అక్షర

వొరుప్పోటు(పరిచయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వొరుప్పోటు
-యాములపల్లి నరసిరెడ్డి
వెల: రూ.50/-
ప్రతులకు: కె.చంద్రకళ
7/144, చాకర్లపల్లి -515122
సోమండేపల్లి అనంతపూర్.
9492819059

** *** **

కవిత జీవితాన్ని ప్రతిబింబించాలి. అది కటువుగానూ, మృదువుగానూ మనిషిని హెచ్చరించి పురోగమనానికి తోడ్పడాలి. నొప్పి వున్నవాడు బాధపడ్తాడు. బాధ పడేవాడికే నొప్పి తెలుస్తుంది. ఆరుగాలాలు కష్టించినా, అరచేతికి అన్నం ముద్ద దక్కకపోతే అన్నదాత దుఃఖం ఎవరికి తెలుస్తుంది? ఎవరితో చెప్పుకుంటే తీరుతుంది? ఈ దుఃఖం ఆగదు. ఈ బాధ తీరదు! ఈ రైతు మారడు, మారలేడు. ఈ దుక్కి చూపుల, దిగుళ్ల పరగడుపులను పాలించే ప్రభుత్వాలు పట్టించుకోవు. ఏ రైతు బజార్లూ పట్టించుకోవు! ఏ మార్కెట్‌లోని కాటాముల్లూ ఇతడి వైపు మొగ్గు చూపదు! ఈ దుఃఖాన్నీ, ఈ దిగులునూ కవి అన్నవాడే పట్టించుకోవాలి. పట్టించుకు తీరాలి కూడా! ఆ బాధ్యతను మీదేసుకొని అన్నదాత దుఃఖంలో పాలుపంచుకొంటున్న ఈ కవి యాములపల్లి నరసిరెడ్డి.
కరువు సీమ కన్నీళ్లలో అనంత ఎడారిలో వొరుప్పోటును దీర్ఘ కవితగా వెలువరిస్తూ బాధ్యత ఎరిగిన కవిగా మన ముందుకొచ్చాడు. జీవ నదులు ఎలాగూ లేవు. కనీసం బతుకుతెరువుకు జీవ జలాలు లేని దుస్థితిలో వట్టి మట్టి మనుషులుగా మిగిలి ఉన్నాం. చినుకులేని సీమలోని మట్టి హింసలు పాలబడుతున్న అనంత రైతుల ఆత్మఘోషను ఈ దీర్ఘ కవిత ఆవిష్కరిస్తుంది.