అక్షర

సహృదయులతో సాంగత్యానికి కథారూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సహృదయ సాంగత్యం
వ్యాస సంపుటి

*********

-హర్షవర్థన్
వెల: రూ.100/-
ప్రతులకు: రచయిత
203, చాముండేశ్వరి
అపార్ట్‌మెంట్స్
ప్లాట్ నెం.24
సుందర్‌నగర్
హైదరాబాద్-500 038.

రమణ మహర్షి భక్తుని నిబద్ధత ‘వేంపల్లి హనుమంతన్న’ వ్యాసం తెలియజేస్తుంది. రచయితకు ప్రతి సంవత్సరం తిరువణ్ణామలై రమణాశ్రమానికి వెళ్లే అలవాటు. ఒక సంవత్సరం హనుమంతన్న అనే భక్తుడు కొడుకుకు స్వస్థత చేకూరితే పేదవాడైనా అనుకున్న అపకారం ఆశ్రమానికి లక్ష విరాళంగా ఇచ్చాడు. రాజమండ్రి దగ్గరున్న వేమగిరి గ్రామంలో నెలకొల్పిన ‘పరమహంస యోగానంద నేత్రాలయ’ పేరుతో ప్రజలకు ఉచితంగా చేస్తున్న సేవలను అదే పేరుతో వున్న వ్యాసంలో వివరించారు. డా.ప్రభాకర్, ఆయన కుమార్తె డా.హరిప్రియ సేవా
నిరతిని ప్రశంసించారు. బాపట్ల ఆర్ట్స్ కళాశాలలో ఆంగ్ల శాఖాధిపతిగా పదవీ విరమణ చేసిన జమ్మలమడక వేంకటేశ్వర శర్మ సంతానం వున్నా వృద్ధాశ్రమంలో చేరి పెన్షన్‌లో మిగిల్చిన డబ్బుతో అనేక దానధర్మాలు చేశారు. ‘డబ్బు ప్రాధాన్యత ఎంతమేరకే ఎరిగి దానిని అక్షరాలా ఆచరించిన శర్మగారి ద్వారా మలి వయసులో ఎలా ఉండాలో, ఎలా ఆలోచించాలో నేర్చుకున్నాను’ అని రచయిత ‘బాపట్ల మాస్టారు’ వ్యాసంలో ప్రకటించారు.

