అక్షర

ప్రభవించిన చైతన్య ఝరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా ఊరు అట్లా లేదు?
(కవిత్వం)
-డా.బెల్లి యాదయ్య
పేజీలు: 92
వెల: రూ.100
ప్రతులకు: 6-2-330,
ఎన్‌జి కాలేజ్ వెనుక
శ్రీనగర్ కాలనీ, నల్గొండ- 508 001
9848392690
*

కవి ఈ కవితా సంపుటిని తన తండ్రి సాయన్నకు అంకితం చేశారు. ప్రాకృతిక ఘర్షణల నుండి తనను తాను రక్షించుకోవడానికి మనిషి కవిత్వం చెబుతాడు - అంటూ కవి యాదయ్య ఇంట్రో ‘ఐ రైట్ బికాజ్ ఐ వుడ్ లైక్ టు విల్ ఫర్ ఎవర్’ అనే ముందు మాటలో - తన లక్ష్యం ప్రకటించుకొన్నారు. బెల్లి అనగానే ప్రఖ్యాత విప్లవ గాయని బెల్లి లలిత జ్ఞప్తికి వస్తుంది. రాజ్యహింసకు జీవితానే్న బలి ఇచ్చిన నిత్య ప్రాతఃస్మరణీయురాలు.
శివుని ఇల్లాలి ఖండ ఖండాలు.. ఈ దేశంలో పలు ప్రాంతాల్లో పడ్డాయనేది పురాణం - బెల్లి లలిత దేహ ఖండ ఖండాలు ఈ తెలంగాణ నేలపై త్యాగాల విత్తులు నాటాయి. ఐదు వేల గంటలు కేటాయించి.. సైన్స్, హేతువాదం, హ్యుమానిటీ, నేచర్, ఎన్విరాన్‌మెంట్, ఇంట్రాస్పెక్టివ్, నాస్టాల్జియా మొదలైన అంశాలను కవిత్వం ఇతివృత్తాలుగా తీసుకున్నారు.
‘మా ఊరు అట్లా లేదు?’ కవితలో ఒకచోట యాదయ్య ఇలా అంటారు.
‘మాలదేవయ్య - గౌండ్ల ఎంకన్నను అరేయ్ తమీ అనడం మాదిగోల్ల స్వామి - గొల్ల కృష్ణమూర్తిని ఒరే కొడకా అనడం! మా ఊళ్లో ప్రజాస్వామ్యం.
మనుషులిక్కడ సర్వం సమానం అనే కథ చెప్పుకోడానికి ఏ ద్వీపం అవసరమో అదే మా ఊరు (పేజి.46) అంటారు కవి.
ఈ కవిత చదివిన తర్వాత నేటి దళితులే నాటి సింధు పాలకులు అనే చారిత్రక సత్యం మదిలో మెదిలింది. అసలు ఈ భూమి మీద మానవ సంచారము ఎప్పుడు మొదలైంది? ఎన్నో పరిశోధనలు ‘సత్యం’ రేపటి సూర్యోదయం అంత నిజం!
క్రీ.పూ.50 వేల సం.ల నుండి 5 వేల సం.ల కాలాన్ని మన చరిత్ర పుస్తకాల్లో ప్రీ హిస్టరీగా చదివేం. 1.పాతరాతి యుగం 2.కొత్త రాతియుగం (50 వేల నుండి 3,000 బి.సి) 3.ఇనుప యుగం (1200 - 26 బి.సి.) 4.కంచు యుగం 5.వేదకాలం - అంటే (ఆర్యుల రాక 1500 బి.సి.) ‘పాత రాతి యుగం’లో లేదా అంతకు ముందు ఈ దేశంలో ఉన్నవారిని మూలవాసులు (నేటివ్స్) అనడం జరిగింది. యూరో ఏషియా వాసులైన ఆర్యులు.. ఇక్కడి మూల వాసులను జయించి వాళ్లను క్రిందికి తరిమివేసి.. తిష్ట వేశారు. ఈజిప్టు - గ్రీకు - మెసొపొటేమియా, సింధూ నాగరికతలు.. వాటి చరిత్రలు.. త్రవ్వి తీస్తే అన్ని నాగరికతలకు ఆద్యులు (ప్రారంభకులు) మూల వాసులే. హరప్పా నాగరికత క్రీ.పూ.7570 - 6200 నాటిది. అంటే ఆర్యులకన్నా ముందే ఇక్కడ గొప్ప సంస్కృతి - నాగరికత వెలసిల్లింది.
కవిత్వంలోంచి చరిత్రలోకి వెళ్లే స్థితి యాదయ్యగారి కవిత్వం చేసింది. రేపటి తరానికి.. కొమరం భీం, షోయబుల్లా, ఐలమ్మ, సర్వాయి పాపన్న, తుర్రె బాజ్‌ఖాన్, దొడ్డి కొమరయ్యల గురించి చెప్పాలి. వారి ఆశయ, ఆలోచనా మార్గాల్ని చూపాలి.
