అక్షర

ఆలోచింపజేసే కవిత్వ విశే్లషణా వ్యాసాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యక్తీకరణ
-ఎం.నారాయణ శర్మ
పేజీలు: 118. వెల: రూ.80
ప్రతులకు: ఎం.్భషిత
3-7-94, బ్రాహ్మణవీధి
పెద్దపల్లి - 505 172
9177260385
9848348502
**
ఆధునిక తెలుగు సాహితీ రంగంలో తనదైన శైలితో ముందుకు సాగుతున్న విమర్శకులు ఎం.నారాయణ శర్మ ‘వ్యక్తీకరణ’ పేరుతో కవిత్వ విశే్లషణా వ్యాసాలు గ్రంథాన్ని వెలువరించారు. ఇందులోని పందొమ్మిది వ్యాసాల్లో.. దీర్ఘకవిత, వచన కవితలకు సంబంధించిన విశే్లషణలకు చోటు కల్పించారు. ముఖ్యంగా ఇప్పుడొస్తున్న ఆధునిక కవిత్వంలోని అభివ్యక్తి రీతులను సాధికారికంగా చర్చించారు. కవిత్వ విశే్లషణలో సైద్ధాంతిక, రాజకీయ, అస్తిత్వ భూమికలను దృష్టి యందుంచుకొని శర్మగారు తన రచనను కొనసాగించారు. వ్యక్తీకరణకు సంబంధించిన సాంకేతికాంశాలను ప్రస్తావించడంలో శర్మ సఫలీకృతులైనారు.
‘సమకాలీన కవిత్వం - అభివ్యక్తి ధోరణులు’ శీర్షికతో రాసిన మొదటి వ్యాసంలో.. అభివ్యక్తిలోని విభిన్న ధోరణులను చర్చించారు. ప్రాచీన కాలంలోనే భారతదేశంలో ‘ఆత్మకళ’ రూపంలో భవభూతి తీసుకొచ్చిన అభివ్యక్తి రూపం కనిపిస్తుందనీ.. ఈ కాలపు కవిత్వంలో భాషకు సంబంధించినంత వరకు కవిత్వం చెప్పుకోదగిన స్థాయిలో తెలంగాణ నుడికారాన్ని ఉపయోగించుకుంటుందని ఈ వ్యాసంలో వివరించారు. వర్తమాన కవిత్వపు ధోరణులను సోదాహరణంగా ప్రస్తావించారు.
సాహిత్యానికి, సాహిత్యకారుడికి ఒక జీవితం ఉంటుందనీ.. అది నిర్దిష్టంగా ఆయా కాలాల, ప్రాంతాల స్వభావాలకు అద్దం పడుతుందనీ.. ఈ క్రమంలోనే ‘తెలంగాణా నుడికారపు ఔద్వేగిక జీవధార’గా అన్నవరం దేవేందర్ కవిత్వంలోని అభివ్యక్తిని రెండో వ్యాసంలో చక్కగా ఆవిష్కరించారు. కవి అన్నవరం దేవేందర్ కవిత్వంలో ప్రభావం, పర్యవసానం, ప్రతిఘటనలు ముప్పేటా అల్లుకుపోతాయనీ.. సూటిదనం, సందిగ్ధం లేని ఉద్వేగం అన్నవరం కవిత్వానికి ఆభరణమన్న అర్థం ధ్వనించేలా పలు అంశాలను చక్కగా విశే్లషించారు.
మరో వ్యాసంలో దర్శన మూర్తిమత్వమే ఆచార్య ఎన్.గోపి కవిత్వమని తేల్చి చెప్పారు.
గోపిగారు తమ కవిత్వంలో తాత్వికత, భావోద్వేగాలకు చోటు కల్పిస్తారనీ.. నవ్యంగా, తాత్వికంగా దర్శించడం ఆయన కవిత్వ ధారలోని ప్రథమాకర్షణ అని అభిప్రాయపడ్డారు.
రవి వీరెల్లి రాసిన ‘దూప’ గ్రంథాన్ని విశే్లషిస్తూ.. ‘శబ్దాల చుట్టూ రూపుకట్టిన అనుభవం’గా అభివర్ణించారు. రవి వీరెల్లి కవిత్వంలో ప్రతి పంక్తి వెనుక గొప్ప సాధన కనిపిస్తుందని కొనియాడారు.
పత్తిపాక మోహన్ కలం నుండి జాలువారిన ‘తెగిన పోగు’ గ్రంథాన్ని విశే్లషిస్తూ, ‘మోహన్‌ది’ ‘ఒకే ఆక్రందన - రెండు అరుపులు’ అని వ్యాఖ్యానించారు.
