అక్షర

పరిచయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాని వంటి యువకులు తమ కలాలకు పదును పెట్టి లక్షల్లో, కోట్లలో ఆధునిక యువతని ప్రగతిపథంలోకి తీసుకుని వెళ్లగలిగితే.. అకళంక, అవినీతి రహిత, ఆకలి కనరాని, ఆనంద భరతావని అతి త్వరలోనే ఆవిర్భవించక తప్పదు. ఈ చిన్ని పుస్తకం పెద్దపెద్ద భావాలను ఘాటుగా చదువరుల మీదకి వదుల్తుంది. ఈ పుస్తకంలో నలభై కవితలున్నాయి. ప్రస్తుత సమాజంలోని చెడును, దోపిడీని, కుళ్లును ఎత్తిచూపే ‘ప్రభంజనం’ అనే కవితతో ఆరంభమై, దొంగల, దోపిడీ దొరల, దరిద్ర రాజ్యంలా అభివర్ణిస్తూ, పరిష్కారం ‘నురుూ్య, గొరుూ్య’ చూపే చావు కాదని మొదలుపెడతాడు కవి.. దగాపడ్డ దళితుడిని హెచ్చరిస్తాడు. అక్షరాస్యతతో అంధకారాన్ని తొలగించుకుని, కపట ప్రేమ కళ్లలో పెట్టుకుని పోషిస్తున్న రౌడీ నాయకుల గుండెలు బద్దలు కొట్టమని, కార్మిక కర్షక బలాన్ని చూపి బానిస బతుకుని వదిలెయ్యి..’ అని పదునైన పదాలతో ఏం చెయ్యాలో సూచిస్తాడు.