అక్షర

పరిచయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితీ సుగంధం
-డా.పి.వి.సుబ్బారావు
వెల: రూ.100/-
ప్రతులకు: ప్రజాశక్తి బుక్‌హౌస్
27-1-54, కారల్‌మార్క్స్ రోడ్
గవర్నర్‌పేట, విజయవాడ-2
0866 2577533

సాహితీ సుగంధం విమర్శ వ్యాస సంపుటిలో వ్యాసాలు కొన్ని జాతీయ గోష్ఠులలో సమర్పితాలు. కొన్ని ఆకాశవాణిలో ప్రసారితాలు. పత్రికల్లో కొన్ని వ్యాసాలు ప్రచురితాలు. జాషువా, విశ్వనాథ, తుమ్మల, పులుపుల, నాగభైరవలు ప్రాంతీయ స్పృహతో రాసిన పద్యాలను, గేయాలను ఉటంకిస్తూ ‘మద్యాంధ్ర కవిత్వం - ప్రాంతీయ అస్థిత్వ వాదం’ వ్యాసం రాశారు. వీరందరి సాహిత్యంలో ప్రాంతీయ స్పృహ, అభినివేశం తప్ప ప్రాంతీయవాద భావాలు లేవని స్పష్టం చేసిన వ్యాసమిది. ‘కరుణకుమార కథల్లో గ్రామీణ జీవిత సజీవ దృశ్యాలు’ వ్యాసంలో వారి కొన్ని కథలను పరిచయం చేశారు. ఇదీ స్మృతీ వ్యాసమే. ‘చిన్నయసూరి మిత్రభేదంలో పాత్రల ప్రతీకాత్మకత’ మంచి వ్యాసం. జంతువులు పాత్రలుగా మారి మాట్లాడటం, మాట్లాడినట్లు భావన కలిగించే ‘యంత్రియో మార్ఫిజమ్’ అనే శిల్పాన్ని ఆశ్రయించి చిన్నయసూరి ఏనాడో రాసి సాహిత్య ప్రయోజనాన్ని సాధించారు. సుబ్బారావుగారి వ్యాసాలు సులభశైలిలో ఉన్నాయి. అభ్యుదయ దృష్టిని ప్రసరిస్తున్నాయి. సామాజిక హితంగా సమాచార సహితంగా ఉండటం ఒక ప్రత్యేకత. ఈ వ్యాసాల ద్వారా పలువురి సాహితీవేత్తలతో పరిచయమేర్పడుతుంది. ఈ వ్యాసాలు కొన్ని కవిత్వం, కథలు, నవలలను పాఠకులకు చేరువ చేస్తున్నాయి.