అక్షర

రసరమ్యంగా రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదగిరి రామాయణము
-వేదగిరి వేంకట నరసింహరాయ శర్మ
వెల: రూ.100
పుటలు: 371కి పైగా
ప్రతులకు: రచయిత
హారితాశ్రమమ్, జానకమ్మపేట
పెద్దపవని వయా ప్రకాశం జిల్లా - 7382006842

** ** *** **

ఎన్నో రామాయణాలు, ఎందరెందరో మహానుభావులు రామకథను రచించి తరించారు. తరిస్తున్నారు. రామకథలోని విశేషం అదే. అమృతం ఎంత గ్రోలినా తనివితీరదు. పద్య కవిత్వానికి ప్రాశస్త్యం తగ్గుతున్న ఈ రోజుల్లో రచయిత వేదగిరి వేంకట నరసింహరాయ శర్మ పద్య కావ్యంగా రామాయణం రచించి ఆ పద్య ప్రక్రియ యందు పాఠకులకు ఆసక్తిని కలిగిస్తున్నారు.
‘వెనె్నల విహారం’లో ముందు మాటలో పువ్వాడ వారు వేదగిరి వారి కవిత్వం వాల్మీకి కవి కోకిల ఆలపించిన కవితా గానం వలె ఉందని సూచించారు. ఇంకా వారే ఇలా అన్నారు. ‘వేదగిరి వారి రచనలో చెప్పుకోదగింది - కథను పరుగులెత్తించే కథనం, పాత్రలు, కవిత్వం కలిసి రచనకు రామణీయకతను చేకూర్చే కథా నైపుణ్యం. అలాగే అప్పుడే అయిపోయిందా ఆశ్వాసం అనిపించే రచనా చణత్వం’ అన్నారు. ఇది సత్యదూరం కాదు.
వేదగిరి వారు ‘మారుతాత్మజుండు మది యందు నెలకొని పలుక పలుకుచుంటి ప్రాజ్ఞులార (పేజి.14) - అని మొదట్లోనే చెప్పి రామాయణ గ్రంథాన్ని సుమారు 1500 పద్యాలలో చాలా మధురంగా రచించారు.
దశరథుడు పాయసం భార్యలకు పంచటం వాల్మీకంలోది కాక ఆధ్యాత్మ రామాయణ కర్తకు అనుగుణంగా రచించారు. వాల్మీకంలో దశరథుడే పాయసం సుమిత్రకు రెండుసార్లు ఇచ్చినట్లు ఉంటే ఆధ్యాత్మ రామాయణంలో దశరథుని రాణులు కౌసల్య, కైకలు వారి దాంట్లో చెరొక సగం ఇచ్చినట్లుగా ఉన్నది. దీన్ని వేదగిరి వారు అనుసరించారు.
వేదగిరి వారు ముందే తమ ‘వందే వాల్మీకి కోకిలమ్’లో చెప్పారు. కంకంటి పాపరాజుగారి ఉత్తర రామాయణంలో పద్యాలను యథాతథంగా ఒకటి రెండు చోట్ల తీసుకున్నానని, అలాగే వాల్మీకంలోని ‘ఆదిత్య హృదయం’ సంస్కృత శ్లోకాలను యథాతథంగా తీసుకున్నాను’ అని కూడా రాశారు.
‘ఆదిత్య హృదయం (వాల్మీకంలోని సంస్కృత శ్లోకాలు) శ్రీవిద్యను రహస్యంగా సూచిస్తున్నది. అవి యథాతథంగా తీసుకొనుట వలన వేదగిరి వారు ఆ పవిత్రతను కాపాడారనుకోవచ్చు.
అలాగే రచయిత కొన్ని ప్రయోగాలు చేసి ఆయా కవుల ఎడల కల గౌరవాన్ని కనబరచారని పువ్వాడ వారన్నారు. ఉదా.‘నవ్వు రాజిల్లెడు మోము వాని’ ‘కంటిని మిమ్ము లక్ష్మణుని గంటి’ ‘ఐనను పోయి వచ్చెదను’ మొదలయినవి.
రామకథను తనదైన శైలిలో ఆవిష్కరించిన రచయిత వేదగిరి వారు అభినందనీయులు. ఈ గ్రంథం తెలుగు పాఠకులు అందరూ చదివినట్లయితే సంప్రదాయ పద్య రచన యందు ఆసక్తిని పెంపొందించుకోవచ్చు.

-నోరి సుబ్రహ్మణ్యశాస్ర్తీ