అక్షర

అంతం వరకు అనంతం.. -కె.లలిత( పరిచయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతం వరకు అనంతం.. -కె.లలిత
వెల: రూ.200/-
ప్రతులకు: వి.రమేష్‌బాబు
1-3-183/40/70/501
చంద్ర అపార్ట్‌మెంట్స్
స్ట్రీట్ నెం.9, ఎస్‌బిఐ కాలనీ
గాంధీనగర్, బాకారం
హైదరాబాద్-500 080
** *** *******

‘అంతం వరకు అనంతం’ చదువుతున్నప్పుడు అనేక రకాల భావనలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈ తరహా రచనలు తెలుగులో ఎంతో అరుదు. గతంలో ఇంతటి గాఢమైన అనుభవాలను చరిత్రతో రంగరించి చెప్పిన రచన దాశరథి రంగాచార్య గారి ‘జీవనయానం’ ఈ రెంటికీ బాగా పోలికలు కనిపిస్తాయి. నమ్మిన విలువల కోసం జీవితాన్ని పణంగా పెట్టిన మహామహుల కథే జీవనయానం. అదే మోస్తరుగా తమ జీవితాంతం నిబద్ధత, చిత్తశుద్ధి, విలువలు, మమతలతో కొనసాగిన సత్యనారాయణరావుగారు, సీతగారు కూడా నిజంగా ఆదర్శనీయులు. సవ్యసాచి, బహుముఖ ప్రజ్ఞాశాలి వంటి మాటలు సత్యనారాయణరావు గారి జీవితానికి మాత్రమే నప్పుతాయి అనిపిస్తుంది ఈ గ్రంథం చదివిన తర్వాత. ఆ దంపతులు ఇప్పుడు దివంగతులే కావచ్చు - కానీ వారి జీవితాచరణ, సంకల్ప బలం, బిడ్డల శిక్షణ, వివిధ అంశాల పట్ల వారికున్న సాధికారత, రుజువర్తనాన్ని ఆచరించే నిబద్ధత, మొక్కవోని సేవాతత్పరత, సమాజం కోసం - తోటివారి బాగు కోసం పడిన తాపత్రయం, కడవరకూ పాటించిన చిత్తశుద్ధి, కష్టాల పట్ల ప్రదర్శించిన అపార ఓరిమి.. ఇవన్నీ ఆ ఇద్దరి వ్యక్తిత్వాల సారాంశాన్ని పట్టి చూపుతాయి.