అక్షర

జనఘోష విన్పించిన ‘తీతువుపిట్ట’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తీతువు పిట్ట
-ఎన్.తిర్మల్ కవితలు
పేజీలు 65, వేల: రూ.50/-
స్పృహ సాహితీ సంస్థ ప్రచురణ
అన్ని పెద్ద పుస్తక కేంద్రాల్లో లభ్యం.

‘‘తీతువు పిట్ట’తో తన పదాలు పాడించిన ఎన్.తిర్మల్ వర్గ స్పృహ ఉన్న కవి. సామ్రాజ్యవాద దృక్పథం నుండి జనం వ్యధలను వ్యక్తీకరించడమే తన కర్తవ్యంగా కలానికి కదలికలు నేర్పాడు. పాలక నైజాన్ని బట్టబయలు చేసి తిరుగుబాటు వైపు జనాల్ని నడిపించడమే ఆయన అక్షరాల తోవ.
ముందే ఒక భావ జాలానికి ఆకర్షించబడి, ఆ తర్వాత కట్టుబడి, దాన్ని జన బాహుళ్యంలోకి తీసుకెళ్లడానికి కవిత్వాన్ని ఆశ్రయించిన వాడు ఈ కవి. వామపక్షమే కవి అక్షరానికి ప్రాణం, జీవం. ఏ అక్షరాన్ని కదిలించినా పాడేది ఆ పాటే.
‘కామ్రేడ్స్! / బాధ బరువైంది / బాధ్యత అంతకంటే బరువైంది / వీరుల శ్వాసల్ని ఆపాలనుకుంటున్న మూర్ఖుడికి / ఉద్యమ ఊపిర్లు భద్రపరచి చూపాల్సి ఉంది’. ఈ బలమైన వ్యక్తీకరణలో మృతవీరుల సంస్మరణ దాగి ఉంది.
ఉద్యమాలపట్ల తనకున్న ప్రీతిని, ఆసక్తిని దాపరికం లేకుం డా ప్రకటించడం తిర్మల్ ధీరత్వానికి నిదర్శనం. ‘కొత్త చరిత్రకు / నెత్తుడి పరవళ్లు చేస్తున్న / ప్రవాహం నా ఊపిరి / ఉద్యమం - నా ఊపిరి’ అంటారు. ‘ఉద్యమం - ఊపిరి’ కవితలో.
రైతు కష్టాలను కవులు పంచుకుంటున్న రీతికి మరే కళాసాటి రాదు. తిర్మల్ కవిత్వంలో మట్టి మనిషి కష్టాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. ‘మట్టిని శాసించే మనిషిని / మట్టే జీర్ణం చేసుకునే వింతైన వైనం ఏమిటని?’ ప్రశ్నిస్తాడు. ‘అరక హత్యకు గురైంది/ పలాయన వాదులారా! / రాల్చండిక / నాలుగు ఎక్స్‌గ్రేషియా రాళ్లు / కార్చండిక / రెండు మొసలి కన్నీటి బొట్లు’ అని రాజ్యం తీరును ఎండగడతాడు.
‘మాట్లాడే మైనా’ ద్వారా ఎన్‌కౌంటర్ అమరవీరులను కీర్తిస్తూ ఆకుల్ని తుంచేసిన అడదిలో / ఆ వెంటనే వసంతా లుంటాయని చెప్పు / మోడు బారినా / మోదుగులు మళ్లీ పూస్తాయని చెప్పు’ మని ఉక్కుగోళ్ల డేగలకు సందేశం పంపుతాడు.
మతం నేటి రాజకీయంలో పావుగా మారిపోయింది. మనుషుల మధ్య విద్వేషాలకు ఆజ్యంగా మారింది. మతం పేరిట - ’ కలిగినోడి కత్తికి నేలరాలిన నెత్తుటి బొట్లెన్నీ? / బలిసినోడి యుక్తికి బలౌతున్న / బడుగు జీవులెన్ని? అని లెక్కడుగుతాడు.
గోదావరీలోయ జన పోరాటాల స్ఫూర్తితో నిండిన దీర్ఘకాల పోరాట చిత్రంగా వర్ణిస్తాడు - ’ ఊరేగింపు చూసినప్పుడల్లా / ఉప్పొంగుతున్న గోదారే కనిపిస్తుంది / గోదారి సుందర స్వప్నం / గోదారి నా జ్ఞాపకాల వరద / గోదారి నా అనుభవాల స్పర్శ’ అంటూ గోదారిని ఓ ఆశయం, ఆశగా అక్షరాల్లో మలుస్తాడు.
ఇప్పటికే ధిక్కారస్వరం, యుద్ధం అనే కవితా సంకలనాలు వెలువరించిన ఎన్.తిర్మల్ మూడో సంపుటి ఇది. ‘తిర్మల్ ఉపాధ్యాయుడు, రైతు, పాత్రికేయుడు. ఈ ముగ్గురి ప్రేమల్ని తన కవిత్వంలో పదిలపరచుకున్నాడు. అప్పుడే విడిచిన కాలువలోని నీరులా కవిత్వం వెళ్లిపోతుంది. ఎక్కడో ఏ పూడికో అడ్డువస్తే, ఎగిరి మరీ ప్రవహిస్తుందీ’ అని ప్రస్తుతించాడు సతీష్ చందర్ తన ముందు మాటలో.
ప్రముఖ చిత్రకారుడు ‘కాళ్ల’ సత్యనారాయణ గీసిన ముఖచిత్రం, కవితలకు వేసిన చిత్రాలు సందర్భోచితంగా వున్నాయి.
ప్రాంతీయ ఆధిపత్యాల నుండి గల్ఫ్ యుద్ధాల దాకా తన గొంతులో వినిపించిన ‘తీతువు పిట్ట’ ట్విట్స్ అన్ని జన శ్రుతులే.

-బి.నర్సన్