రాజేందర్ ‘జింబో’ రచించిన ‘చూస్తుండగానే’ గ్రంథంలోని విశేషాలను ప్రస్తావిస్తూ రాసిన వ్యాసంలో.. జింబో విలక్షణమైన కవి అనీ.. ఆయన కవిత్వంలో మార్దవం, మృదుత్వం ఎక్కువ అనీ, తీవ్రంగా కనిపించని సన్నని సంవేదన కూడా ఎక్కువేనని పేర్కొన్నారు.
పనె్నండేళ్ల తెలంగాణా ఉద్యమ గమనాన్ని, సాహిత్య గమనాన్ని ఒక్కచోటికి తెచ్చే ప్రయత్నం ‘మునుం’. తెంలగాణ పుష్కర కవిత్వం చేసిందని తెలుపుతూ.. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను పలు కోణాల్లో దర్శించి వ్యక్తం చేసిన కవితలు ‘మునుం’కు నిండు శోభను కూర్చాయని వివరించారు. ఉద్యమ కవిత్వంలోని తెలంగాణ, సంస్కృతీ, స్వభావాలు చరిత్రను ఆత్మీయంగా ఆవిష్కరింపబడిన ఎన్నో కవితల్ని చక్కగా విశే్లషించారు.
నాంపల్లి సుజాత ‘మట్టి నా ఆలాపన’ గ్రంథంలోని విశేషాలను చర్చిస్తూ రాసిన వ్యాసంలో.. సుజాత తమ కవిత్వంలో తెలంగాణ భాషలోని పదాల మాధుర్యాన్ని ఎలా రుచి చూపించారో సోదాహరణంగా వివరించారు.
అలాగే శివాలోలిత ‘గాజు నది’ కావ్యంలోని స్ర్తివాద అస్తిత్వ భూమికను చక్కగా ప్రస్తావించారు.
ఇప్పుడు సాహితీ విమర్శలో ప్రధానంగా వస్తువు, రూపం అనే అంశాల మీదే ఎక్కువ చర్చ జరుగుతోందనీ.. నిర్మాణపరమైన వౌలిక సూత్రాల అనే్వషణకు తెలుగు విమర్శ సిద్ధపడాలని మరో వ్యాసంలో సూచించారు.
ఆశారాజు కవిత్వాన్ని విశే్లషిస్తూ రాసిన వ్యాసం విజ్ఞానదాయకంగా ఉంది.
కాలాన్నీ, ప్రపంచాన్నీ ఏకం చేసే అనుభూతి శిఖామణి గారి ‘గిజిగాడు’ గ్రంథమని వ్యాఖ్యానించారు. ‘గిజిగాడు’ కవిత్వం నిండా యానాం మట్టివాసనలు, వ్యక్తులు, సందర్భాలు వాక్యాలై అల్లుకుపోయిన తీరు బాగుంది.
డా.చిల్లర భవానీదేవి ‘రగిలిన క్షణాలు’ కావ్యాన్ని తాత్విక ధారతో జీవితాన్ని కొలిచిన కవిత్వంగా అభివర్ణించారు.
వర్తమాన స్పర్శతో వెలువడిన కెరె జగదీశ్ ‘రాత్రి సూర్యుడు’ రూప్‌కుమార్ రాసిన ‘్ఫ్లరోసిస్’, మోడేపల్లి శ్రీలత కొటపాటి ‘మృత్యుమోహనం’, ఆచార్య ఎన్.గోపి ‘జలగీతం’ వంటి నాలుగు దీర్ఘ కవితలపై చేసిన విశే్లషణ ఆలోచనాత్మకంగా ఉంది.
ఇంకా ఇందులో.. రేణుకా అయోలా ‘లోపలి స్వరం’, ఏనుగు నర్సింహారెడ్డి ‘కొత్తపలక’ తదితర కవితా సంపుటాలపై అభివ్యక్తికి సంబంధించిన అంశాలను విశే్లషించారు. ఇవేకాక.. ఈ గ్రంథంలో ‘తెలుగు కవిత్వంలో కార్మిక జీవనం’ ‘సినారె వచన కవితా దృక్పథం’ శీర్షికలతో రాసిన వ్యాసాలు కావలసినంత సాహిత్య సమాచారాన్ని మోసుకొచ్చాయి.. పుస్తకం చివరన కవిత్వ సంబంధ అంశాలను చక్కగా పొందుపరిచారు.
ఇలా ఈ గ్రంథంలో శర్మ ప్రకటించిన భావాలు.. ఆయా గ్రంథాలు, గ్రంథకర్తల అభివ్యక్తికి సంబంధించిన అంశాలనే కాక.. కవులకు కావలసినంత సమాచారం లభ్యమయ్యేలా తమ రచనను కొనసాగించడం విశేషం.

-దాస్యం సేనాధిపతి