వసంత పరిమళాన్ని, వసంతకాల మేఘ గర్జననూ వినిపించేదే గొప్ప కవిత. ఆ పని ఈ కవి ప్రతి కవితలోనూ.. ప్రతి పుటలోనూ.. చేశారు.. చూపారు. పాఠకునిలో పఠనాసక్తిని కలుగజేయడం.. పాఠకుడిని చదివించేలా.. గొప్ప సృజన చేయడం.. అంత తేలిక కాదు. ‘కాల్పనిక జగత్తులో విహరించే వాడు కవి కాదు. కన్నీళ్లని విప్లవీకరించే వాడు కవి’ అంటాడు దిగంబర (విప్లవ) కవి చెరబండ రాజు. ఈ పని ఇప్పుడు కవులే చేయాలి.
‘పూల ఉత్తరం’ (పేజీ 47) అనే కవితలో కవి ఒకచోట తన భావాల్ని చక్కగా స్పష్టపరుస్తారు. కవికి అన్ని సామాజికాంశాల్లోనూ స్పష్టత ఉండి తీరాలి. అప్పుడే ఆ కవి కవిత్వం చిక్కబడుతుంది..
మధ్యయుగాల నాటిదనుకొనే/ తప్పిపోయిన ఒక మాటల కపోతం/ రెక్కలు తొడిగి/ ముక్కును గులాబీ జలంలో ముంచి/ ప్రేమ సిరాలో మడిచి/ రోవర్‌లా నా అంగారక/ కుటీరానికి పంపిన/ నీ ధీరమతికి శత సహస్ర అక్షర నీరాజనాలు!’
అంటారు. స్నేహం ముసుగులో దాగిన వర్ణ, వర్గ తత్త్వాల భావ సంఘర్షణ అక్షరీకరించిన తీరు ప్రశంసనీయం. ప్రజలు, పాలకులు, పాలితులు.. ప్రేమ.. చెప్పడం బాగుంది. ‘సంస్కరణ కలం’ అనే కవితలో చివరి వాక్యాలు కదిలిస్తాయి. కలవరపెడతాయి. (పేజీ 92)
‘ఇతిహాసాల్లోంచి మనిషిని పిలిచి/ శాస్త్రం తాళం చెవి చేతికిచ్చి
ముత్యాలసరం టార్చితో/ మూఢనమ్మకాల గదిని తెరిపించడం
నా వరకైతే వీరోచిత కార్యమే మరి...’
ఈ రోజు సంస్కరణ అనే పదానికి అర్థం మారిపోయింది. కందుకూరి, గురజాడ, రాజా రామ్మోహన్‌రావు కాలం నాటి సాంఘిక సంస్కరణలకు పి.వి.నరసింహారావు, మన్‌మోహన్, చంద్రబాబు నాయుడుల సంస్కరణలకు బోలెడు.. తేడా ఉంది. కాలంతో కవి కరచాలనం చేయాలి. చలనం కవిత్వ స్వభావం. చలనశీలి అయిన కవి స్థల కాలాల్లోనే తన కవిత్వానికి పునాదులేసుకొంటాడు. కాలం విగ్రహం అనే కవితలో యాదయ్య ఓ చోట ఇలా అంటాడు.
‘విగ్రహం అంటే/ ఒక సిరామిక్ కణికో లోహపు
ఒంపుల ముద్దో కాదు/ విగ్రహం అంటే
గతం తాలూకు స్తూపాకారం సుప్తాస్థికలు కాదు
విగ్రహం అంటే/ మన్వంతరాలను సమం చేయగల మనిషి పిడికిట్లోని మహా చైతన్యం
అంతర్జాతీయ స్థాయి కవిత ‘మాస్టర్ మైండ్’. ఇతర భాషల్లోకి అనువాదం అనివార్యంగా కావాల్సిన కవిత. (పేజీ.69).. అలాగే ‘వానరోపాఖ్యానం’ నేటి కాలేజి కుర్రకారు యొక్క ప్రతిబింబంగా రాసారు. సింహాల పేటలో నిలబడి/ కస్తూరి మృగాలను కీర్తించడానికి నీకెంత ధైర్యంరా బెల్లీ’ (పేజి.55 పాంచజన్యం) అంటూ గుండె తడిని స్పృశించే ఆరని అక్షరాల ఝరిలో నడిపించిన యాదయ్య కలం- కాలంతో సాగాలి. సామాన్యుని శ్వాస అవ్వాలి. సబ్మండ వర్ణాల అక్షర ‘చాటింపు’ కావాలి. రా(యా)వాలి.

-తంగిరాల చక్రవర్తి