సమాజంలో, మనుషుల్లో మంచి చెడ్డలు విడివిడిగాను, జంటగాను వెలుగుతుంటాయి. మంచి వాళ్లకి మంచిపైనే ధ్యాస ఉంటుంది. మంచి ఆలోచించడం, మంచి మాట్లాడటం, మంచి వినడం, మంచి గ్రహించడం, మంచి పంచడం చిన్నతనం నుంచి అలవరచుకుని మంచికి మారుపేరుగా నిలిచిన రచయిత సహృదయుడు. ఈ గ్రంథ రచనకు ప్రేరణగా వర్తించిన నేపథ్యం ఆయన మాటల్లోనే, ‘నా మార్గంలో గొప్పవారెందరో జాలువార్చిన ఎనె్నన్నో అనర్ఘ రత్నాల్లో కొన్నింటిని సేకరించగలిగాను. తెలియకుండానే వారి నుంచి వొలికిన ముత్యాలను, వజ్రాలను కొంతలో కొంత మూట కట్టగలిగాను. ఎంతోమంది అతి సామాన్యులని మనం అనుకునేవారు దేవతా గుణాలతో వర్థిల్లడం చూశాను. వారి సంస్కారానికి ముగ్ధుణ్నయ్యాను. అలాంటి సహృదయులయినా సాంగత్యం పూర్వజన్మ పుణ్యఫలమేనని భావించాను. ఈ సంగతులన్నీ నాతోనే ఉండిపోకూడదన్న తలంపుతోనే వాక్యాలుగా కూర్చి వ్యాసాలుగా రాయడానికి సాహసించాను.’
సి.టి.ఓగా ఉన్నత పదవి నిర్వహించి ఇటీవలే పదవీ విరమణ చేసిన వంగల హర్షవర్థన్ ఉద్యోగరీత్యానే కాక తీర్థయాత్రలు, క్షేత్ర సందర్శనలు, ప్రముఖుల సంభాషణలు, నిత్య జీవితంలో తారసపడిన వ్యక్తులు, స్నేహితులు, కార్యక్రమాలలో కలిసినవారు - ఇలా ఎందరితోనో సన్నిహితంగా మాట్లాడే అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. అవతలి వారిలోని మంచిని, మానవతను, మహనీయతను హృదయంలో భద్రపరచుకున్నారు. ప్రతి సన్నివేశంలోను ఆయన ఏదో వైలక్షణ్యాన్ని చూడగలగడం ఆయన ఉత్తమ సంస్కారానికి నిదర్శనం. ఈ సంపుటిలో 20 వ్యాసాలున్నాయి. ఇవి ప్రముఖులవే కాక కొన్ని అతి సామాన్యులకు కూడా సంబంధించినవి కావడం విశేషం. అందరిపట్ల సమాన ఆత్మీయత వ్యక్తమవుతుంది. ఆయన గుర్తించింది మంచితనం. తరతమ భేదాలు కాదు.
తండ్రి నుంచి సద్గుణాలను రచయిత పుణికి పుచ్చుకున్నట్లు ‘నాన్నకు జేజే’ వ్యాసం చదివితే స్పష్టమవుతుంది. తండ్రి శ్రీరామమూర్తి పోలీసు శాఖలో పని చేసినా కారుణ్యంతో, సౌజన్యంతో విధులు నిర్వహించారని తార్కాణాలు చూపారు. ఆయన ‘యూనిఫాంను ఒంటికేగాని మనసుకు పట్టించుకోకుండా చాలా శాంతంగా, ఓర్పుగా ఉండేవారు’. ఒక సందర్భంలో జేబుదొంగను స్టేషన్‌లో కొడితే తండ్రి స్పందన: ‘ఎలా కొట్టారో చూడండి అతనూ మనిషేగా’ అంటూ రూ.20 కానిస్టేబుల్‌కు ఇచ్చి ఒక అమృతాంజనం తెప్పించి అతనికిచ్చి, కాపడానికి వేడినీళ్లు పెట్టించారు. తండ్రి గురించి చెబుతూ ‘జీవితంలో ఆయన దేనికోసమూ ఆరాటపడడం, మితిమీరి తాపత్రయపడటం మేము చూడలేదు’ అంటారు.
రమణ మహర్షి భక్తుని నిబద్ధత ‘వేంపల్లి హనుమంతన్న’ వ్యాసం తెలియజేస్తుంది. రచయితకు ప్రతి సంవత్సరం తిరువణ్ణామలై రమణాశ్రమానికి వెళ్లే అలవాటు. ఒక సంవత్సరం హనుమంతన్న అనే భక్తుడు కొడుకుకు స్వస్థత చేకూరితే పేదవాడైనా అనుకున్న అపకారం ఆశ్రమానికి లక్ష విరాళంగా ఇచ్చాడు. రాజమండ్రి దగ్గరున్న వేమగిరి గ్రామంలో నెలకొల్పిన ‘పరమహంస యోగానంద నేత్రాలయ’ పేరుతో ప్రజలకు ఉచితంగా చేస్తున్న సేవలను అదే పేరుతో వున్న వ్యాసంలో వివరించారు. డా.ప్రభాకర్, ఆయన కుమార్తె డా.హరిప్రియ సేవా నిరతిని ప్రశంసించారు. బాపట్ల ఆర్ట్స్ కళాశాలలో ఆంగ్ల శాఖాధిపతిగా పదవీ విరమణ చేసిన జమ్మలమడక వేంకటేశ్వర శర్మ సంతానం వున్నా వృద్ధాశ్రమంలో చేరి పెన్షన్‌లో మిగిల్చిన డబ్బుతో అనేక దానధర్మాలు చేశారు. ‘డబ్బు ప్రాధాన్యత ఎంతమేరకే ఎరిగి దానిని అక్షరాలా ఆచరించిన శర్మగారి ద్వారా మలి వయసులో ఎలా ఉండాలో, ఎలా ఆలోచించాలో నేర్చుకున్నాను’ అని రచయిత ‘బాపట్ల మాస్టారు’ వ్యాసంలో ప్రకటించారు. ‘దాక్షిణ్య టి.వి.రావు’ వ్యాసంలో సి.టి.విగా పని చేసిన టి.వి.రావు ‘దాక్షిణ్య భావ సమితి’ ద్వారా మానసిక వికలాంగులకు, వారి కుటుంబాలకు శిక్షణ ఇస్తూ చేస్తున్న అసామాన్య సేవలను వివరించారు. పరోపకారానికి వాచ్‌మన్ యేసు కుటుంబం సరైన ఉదాహరణ అని ‘వాచ్‌మేన్ యేసు’ వ్యాసం నిరూపిస్తుంది. ‘పడాల చారిటబుల్ ట్రస్ట్’ వ్యాసంలో రచయిత పడాల సూర్యప్రసాద్ నిరుపేద విద్యార్థులకు అందిస్తున్న సహాయం గురించి చెబుతూ ‘కొంతమందితో పరిచయం ఇంత ఆలస్యంగా అయ్యిందే అని బాధపడతాము’ అని తన మనోభావాన్ని వెల్లడించారు.
‘సరస్వతీ సాన్నిధ్యం’ అనే భాగంలో డా.విశ్వనాథ, బాపు-రమణ, సురభి బాబ్జీ, కర్రా భాస్కర అవధాని ప్రభృతులతో సాంగత్య, పరిచయ విశేషాలు పొందుపరిచారు. వ్యాసం ఆద్యంతాలలో హితోక్తులు, సూక్తులు చేర్చడం ఉత్తమ యోచన.
హర్షవర్థన్ తాను కలిసిన వారిలోని గుణ విశేషాలను జీవితంలో అన్వయించుకుని ఆచరిస్తున్న ఆదర్శమూర్తి. ఎక్కడా దాపరికం లేకుండా మనసు విప్పి చెప్పారు. పాఠకులను ముందు కూర్చోబెట్టుకుని సంగతులు చెబుతున్న సరళమైన శైలిలో రచన సాగింది. ఉత్తమ సాంగత్య విలువను సోదాహరణంగా విశదం చేసే ఈ వ్యాస సంపుటి అన్ని వయోవర్గాల పాఠకులకు మార్గదర్శిగా ఉపకరిస్తుంది.

-జిఆర్కె