అక్షర

విశిష్ట ప్రయోగం ‘ప్రేరణ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేరణ (విమర్శ)
-నియోగి
వెల: లేదు
ప్రతులకు:
9553097319
**

కవిత్వంలో, వచన రచనల్లో విశిష్ట ప్రయోగాలున్నాయి. విమర్శలో చాలా తక్కువ. ఆ తక్కువ వాటిలో ఈ ‘ప్రేరణ’ పుస్తకం ఒకటి. పండితారాధ్యుల పార్వతీశం రాసిన సముచితమైన ముందు మాటలోని ‘దేనికైనా మొదట ప్రశ్నించే గుణం అలవరచుకోవాలి. ఆ గుణం నుండే అసలైన మార్గం గోచరిస్తుంది. ఆ మార్గం నిన్ను సత్య మానవ దర్శనాన్ని సుగమం చేస్తుంది’ అన్న పంక్తులే ‘ప్రేరణ’ పుస్తకానికి మూలం. నియోగి కవిత్వం రాస్తాడు. పుస్తక సమీక్షలు చేస్తాడు. ఇంటర్వ్యూలు అర్థవంతంగా చేస్తాడు. ఇప్పుడు ఒక మంచి విమర్శకుడిగా నిలబడుతున్నాడు.
ఈ పుస్తకం ప్రత్యేకత ఏమిటంటే ఒక కవిత - అందులోని మొదటి పంక్తిపై సుదీర్ఘ వ్యాఖ్యానాత్మక విమర్శ కావటం. వి.ఆర్. విద్యార్థి ప్రాచుర్యం పొందిన కవి. హంగూ ఆర్భాటం పట్టని మంచి కవి. అతని కవిత ‘అపరిచితులు’ ఇలా ప్రారంభమవుతుంది.
‘ఎవరీవిడ?
అంటే నేనేమి జవాబియ్యగలను?
పరిచయమే లేదు...’
ఇందులో కవితకు బీజమైన ‘ఎవరీవిడ?’ అన్న పంక్తిపై రాసిన విశే్లషణ గ్రంథమిది. కవి అంతరంగంలోకి దూరి రాసిన పుస్తకమిది. తాత్త్వికత, మానసికత, సామాజికత ముప్పేటలా పెనవేసుకొన్న పుస్తకం ‘ప్రేరణ’. ఈ వాక్యాలు రాసిన విద్యార్థి ఆ పరిచయం కోసం తాపత్రయపడుతున్నాడు. ఆ అనే్వషణ మార్గంలో పయనిస్తున్నాడు. లోపలి మనిషిని కనుగొనే మార్గంలో పయనిస్తున్నాడు’ అనటం సమంజసం. అసలు కవిత్వం అంటేనే మనసును ఛేదించడం. ఒక కొత్త విమర్శ పంథాకి తెర తీసిన ‘ప్రేరణ’ పుస్తకం విమర్శకులకు ప్రేరణ అవ్వాలని ఆశిద్దాం.

-ద్వానాశాస్ర్తీ