అక్షర

మానవుల్లో దానవులు (పరిచయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-డా.ప్రయాగ
మురళీమోహనకృష్ణ
వెల: రూ.200/-
ప్రతులకు: అక్షర ప్రభ
డోర్ నెం.9-1-45/3/2/1
న్యూ రేసవానిపాలెం, విశాఖ-530 013
*
పీడించే వర్గమొకటి, పీడనకు గురయ్యే ధర్మమొకటీ కొనసాగుతున్న సమాజంలో ఎన్నో శతాబ్దాలుగా నరమేధం కొనసాగుతూ వస్తోంది. పలుదేవాలలో మతపరమైన సంఘర్షణలు, జాతి విద్వేషాలు ఈ నరమేధానికి కారణమైనాయి. ‘ఒక వ్యక్తిని మరొక వ్యక్తి, ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇకపై సాగదని మన అభ్యుదయ కవులు ఏనాడో చెప్పారు. ఎందరో మతోన్మాదులు, పాలకులు మానవత్వాన్ని మంటగలిపి ఎన్నో సంవత్సరాలుగా నరమేధాన్ని క్రతువులా నిర్వహించారు. దాదాపుగా అన్ని ఖండాలలోనూ ఈ నరమేధం జరిగిన తీరు మానవ జాతి చరిత్రలో మాయని మచ్చగా నిలిచిపోయింది. డా.ప్రయాగ వైద్యునిగా ఉన్న రోజుల్లో పలు దేశాలలో కోట్లాది మంది అమాయకులను బలిగొన్న నరరూప రాక్షసుల దురాగతాలను చూసి చలించిపోయారు. ఈ వైద్యుడు తన మిత్రుల ద్వారా, సమాచార సాధనాల ద్వారా సంగ్రహించిన విషయాలను ‘మానవుల్లో దానవులు’ పుస్తక రూపంలో పాఠకులకు అందించారు.