అక్షర

పిల్లలకి నచ్చే జాబిల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాబిల్లి రావే!
బాలగేయాల సంపుటి
-వాసా ప్రభావతి
వెల: రూ.30/-లు.
ప్రచురణ- వాసా ప్రచురణలు, మలక్‌పేట మున్సిపల్ కాలనీ,
హైదరాబాదు- 500 036.

ఇటీవలి కాలంలో బాల సాహిత్యం బాగానే వెలువడుతోంది. పిల్లలకోసం, కథలూ, కవితలూ, గేయాలూ చాలానే వస్తున్నాయి బాలలకోసం. ఇవన్నీ మనదైన సంస్కృతిని తెలుపుతూ, మనదైన భాషలో రాయాలనే తపన, ఆసక్తి చాలామంది రచయితలలో కలుగుతోంది. ఇది ముదావహం. వాసా ప్రభావతి కూడా తన ఇతర రచనా ప్రక్రియలతోపాటు, బాలలకోసం వ్రాస్తూ వున్నారు. ‘జాబిల్లి రావే’ బాలగేయాల సంపుటి ప్రతీ బాలా పాడుకోవడానికి అనుగుణంగా వున్నాయి. అందులో కొన్నిట కొన్ని పంక్తులు.
‘‘మంచిని పెంచేదెందుకు?’ అంటే వచ్చే సమాధానం.
అందరు హాయగ బ్రతికేటందుకు అంటారు. ఎంతో సులభంగా పిల్లలకు అర్థవౌతుంది. ఇలాగే పాతిక గేయాలున్నాయి. సెలవుల్లో పిల్లలకు ఇదొక అక్షయపాత్ర హాయిగా ఆడుకోవడానికీ, పాడుకోవడానికి.

-శారదా అశోకవర్ధన్