అక్షర

పారాయణ యోగ్యంగా - దత్త కథామంజరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దత్తకథామంజరి
-కుప్పా వేంకట కృష్ణమూర్తి
వెల: రూ.50
ప్రతులకు: శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమము

***********

శ్రీ దత్తాత్రేయుల వారి చరిత్రను వివిధ సాహిత్య ప్రక్రియల్లో రచించాలన్న రచయిత కుప్పా వేంకట కృష్ణమూర్తిగారి సదాశయం నెరవేరింది. శ్రీదత్త దర్శనము చలనచిత్ర సంభాషణల రచయిత కావడంతో నాటక రూపంలో, ఆత్మదానం నవలకు వ్రాతరూపంలో సేవను అందించడంతో నవల రూపంలోను దత్త చరిత్రను రచించినట్లయింది. శ్రీదత్తాత్రేయోదాహరణ కావ్యాన్ని కూడా రచించిన రచయిత దత్తకథామంజరిని రచించారు. ఇప్పుడు ఈ దత్త కథామంజరిలో దత్తాత్రేయ స్వాముల వారి లీలలను వర్ణించారు. దీనిలోనే శ్రీదత్తాత్రేయోదాహరణ కావ్యాన్ని కూడా కూర్చారు. ‘దత్తుని గాథ, అనఘలీలలను, గట్టి మహిమలందు కలవు దండిగను’ అని శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారు తమ ఆశీస్సందేశంలో పేర్కొన్నారు. దీనిలో దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర, లీలలు, మహిమలు, భక్తులను రక్షించినటు వంటి అంశాలు చెప్పబడినాయి. గూఢ విద్యను అభ్యసించడానికి శిష్యరికం చేయదలచి వచ్చిన మునులను దత్తాత్రేయుడు పరీక్షించాడు. అనుకున్న రీతిలో కాకుండా వేరొక పద్ధతిలో వారికి కనిపించడంతో మునులంతా విముఖులై వెనుదిరిగారు. పరీక్షలో నెగ్గినవారు కొందరే మిగిలారు. అలా వారికి సచ్చిదానంద రూప దర్శనంతో అనుగ్రహించారు. ప్రణవ శంఖంలో బ్రహ్మదేవునికి అనఘాసమేతుడై దర్శనమిచ్చాడు. దేవేంద్రుడు భగవత్తత్వాన్ని గుర్తించడాన్ని వివరిస్తూ ‘తత్త్వమరసి తీవు తప్పించె నాతండు, నదియె దృష్ట్భిదమనియె స్వామి’ అని ఈ భేదానికి కారణాన్ని తెలిపారు. సూర్యుడు దత్తాత్రేయుని స్తుతించే సందర్భంలో పద్మతీర్థ మాహాత్మ్యాన్ని ప్రస్తుతిస్తూ ‘తత్పరిస్పర్శనాకిన్ని తళుకులిచ్చె తెలియ నీవొక స్పర్శవేధివి ధ్రువమ్ము’ అని ఆ మహాత్మ్యానికి గురుపాద సంస్పర్శనమే కారణమని సమర్థించారు. వాసనా పిశాచములో శ్రద్ధ కలిగిన వేదశర్మను అనుగ్రహించాడు. పరీక్షలో గురుకృప కోసం శిష్యులు ఎదురుచూడడం వర్ణనాత్మకంగా ఉంది. వేదశర్మ భిక్షుకునిలో దత్తాత్రేయుని దర్శించగలగడానికి ‘చిరకాల శ్రుతిపాఠ విశదబుద్ధి వృత్తినేకాగ్రపరచి భావింపదొడగె’ అని కారణం తెలిపారు. వేదశర్మ శ్రద్ధ్భాక్తులతో, పాండిత్యంతో భగవద్దర్శనం చేసుకున్నాడు. సెలవులో ‘విష్ణుదేవునకు జీవితమప్పన చేసి యుండుటచే పెల్లుగ విష్ణుదత్తుడను పేరు తపోమయ మీకె చెల్లెతో’ అనేంతటి గొప్ప భక్తుడు విష్ణుదత్తుడు. కార్తవీర్యార్జునుడు ‘ఎందుకు జన్మమెత్తితిని, యేమి యొనర్చితి జన్మమెత్తి ఇంకెందుకు దత్తసన్నిధికి నేగితి’ అని అంటూ గోవును తీసుకొని పోతూ పశ్చాత్తాపపడడాన్ని వర్ణించడంలో ఐహిక సుఖాలు ఎంత క్షణికమైనవో తెలుస్తుంది. పరశురాముని హృదయవేదనను పరశురామ పరిదేవనములో మనం చూడవచ్చు. కార్తవీర్యార్జునుని సంహారానంతరం పరశురాముడు మనస్సులో బాధపడుతూ ‘నా మనసునందు కార్యవీర్యు గూల్చుట ఘన జయంబుగ తోచనే లేద, యంతటితోడ నతని మాటె మరచితి గోమాత యాటలబడి’ అనడంలో అతని హృదయం ఆవిష్కృతమైంది. అలర్కుడు రాజ్యకాంక్ష విడనాడి ఆముష్మిక చింతనాపరుడుగా మారిన విధానాన్ని అలర్క గీతంలో వర్ణించారు. సంభాషణలు రమ్యమైన శైలిలో వున్నాయి. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారి ఆశీర్వాద ఫలితంగా ఆవిర్భవించిన దత్తాత్రేయోదాహరణ కావ్యంలో రచయిత ప్రతిభ వ్యక్తమవుతున్నది. సులభమైన కథాకథనంతో, కావ్య సౌందర్యంతో, భక్త్భివంతో, పారాయణ యోగ్యంగా వున్న ఈ దత్తకథామంజరిని రచయిత భగవంతునితోపాటు పఠితలకు కూడా అందించారు.

-కె.లక్ష్మీఅన్నపూర్ణ