అక్షర

సరళ సుందరంగా వాస్తుశాస్త్ర సూత్రాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాస్తు సూత్రాలు - ఆధునిక గృహ నిర్మాణం
డా. భీమా సాంబశివరావు
వెల: రూ.300
పేజీలు: 240
ప్రతులకు: రచయిత, 1-9-236/1/ఎ,
రామ్‌నగర్, హైదరాబాద్.
చరవాణి: 9848994139
*
జ్యోతిష్య, వాస్తు, వైద్య శాస్త్రాలను ప్రజోపయోగం కోసం మహర్షులు మనకి అందించారు. ఘనమైన ఆ ప్రాచీన వారసత్వ సంపద పదిలంగా కాపాడుకుంటూ వస్తున్నప్పటికీ కాలక్రమంలో అనేక మార్పులు చోటుచేసున్నాయి. అయినప్పటికీ ఆ జ్ఞానాన్ని కాపాడుకుంటూ వస్తూ భావితరాలకు అందిస్తోంది హిందూ జాతి. వారసత్వంగా వస్తున్న విజ్ఞానం కావడంతో ఇది పండితలకే కాదు, పామరులకూ అందుబాటులోకి వచ్చింది. వాస్తుశాస్త్రం గురించి 263 పురాతన గ్రంథాలు ఉన్నప్పటికీ, వాటిపై పూర్తి అవగాహన కలిగిన పండితులు తక్కువగా ఉండటంతో ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారు. పరిపూర్ణమైన గ్రంథ పరిజ్ఞానం లేకపోవడంతో గృహ నిర్మాణంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాస్తు పేరుతో సంపదకు చిహ్నమైన ఇళ్లను కూల్చేసి పునర్నిర్మిస్తున్నారు. ప్రాచీన రుషులు రూపొందించిన వాస్తు సూత్రాలను కొందరు కుదించడమో, వక్రీకరించటమో చేయటం వివాదాలకు తావిస్తోంది. వాస్తు సూత్రాలను అనుసరిస్తూనే ఆధునిక గృహ నిర్మాణ పద్ధతులను సంక్షిప్తంగా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నమే ‘వాస్తు సూత్రాలు - ఆధునిక గృహ నిర్మాణం’ పుస్తకం. బ్రిటీష్ పాలనలో కొంతమేరకు ప్రాచీన వాంగ్మయం ధ్వంసమైనప్పటికీ చాలా గ్రంథాలు పదిలంగా ఉన్నాయి. మరుగున పడిన ప్రాచీన వాస్తు సూత్రాలను ప్రజలకు సులభ రీతిలో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాన్ని ఈ పుస్తక రచయిత డాక్టర్ భీమా సాంబశివరావు చేశారు. వాస్తు శాస్త్రాన్ని ఉపదేశించిన రుషులు, విశ్వకర్మ వాస్తుశాస్త్రంలో పేర్కొన్న 14 మంది దివ్య పురుషులు, తదితర వివరాలను ఇందులో పొందుపరిచారు. విశ్వకర్మ ప్రసాదించిన గ్రంథాల పేర్లు కూడా ఇందులో తెలిపారు. గృహ యోగానికి సంబంధించిన వివిధ అంశాలను కొంతమేర ప్రస్తావించారు. ఒక వ్యక్తి ఊరు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆ ఊరి పేరు, ఆ వ్యక్తి పేరులోని మొదటి అక్షరాల ఆధారంగా రాబోయే లాభనష్టాలను సరిచూసుకునే విధానం కాలామృతంలో, గ్రామార్వణంలో ఉంది. దాన్ని ఎలా లెక్కించాలో వివరించారు. గ్రామానామ నక్షత్రంతో ఆరంభించి 27 నక్షత్రాలను మనుజాకృతిలో వివిధ శరీరాంగాల్లో ఉంచి ఫలితం నిర్ణయించే వాస్తురత్నావళి కూడా తెలుసుకోవచ్చు. బాదరాయణ పద్ధతి, నామనక్ష ప్రాధాన్యతలను వివరించారు. గృహ నిర్మాణానికి అనుకూలమైన భూమి ఎంపిక, షోడశ భూ లక్షణం, భూ ఆకారాన్ని అనుసరించి నివాస యోగ్యత నిర్ణయం చేసే విధానం గురించి ప్రస్తావన ఉంది. ప్రాణుల మరణానంతర అవశేషాలు, బూడిద, బొగ్గు, ఇనుము ఉన్న ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించటం దోషమని, శల్య ప్రకరణం, ప్రశ్న పద్ధతి, శల్లోధారణ విధానాన్ని సులభ రీతిలో వివరించారు. భూమి ఎత్తుపల్లాలు, దానిపై దిక్కుల ప్రభావం ఎలా ఉంటుందో తెలియచేసే ప్రయత్నం చేశారు. గృహ నిర్మాణంలో ఉపయోగించే కలప ఏయే వృక్షాల నుంచి సేకరించాలో తెలుసుకోవచ్చు. వృక్షాల్లో లింగ భేదం, దాని ప్రభావం తెలుసుకునేందుకు ఆసక్తికరంగా ఉంటుంది. స్థలం ఆకారం, వైశాల్యం ఆధారంగా భవన నిర్మాణానికి సంబంధించి గృహ గణితం, గృహారంభం, ద్వార స్థాపన, వివిధ గృహ దోషాలు, వృక్ష దోషాలు, పునాదుల దోషాలు, ద్వార దోషాలు, వివిధ వేధలు, గృహ నిర్మాణ నియమాలు, శాల నిర్మాణం, గృహారంభం, శంకుస్థాపన, శంకుస్థాపన ప్రాంత ఎంపిక ఎలాచేయాలో శాస్ర్తియంగా తెలియజేసే ప్రయత్నం చేశారు. గృహ ప్రవేశం, గృహదోష నివారణకు యంత్రస్థాపన, తదితర అంశాలు తెలుసుకోవచ్చు. భవన నిర్మాణ సామగ్రి ఎంపిక, గృహ నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గృహాలంకరణ, తదితర అంశాల గురించి రచయిత గ్రంథస్తం చేసి అందుబాటులోకి తెచ్చారు.

-పిఎస్ వెంకటేశ్వరరావు