత్యనారాయణ
వెల: రు.100/-
పేజీలు: 96
ధ్వని ప్రచురణలు, 7.5.297
లక్ష్మినగర్ కాలనీ
మహబూబ్‌నగర్- 509002

వర్తమాన మోహంలో చిక్కుకొని
భవిష్యత్తుని చేజారనివ్వరాడు.
రండి దీపాలు మళ్ళి వెలిగిద్దాం
సందిగ్ద సామాజిక స్థితిని ఒడుపుగా చిత్రించడం జలజంగారి పద్ధతి. అనేక ప్రచురణల ద్వారా సీనియర్ కవిగా సాహితీ లోకంలో తన స్థానాన్ని సుస్థిరపరచుకొన్న ఈ కవిత ఈ కావ్య అనువాదంలో మూలకర్హను అన్వీక్షణం చేస్తూనే సమకాలీనతకు కవిత్వాన్ని అద్దంపడుతారు.
నడుంచుట్టు కొడవలిలా చంద్రుడు
రాహువు వలయంలా ఏర్పడ్డాడు
గ్రహణం వీడే సమయంలో
మళ్లిమళ్లీ మింగుతున్నాడు/ పాట పాడలేను
ఆయన ప్రతీకల్లో కూడా స్పష్టత ఉంటుంది. దానితోపాటు సాంద్రమైన అనుభూతి ఉంటుంది.
నన్ను సంతలో/ ఒంటరిగా నిలబెట్టి
మిత్రులు ఒక్కరొక్కరే జారిపోయారు.
జీవితం గడచిపోయింది.
అంటూ వాజపేయి జన్మదిన సందర్భంగా వెలువరించిన గ్లోబలైజేషన్ లోని ఒంటరి మానవుని వైయక్థికానుభూతిని సార్వజనీన కం చేసిన విధానం జలజం అనుసృజనలో మరింత మెరుగుపడింది. మనిషి ఎంత అధికారపీఠం పైనైనా ఉండవచ్చు. ఎంత జన ప్రదుడైనా కావచ్చు. అతడు కవితే తప్పక కొన్ని జవాబులేని ప్రశ్నలు వెన్నాడుతాయి. అత్యంత నిష్కల్మషంగా తాను తనలోనికి చూసుకుంటాడు. ముంచుకొస్తున్న వయసుని సమాజ చంక్రమనానికి అనుసంధించి వ్యాకులతతో నిట్టురుస్తాడు.
స్వప్నాలతో స్నేహం
శృతి తప్పిన సంగీతం
గతి తప్పుతున్న అడుగులు
దరువు తప్పుతున్న డప్పులు
జీవనసంధ్య మసకబారుతున్నది
అని వాపోతాడు.
ఒక సంవత్సరం గడచిపోయింది. వౌనంగా పాడలేను, జీవనసంధ్య లాంటి కవితలన్నింటిలోను ఈ రకమైన వ్యక్తీకరణే కనబడుతుంది. చదువరి ఒక విహ్వాలత్వానికి, తనను తాను మరచిపోయే ప్రశ్నించలేని ఆవేదనకు గురిచేస్తుంది. మృత్యునగారా అనే పద్యం పోకడ రవీంద్రుని కవిత్వంలాగా ఒక మార్మిక సోయగాన్ని సంతరించుకుంది. జీవన వాస్తవికతలో అనివార్యమైన మృత్యుఘంటికలు కవివే అంటాడు. ఈ బాధ కవిదే కాదు, సృష్టి బాధ అనుభవించే ప్రతి మనిషిది.
సంధ్యకాటుక దిద్దుకొంటుంది.
యామిని మురళీ గానం వినిపిస్తుంది....
తుఫాను శాంతించింది
తీరం ఆనందంతో మెరసింది.
మృత్యు నగారా మ్రోగింది.
అలతి అలతి పదాలు అందమైన పదాలు గంభీరమైన తాత్విక భావాన్ని సునాయాసంగా మ్రోగించారు.
ఇంత చక్కని కవితా హృదయంగల ఈ కవి కూడా అక్కడక్కడ పక్కా వచనం రాయడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
అయితే అనే్వషణ ఆగిపోదు
ధర్మానుభూతి
విజ్ఞాన అనుసంధానం
అంతర్మధనం ద్వారా
ఏదో ఒకనాడు తప్పకుండా... లాంటి పక్కా వచనం రాశారు. హిరోషిమా పీడలాంటి కవితలు కూడా ఈ వరుసలో చేరిపోతాయి. బహుశా అనువాదాని కి లొంగని జటిలత్వం అక్క డక్కడా ఉందేమో?
ఏమైనా జలజంగారిని రహస్తీరంలో ఎవరో పలకరించా రు. అనువాద సృజనలో ఈయన కవితా నిర్మాణం గొప్ప మార్మిక సోయగాన్ని సంతరించుకుంది.
ఈ కవితా శిఖరాన్ని అధిరోహించ ప్రయత్నించే చదువరులు వాజపాయి కవితాత్మను అట్లాగే జలజాన్ని కూడా ఆఘ్రానించగలుగుతారు.

-కాంచనపల్లి