అక్షరాలోచన

అందం - ఆనందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకులు కొమ్మలకు అందం
కొమ్మలు చెట్లకు అందం
చెట్లు జగతికి అందం
ఈ జగతి సృష్టికే అందం

పాదుకొన్న మూలాల్లో అవ్వా తాతయ్యల
విచ్చుకొన్న కొమ్మలు నాన్నైతే
ఆమె చాటుపిందెలు
అమ్మచాటు బిడ్డలే అవుతాయి
ముకుళించిన మూకుమ్మడి పూలమొగ్గల బిడియాలు
విరిసిన దరహాసపు పూరేకుల పరదాలు

ఆద్యంతం ఆమూలాగ్రం అమృతంగమయం
ఆ ఆనందపు అనుబంధాల అనుసంధానం
అచ్చంగా మూడు తరాల ముచ్చట్లను
వెచ్చంగా కలబోసుకున్న
ఓ సజీవ శిల్పకళా భావనా సౌందర్యం

చెట్టులోనూ ఓ ఇల్లుంది
ఆ ఇంటిలో ఓ కుటుంబం వుంది
ఆ కుటుంబానికో తత్వం వుంది
పచ్చని కాపురం చల్లని సంసారం
కలగలసిన బంధాలు
కలబోసుకున్న అనుబంధాలు
నిండైన లోగిళ్లు, మెండైన భావాలు
ఆశ్రీత జీవులకావాసాలు
ఎదిగిన జీవితసారం నుండి
పండిన మాధుర్యపు జీవన ఫలాలు
కోరివచ్చిన అతిథులకు కుదురైన ఆతిథ్యాలు

బంధాలకు నెలవులు కుటుంబాలు
అవి అనుబంధాలకు ఆలయాలు
మనిషికి బంధం విలువ తెలియాలి
అనుబంధాల మధ్య జీవించాలి
అనుభూతులను శ్వాసించాలి
ఆనందాల లోగిళ్లకు
అనుబంధాల తోరణాలు తోడైతే
అందరి ఇళ్లూ
జీవన సాఫల్యతలకు ప్రతీకలే కదా
కుటుంబాన్ని ప్రేమించేవాడు
ప్రపంచాన్నీ ప్రేమిస్తాడు
అందుకే చెట్లు జగతికి అందమైతే
జగమంత కుటుంబపు ఈ ఆనవాళ్లే
జగదానందపు కారకాలు అవుతాయి.

-కె.రవీంద్రబాబు 9052778988