అక్షరాలోచన

విరిగిన మనసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భౌతిక సూత్రాల
అధ్యయనం
సౌకర్యాల పెంపుదల
రోదసీ యాత్రల పరంపర
సాంకేతిక విజ్ఞతకు
కొలమానాలే కాని
హృదయ వైశాల్యతను
కొలిచే కొలబద్దలా
వికసిత మనసుల చేయునా!
అహాన్ని పెంచే చదువులు
అదో అథో ప్రపంచానికి లాగి
ఒంటరితనాన్ని మిగిల్చే యాంత్రికత
పదార్థ ప్రపంచ పరిజ్ఞాన
పరిష్వంగంలో
మానవుడు పూర్ణుడవుతాడా!
సమీకరణలు సామాజిక రుగ్మతల
నిలువరించునా?
హింసా ద్వేషాల మూలాల
వెతికి వెతికి తీయగలవా?! మెలిక విప్పగలవా?
జరుగుతున్న వృద్ధి
పెరుగుతున్న సంపద
నిర్మాణత్వానికా?
విధ్వంసానికా?!
ఛిద్రమవుతున్న బ్రతుకులు
వాడి రాలిపోతున్న పసిమొగ్గలు
కోపమెక్కడుంది?
కలచి వేస్తున్న సంఘటనలకు పరిష్కారమేమి?
కడకు
సుప్తులని ఎంచక, సుత్తిదెబ్బల
తాళి కట్టిన ఇల్లాలిని
కన్నబిడ్డ లిర్వురిని కడతేర్చి
తన్నుతా చంపుకొని
మిగిలిన ప్రసన్నను
శోకసంద్రాన పడవేసి
సాధించినది ఏమి
ఊపిరి పోయుట చేతగాని
ఊపిరి తీయు మీకు అధికారమెవరిచ్చినారు
అశ్లీల, అమానవీయ, అమానుష
దృశ్య మాధ్యమాల వీక్షణల
ఫలితమిది కాదా?
ప్రశ్నించుకొనుడు
మేల్కొనుడు
విలువలు పెంచి
బంధాల బలపరిచే విద్యల
సంపద పెంచే చదువుల సరసన చేర్చి
మనిషికి మనిషి చేరువయే
పాఠాలు వల్లె వేస్తూ
అడుగులు వేస్తే
మరో ప్రపంచం వస్తుంది
లేకుంటే
విరిగిన మనసుల ప్రపంచం
సాక్షాత్కరిస్తుంది

-జి.కె.సుబ్రహ్మణ్యం 9704013145