అక్షర

నవ్వుల హరివిల్లు (పరిచయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుందరి సుబ్రహ్మణ్యం
నవ్వుల కథలు (రెండవ భాగం)
-సి.ఎన్.నాగేశ్వరరావు సి.ఎల్.రాజకుమారి
వెల: రూ.100
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో

*** ********

హాస్యభరితమైన సన్నివేశం చూసినప్పుడు గాని, దాని గురించి విన్నప్పుడు గాని సంతోషంగా నవ్వుకోవటం సర్వసాధారణం. మానవ సహజం. నవ్వు వచ్చే అంశం వుండాలే గాని, ఆనందిస్తూ నవ్వకుండా ఎవరూ వుండలేరు. నవ్వుకొనే అవకాశం ఎప్పుడు వస్తుందా అని అర్రులు చాస్తూ, అలాంటిది, ఎలాంటి చిన్న అవకాశం వచ్చినా, పట్టపగ్గాలు లేకుండా పడిపడి నవ్వుతారు కొందరు. మరి కొందరు, హాస్యం ఎక్కడ దొరుకుతుందో, పనికట్టుకొని వెతికి మరీ పట్టుకుని, హాస్య రసాస్వాదన చేస్తూ ఉంటారు. నవ్వు వచ్చినప్పుడు, మహదానందంగా, మనసారా, నవ్వగలగటం భగవంతుడు మానవాళికి ప్రసాదించిన ఒక గొప్ప వరం. సున్నితమైన హాస్యం గొప్ప వినోదాన్ని ఇస్తుంది. జిహ్వకు షడ్రసోపేతమైన భోజనంలాగా, మంచి హాస్యం మనసుకు ఉల్లాసం కలిగిస్తుంది. అనేకానేక శారీరక రుగ్మతలకు, మానసిక వత్తిళ్లకు విరుగుడుగా పని చేస్తూ, మనిషి సంపూర్ణ ఆరోగ్యానికి దివ్యౌషధంలాగా పని చేస్తుంది. ఏదో కాల్పనిక జగత్తు నుండో, ఆకాశం నుండో ఊడిపడి వచ్చేది కాదు హాస్యం. అది ప్రతివారి జీవితంలోనూ నిత్యం పండే పంట. హాస్యాభిరుచి ఉన్నవారు, అలా అప్పుడప్పుడు మదిలో మెదిలే మెరుపు తీగెలను, అక్షరస్థం చేసి, లోకానికి అందిస్తూ ఉంటారు. సుందరి సుబ్రహ్మణ్యం నవ్వుల కథలు రెండవ భాగం ఇది. మొదటి భాగంలానే ఈ భాగం కూడా నవ్వుల హరివిల్లుని వికసింపజేస్తుంది.