అక్షర

‘గ్రాంథికం’పై గురజాడ అసమ్మతి పత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గురజాడ అసమ్మతి పత్రం
వెల: రూ.120
ప్రతులకు: విశాలాంధ్ర
ప్రచురణాలయం
అన్ని విక్రయశాలలు
*
ఆధునిక యుగకర్తగా పేర్కొనబడిన గురజాడ వేంకట అప్పారావు కవి, కథారచయిత, వ్యాస రచయిత మాత్రమే కాదు, తెలుగును జీవద్భాషగా మార్చటానికి పోరుసల్పిన భాషోద్యమశీలి కూడా! ఇందుకు గొప్ప ఉదాహరణ ‘అసమ్మతి పత్రం’ (డిసెంట్ పత్రం) గ్రాంథిక, వ్యావహారిక భాషా వాదాలు ముదిరి పాకాన పడినప్పటి వాతావరణం, గురజాడ గ్రాంథిక వాదుల్ని ఢీకొన్న పరిస్థితులు, తెలుగు భాషా పరిణామ స్వరూపాలు, వాడుక భాష ఆవశ్యకత వంటి ఎన్నో అంశాలు ఈ పుస్తకం ద్వారా తెలుసుకుంటాం.
మద్రాసు విశ్వవిద్యాలయం ఈ భాషా వివాదాల నిగ్గు తేల్చడానికి 1911లో ఒక సంఘాన్ని నియమించింది. అందులో గురజాడ ఒక సభ్యుడు. అయితే గ్రాంథికవాద సభ్యులు ఎక్కువగా ఉండటంవల్ల వాడుక భాష కీడు చేస్తుందని నిర్ణయించారు. అప్పుడు గురజాడ నిరసనగా ‘అసమ్మతి పత్రం’(The minute of dissent to the report of the Telugu composition sub-committee) సమర్పింఛారు. నిజానికిది పత్రం కాదు - ఒక పుస్తకం. మొదట 1914లో వావిళ్ల వారు ఆంగ్లంలోంచి తెలుగులోకి తర్జుమా చేసి ప్రచురించింది. 1968లో పోరంకి దక్షిణామూర్తి అనువాదంతో మళ్లీ ముద్రించబడింది. ఇప్పుడు విశాలాంధ్ర వారు బి.రామచంద్రరావు అనువాదంతో తాజాగా ప్రచురించారు. అయితే సంపాదకులు ఒక విషయం విస్మరించారు. 2012లో వేదగిరి రాంబాబు దీనిని ముద్రించి అందుబాటులోకి తెచ్చారు. దీనిని ప్రస్తావించటం సంపాదకుల మర్యాద!
పైకి గ్రాంథిక వ్యావహారిక భాషా చర్చల పుస్తకంగా కనిపిస్తుంది గానీ తెలుగు భాషా పరిణామం, వ్యాకరణాలు, పండితుల వితండ వాదాలు, కొందరి లోపాలు అన్నీ వున్నాయి. గురజాడ ఎంత ధైర్యవంతుడో, భాషా పరిశోధకుడో తెలుసుకోవటానికి అసమ్మతి పత్రం ఒక సాక్ష్యం. ఇవాళ వాడుక భాష విస్తృతంగా ప్రాచుర్యం పొందటానికి గురజాడ (గిడుగు) ఎంతగా శ్రమించారో తెలుసుకుంటాం. చివరగా గురజాడ మాట ‘తెలుగు సాహిత్యానికి సంకెళ్లు వేసి కడుపుమాడ్చడమా, లేక దానికి జవసత్వాల నిచ్చి ఒక గొప్ప నాగరిక శక్తిగా చేయడమా అనేది మనపై ఆధారపడి ఉంది.’

-ద్వానా శాస్ర్తీ