అక్షర

‘పద’నిసలు (పరిచయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-సత్యసాయి కొవ్వలి
వెల: రూ.150/-
ప్రతులకు: రచయిత
ఎ-202, నెస్టల్ 2, లోయర్ పెరల్
నియర్ దీపక్ సినిమా
ముంబై -400 013
9819483562
*
ముంబై లోకల్ రైళ్లలో చాలామంది జనాలు అంత రద్దీలో కూడా క్రమం తప్పకుండా చేసే ఒక పని క్రాస్‌వర్డ్ పజిళ్లు పూరించడం. క్రాస్‌వర్డ్ పజిళ్లు పూరించడంలో ఉన్న మజా తెలిస్తే ఇంత చెమట, రద్దీలో వాళ్లు అంత ఆనందంగా గళ్లు ఎలా నింపగల్గుతున్నారో అర్థవౌతుంది. తెలుగులో క్రాస్‌వర్డ్ పజిళ్లు ఎప్పటి నుండో ప్రాచుర్యంలో ఉన్నాయి. తెలుగులో మొట్టమొదటి క్రాస్‌వర్డ్ పజిల్‌ని తొలి తెలుగు అపరాధ పరిశోధక నవలా రచయిత దేవరాజు వేంకట కృష్ణారావు 1937లో తాను ఆరంభించిన ‘పద సమస్య బోధిని’ మాసపత్రికలో ప్రవేశపెట్టారని ఆంధ్రభారతి వారు రాశారు. తదుపరి కాలంలో వీటిని రకరకాల పేర్లతో అనేక పత్రికలు నిర్వహిస్తున్నాయి. గడి నుడి అనగానే గుర్తుకు వచ్చేవి శ్రీశ్రీ, ఆరుద్ర లాంటి వారి పజిళ్లు. అత్యంత చమత్కారంతో కూడిన వాటికి చాలా ఆదరణ ఉండేది. తెలుగు క్రాస్‌వర్డ్ ప్రపంచంలో చాలామంది మహామహులున్నారు. వారితో పోల్చితే ‘నా’ గడులు వాసిలోనూ, రాసిలోనూ కూడా తక్కువే అని సత్యసాయి కొవ్వలి ముందు మాటలో చెప్పుకొన్నారు. ఈ ‘పదనిసలు’ పుస్తక రూపంలో తేవడం ఓ విధంగా సాహసమే. *