అక్షర

ఆరోగ్య రక్షా చక్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీచక్రము - మానవ శరీరము
ఆధ్యాత్మిక వైజ్ఞానిక గ్రంథం
-గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్
పేజీలు: 385..వెల: రూ.280
ప్రతులకు: రచయిత
ఇం.నెం.7-8-51
ప్లాట్ నెం.18
నాగార్జునసాగర్ రోడ్
హస్తినాపురం
సెంట్రల్ కాలనీ, ఫేజ్-2
హైదరాబాద్-79.

** ** ** ** **

ఈ గ్రంథం శ్రీవిద్యకు సంబంధించినది. శ్రీవిద్య, శ్రీచక్రము - మానవ శరీరము - వీటికున్న సంబంధం రచయిత ప్రసాద్ ఆధ్యాత్మికంగా, వైజ్ఞానికంగా ఎంతో అద్భుతంగా వివరించారు.
మొదట శ్రీమాతతో ప్రారంభించి తరువాత శ్రీచక్రము, మానవ శరీరం, ఆత్మ-విచారము, షట్చక్రాలు, సహస్తారం వివరించి తరువాత ముత్తుస్వామి వారి కీర్తనలు, ఓంకారము, హ్రీంకారము - వివరించిన తీరు రచయిత శ్రీవిద్యా పరిణతికి దర్పణం పడుతున్నది. తరువాత మనస్సు, ఆహారము, జీర్ణక్రియ, నాడీ వ్యవస్థ, కుండలినీ శక్తి, ధ్యానము, ధారణ, మంత్రోపాసన ఇచ్చి అనుబంధాలలో శ్రీదేవీ ఖడ్గమాలా స్తోత్రం మొదలైనవి ఇచ్చారు.
దీనికి ఆశీర్వాద శ్రీముఖంలో శ్రీ సిద్దేశ్వరానంద భారతీస్వామి ఆశీర్వదిస్తూ ‘శ్రీ ప్రసాద్ ప్రామాణిక మార్గాన్ని అనుసరిస్తూ ఇటీవలి కాలంలో జరిగిన మహా పురుషుల కథలను అనుసంధానించార’ని అన్నారు.
‘శ్రీచక్రము - మానవ శరీరము’ (3వ అధ్యాయం)లో ఇలా రాశారు.
శ్రీచక్రాన్ని మానవ శరీరంతో పోల్చి పరిశీలించినపుడు ఆ జగన్మాత శ్రీ లలితాదేవి దర్శనమెంత దుర్లభమో అనిపిస్తుంది. మనలోని కర్మేంద్రియ పంచేంద్రియాలు వాటి వెంట పడే మనస్సు, జాగృత్, స్వప్న సుషుప్తి అవస్థలు, త్రిగుణాలు మొదలైనవి అన్నిటినీ శ్రీమాత విభూతులుగా గ్రహించి, వాటిని దాటి బిందు స్థానము చేరుకోగానే లభించే అద్వితీయ సచ్చిదానంద రూపమైన స్వస్వరూపానుభవము కలగటమే శ్రీమాత దర్శనము.
శ్రీవిద్యను ఉపాసిస్తే మోక్షము. అదే శ్రీలలితా సహస్ర నామాలు శివజ్ఞాన ప్రదాయినీ అని వర్ణించాయి. ఉపనిషత్తులు ‘జ్ఞానాతుకైవల్యమ్’ అన్నారు.
వీరు ఈ గ్రంథంలో తమ స్వానుభవం తెలిపారు. వారు కేన్సర్ వ్యాధితో బాధపడుతూ వైద్యపరంగా ఏం చేసినా ఫలితం లేకపోయినపుడు చివరి స్థితిలో శ్రీమాతను ఆశ్రయించారు. అర్థించారు. ఆ ఉపాసనా బలంతో మందులు పనిచేసి ఆయన వ్యాధి నుండి విముక్తులయ్యారు.
రచయిత అనుకోని రాశారో లేదో కాని ఈ గ్రంథంలో 28 అధ్యాయాలు ఉండటం శ్రీ షోడశీ మంత్రాన్ని చెబుతోంది.
ఇది శ్రీవిద్యకు, శ్రీచక్రానికి సంబంధించిన ఒక చక్కటి అవగాహన కలిగించే గ్రంథం. ధ్యాన ప్రక్రియను, వేదాంత విచారణను, సాధనాత్మక జీవన విధానాన్ని పాఠకులకు అందించిన ప్రసాద్ కృషి అభినందనీయం.

-నోరి సుబ్రహ్మణ్యశాస్ర్తీ