అక్షర

ప్రతి కవితా ఒక మిఠాయి పొట్లమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నది అంచున నడుస్తూ.. (కవితా ఖండిక)
-డా.సి.్భవానీదేవి
వెల: రూ.150/-
ప్రతులకు: అన్ని పుస్తక కేంద్రాలలో

**** ***** *******

నది ఎంతో విశాలం. ‘నది అంచున నడుస్తూ’ వుంటే, కలిగే ఊహలు కొల్లలు. స్పందించే మనసుంటే, భావనా శక్తి, భాషా పరిజ్ఞానం పుష్కలంగా వుంటే ఇంక చెప్పేదేముంది? ఇవన్నీ కలిగిన కవయిత్రి సి.్భవానీదేవి. పద్యాన్ని హృద్యం గా రసరమ్యంగా చెప్పగలిగే ఈమె బహుముఖ ప్రజ్ఞాశాలి. కవిత రాసినా, కథ రాసినా, పాట రాసినా చక్కటి పదజాలంతో మెప్పించగలిగే ప్రతిభాశాలి. నది అంచున గ్రంథంలో యాభై ఆరు కవితా ఖండికలున్నాయి. దేనికదే ఒక ప్రత్యేకత కలిగినవి. ఆలోచింపజేసేవి, ఆనందపరిచేవి. ఇలా సాగిపోతాయి అన్నీను. ‘కూతురు ఒక సేతువు’లో కూతురిని కుటుంబంలో ఒక వంతెనగా వర్ణిస్తారీమె.
‘జల వస్త్రాన్ని నిండుగా కప్పుకున్న భూగోళానికి/ జల సౌందర్యాన్ని వివరించాలా?’ అంటూ ఎంతో అందంగా సముద్రం ముద్రలో వర్ణిస్తారు.
‘ఎంతగా మర్చిపోవాలనుకున్నా/ ఒక్కొక్క మనిషి.. సంఘటన/ జీవుని వేదమై సలపరిస్తుంటుంది’ అంటూ - ‘జ్ఞాపకం ఒక శకలం’ కవితలో ఎంతో హృద్యంగా నిజాలను ఆవిష్కరిస్తారు. ఇలా చెప్పాలంటే ప్రతీ కవిత ఒక మిఠాయి పొట్లమే. ఎవరికి వారు చదివి రసానుభూతి పొందాలి. ఈ కవయిత్రి గ్రంథం నుండి, మరిన్ని కవితలు ఆశించడం సహజం. ఆమె కవితా ధోరణి ఇలాగే కొన్ని గ్రంథాలు, ఎన్నో కవితా ఖండికలతో ముందు ముందు కూడా రావాలని కోరుతూ అభినందిస్తున్నాను.

-శారదా అశోకవర్థన్