అక్షర

పేదల కన్నీళ్ల కథ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐదుగురు లోఫర్లు
(సాంఘిక నవల)
పంజాబీ మూలం: కిషన్‌చందర్
తెలుగు అనువాదం:నిడమర్తి ఉమారాజేశ్వరరావు
శ్యామలాదేవి
వెల: రూ.100
ప్రతులకు: విశాలాంధ్ర అన్ని బ్రాంచీలు

** ** *** ***

కిషన్‌చందర్ పంజాబ్ ప్రాంతానికి చెందిన ‘అభ్యుదయ’ రచయిత. వీరి రచనలు తెలుగు పాఠకులకు సుపరిచితమే. అశ్రువాహిని, పేకముక్కలు, ఒకానొక గాడిద ఆత్మకథ వంటివి లోగడ తెలుగులోకి అనువదింపబడ్డాయి. ఇప్పుడు ఎడమర్తి ఉమామహేశ్వరరావు, శ్యామలాదేవి గారలు సంయుక్తంగా ‘ఐదుగురు లోఫర్లు’ అనే చిన్న నవలను తెలుగులోకి తెచ్చారు. ఇందలి పల్మానీ, తాంతియా వంటి పాత్రలు కల్పితాలు అని చెప్పలేము. ఈ కథ సంఘటనలు మనం తెలుగునాట చూస్తున్నవే. అంటే కథనం మాత్రమే రచయితది. కథ అన్ని ప్రాంతాలకు చెందుతుంది. అన్నార్తులు, దొంగలు, కుష్టు బాస్కోలు మనకిందులో దర్శనమిస్తారు. వీరు ఇలా ఉండడానికి కారణం ఈ సామాజిక వ్యవస్థయేనని రచయిత సిద్ధాంతం. ఆర్థిక అసమానతలు ప్రధాన కారణం అని కిషన్‌చందర్ నమ్మాడు. ‘ఈ దేశానికి నెహ్రూ చేసింది ఏముంది?’ (28వ పుట) అని ఒక పాత్ర ప్రశ్నిస్తుంది. మరి దేశవ్యాప్తంగా ఆ రోజుల్లో అభ్యుదయ రచయితలూ, వామపక్ష మేధావులూ నెహ్రూకు ఎందుకు మద్దతునిచ్చారు? ‘ఆకొన్న ఆడకుక్కలా జమున పర్సు వంక చూస్తోంది’ (29వ పుట) ఇదీ కిషన్‌చందర్ గారి వాస్తవిక శైలి.
జైలు నుండి విడుదల అయిన తాంతియాతో కథ ప్రారంభమై అనాథ ప్రేత దహనంతో ముగుస్తుంది. ఈ కథ కథ కోసం కాక కిషన్ చందర్ తాను నమ్మిన సామాజిక సిద్ధాంతానికి ‘ప్రాపగాండా’ చేసుకోవటం కోసం రచించాడని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కథనం మథనం అంతంత మాత్రంగానే ఉన్నా కృత్రిమంగా పేదల కన్నీళ్లల్లో లేఖిని ముంచి వ్రాసిన ఒక హిపోక్రాట్‌ను మనం ఇందులో చూడవచ్చు. ఇష్టమైన వాళ్లు ఈ అనువాద నవల చదివి ఆనందించవచ్చు.

-ప్రొ.ముదిగొండ శివప్రసాద్