అక్షర

సుదూర తీరాన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిద్రను వేటాడే వేళ
మేల్కొని వెంటాడే కోరికలన్నీ
ఎగిసిపడే కెరటాల్లా
కలల తీరాన్ని కౌగిలించగానే
గుండె దీవుల్లో ఒక దీపోత్సవం!
ఆ దీపోత్సవ నీడలో
జ్ఞాపకాల దీవిలో
ఈ వర్తమానమంతా
ఒక వలయాకారపు నడక,
సుదూర తీరాన
రెపరెపలాడే ఆకారాలన్నీ
కంటికెదురవగానే
చెదిరిపోయే భ్రమల
కెరటాల మీదుగా
కొనసాగుతున్న ప్రయాణం,
చుట్టూ సొరచేపలు
వాటి రంపపు నోటిలోకి
జారిన చిన్న చేపల కొస ప్రాణాలను
తిరిగి అలల జోలెలోకి
విసిరేసే సాగర వాత్సల్యం!!

- నిఖిలేశ్వర్