అక్షర

జ్వలిత గీతా సంచలనం(పరిచయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-సిహెచ్.మధు
వెల: రూ.120
ప్రతులకు: నవోదయ బుక్‌హౌస్
హైదరాబాద్. 040 -24652387

** *** **

సిహెచ్.మధు కలం నుంచి వెలువడిన జ్వలిత గీతా సంచలనం ‘ఘర్షణ’ కవితతో మొదలయ్యింది. భావోద్వేగాల గ్రాఫ్ పుస్తకం ఆరంభం నుంచి ఆఖరి దాకా కనిష్ఠ గరిష్ఠ రేఖల మీద కదులుతూనే ఉంది. ఒక సామాజిక అవసరం అని నిర్ణయించుకున్నాక కలం కదిలింది. ఇందులో ప్రతి కవితా ఒక సంచలనమే. క్రొత్తక్రొత్త పదబంధాలు, వాటికి తగిన కథనం. విషయం చాలా విషమం. కవి నిరాశకూ, నిస్పృహకూ, నిర్వేదనకు గురి అవుతూ, అంతలోనే తేరుకుని యుద్ధ రంగానికి తనను తాను సన్నద్ధం చేసుకుంటూ ఉంటాడు. తన అనుభవాల్ని స్వగతంలో మనకు వినిపిస్తాడు. మనతో పంచుకుంటాడు. ప్రపంచీకరణ, పాలకుల అబద్ధపు వాగ్దానాలు, మార్కెట్ మాయాజాలం, ప్రజల కడగండ్లు కవి చాలా దగ్గరగా పరిశీలిస్తాడు. పీడితులకు ధైర్యాన్నిస్తూ దైన్యాన్ని దూరం చేస్తాడు. అంతిమ విజయం ప్రజలదేనని తీర్పునిస్తాడు. విముక్తి పోరాటాలపై ఆయన నిబద్ధతను ఈ కవితా సంపుటి మనముందుంచింది. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లయినా మన బ్రతుకుల్లోకి ఇంకా వెలుగు రాలేదని, తెల్లవారనే లేదని ఈ కవితా సంపుటి నిరూపిస్తుంది. అందుకు మనం ఏం చేయాలో దిశా నిర్దేశం చేస్తుంది. సమాజాన్ని తట్టిలేపే కవితా వస్తువుతో ఈ పుస్తకాన్ని తీసుకు వచ్చారనిపిస్తుంది.
కొత్త పుస్తకం