అక్షర

మహామనీషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహామనీషి
డా.బి.ఆర్.అంబేద్కర్‌గారి
ఉపన్యాసాల నుండి...
కొన్ని ముఖ్యమైన భావాలు
-డా.వెల్చాల కొండలరావు
వెల: రూ.250/-
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో
**

డా.అంబేద్కర్ గొప్ప మేధావి. చాలా పుస్తకాలు చదివాడు. చాలా తాత్విక, దార్శనిక చింతన కలవాడు. ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో ఉద్దంతుడు. ఎంత వారితోనైనా తగినంత జ్ఞాన విజ్ఞాన పరిజ్ఞానాలతో చర్చాగోష్ఠులు జరిపిన భాషా భావ ప్రావీణ్యుడు. సందర్భోచితంగా, సమయస్ఫూర్తిగా మాట్లాడి ఎందరితోనో శభాష్ అనిపించుకున్న ప్రతిభావంతుడు. దేశభక్తుడు. అతడు జిన్నా కోరినట్లు అస్పృశ్యుల కొరకు వేరే దేశాన్ని కోరలేదు. వేరే మతాన్నీ కూడా కోరలేదు. కేవలం ప్రత్యేక హక్కులు, రిజర్వేషన్లు కావాలని మాత్రమే కోరాడు. అతనికి తెలియని అంశమంటూ లేదు. అతడు మాట్లాడని, వ్రాయని, చర్చల్లో పాల్గొనని విషయమంటూ లేదు. ఏది వ్రాసినా ఏది మాట్లాడినా క్షుణ్ణంగా అన్ని విషయాలు, వివరాలు తెలుసుకొని అథారిటేటివ్‌గా మాట్లాడేవాడు...
డా.బి.ఆర్.అంబేద్కర్ పై వచ్చిన సాహిత్యం నుండి ముఖ్యంగా అతని ప్రసంగాల నుండి ముఖ్యమైనవి మాత్రమే కొన్ని ఎంపిక చేసి ఈ పుస్తకంలో ముక్తసరిగా అందించారు.