అక్షర

రైతు గుండె కోత.. ఆవేదనల పోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైతు ఆత్మహత్యలు - మనం...!?
-సజయ
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో

సాధారణంగా ఓ పుస్తకాన్ని సమీక్షించాలంటే, శీర్షికను బట్టి, వస్తువును బట్టి, ఆ తర్వాత శైలిని బట్టి, కథనాన్నిబట్టి రాయడం జరుగుతుంది. గతంలో ముఖచిత్రం, గెటప్ లాంటి అంశాల్ని కూడా పట్టించుకునేవారు. కాని, కొన్ని శీర్షికలు, వస్తువు దాదాపు ఒకే నాణెని కిరువైపుల వుంటే, కథనమంతా ఒకే తీరు అనుకుంటాం! కాని, దీనికి భిన్నంగా ‘సజయ’ రైతు ఆత్మహత్యలు - మనం..!?’ అనే శీర్షికన రాసిన కథనాలు, చదవడానికి వార్తాకథనాల్లా ఉన్నా, ఒక్కో కథనం రైతుల హృదయాల్లోని కవాటాల చప్పుళ్లను వినిపిస్తుంది. ఆ గుండె చప్పుళ్లు నేటి ఫురిటి నొప్పుల్ని కూడా బదిరులమై పోతున్న మన చెవులకు వినిపించేలా చేసాయి. అందుకే, రైతు ఆత్మహత్యలు సరే! మన కడుపుల్ని నింపుతున్న వారి ఆర్తనాదాలకు మన జవాబేమిటి అనే ప్రశ్న శీర్షికలోనే కొట్టొచ్చినట్లు కనపడుతున్నది.
వ్యవసాయ మరణ మృదంగాల్ని ‘ది హిందూ’ దినపత్రికలో వినిపించిన పి.సాయినాథ్ మాటలు, అందరు కరువును ఇష్టపడతారు.. (ఉ్పళూకఇ్యజూక య్పళఒ జ్యూఖదఆ) అనే వాక్యాలతో మొధలైన కథనాలు, ఇప్పుడు అందరు రైతు ఆత్మహత్యల్ని కావాలనుకుంటున్నారు... (ఉ్పళూకఇ్యజూక శళళజూఒ చ్ఘిౄళూ ఒఖజషజజూళఒ) అంటూ, ఈ వాక్యాన్ని ఎవరికి వారే అన్వయించుకోవాలనే చురకను అంటించారు సజయ. ఇలా మొదటి కథనంతో మొదలైన రైతు ఆత్మహత్యల గాథలు, ఆస్ట్రేలియా ఔత్సాహిక వ్యవసాయవేత్త బిల్‌మాలిసన్ రూపొందించిన పర్మా కల్చర్‌తో ప్రేరేపించబడి దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ, దానితో అనుబంధం కల్గిన సికిందరాబాద్ నివాసి తమిళ వెంకట్, చిప్కో ఉద్యమంతో ప్రేరేపించబడిన కర్నాటక అప్పికో ఉద్యమం దాకా, రియో డిజనీరియో సదస్సులో కెనడా నుంచి వచ్చిన సెవర్నసుజికి చేసిన ప్రసంగాన్ని, గుజరాత్‌లో భాస్కర్ హిరాజి సావె స్థాపించిన ‘కల్పవృక్ష’ పక్షాన హరిత పితామహుడిగా కీర్తించబడుతున్న స్వామినాథన్‌కు ‘... మీకు వ్యవసాయంలో సున్నా అనుభవం లేకున్నా, ఓ హానికరమైన వ్యవసాయ విధానాన్ని దేశంలోకి దిగుమతి చేయించారు..’ అంటూ ఓ ఘాటైన లేఖను కూడా పొందుపరిచిన రచయిత్రి, శాస్ర్తియ చింతనతోనే కాక, ఓ సామాజిక చింతనతో వ్యవసాయ రంగాన్ని విశే్లషించడం అభినందనీయం!
ఇలా భారతీయ వ్యవసాయ విధానానికి ముగ్ధుడై, వ్యవసాయ దారుల్ని గురువులుగా భావించి, సేంద్రియ వ్యవసాయ విధానాలపై ‘ఎన్ ఎగ్రికల్చరల్ టెస్ట్‌మెంట్’ అనే పుస్తకాన్ని రాసిన సర్ ఆల్బర్ట్ హోవార్డ్, జపాన్ వ్యవసాయానికి ఆద్యుడుగా భావించే మసనోబు ఫుకుదోకా రాసిన గడ్డిపరకతో విప్లవం, దబోల్కర్ వ్యవసాయ విధానాల దాకా, ప్రతి కథనానికి ఓ వివరణ, ఓ గుండె చప్పుడును పరిచయం చేస్తూ, స్వయానా పాఠకులు రైతు కుటుంబాల బాధిత మహిళలతో ఆవేదనను పాలుపంచుకున్న అనుభూతిని కల్గించే కథనాలు ఈ సంకలనంలో కలవు. మహిళా కిసాన్ అధికార్‌మంచ్ (మకామ్), దక్కన్ సొసైటీ లాంటి సంస్థలు మహిళా రైతుల సాధికారతను ఏ విధంగా అభివృద్ధి చేశాయో, పంజాబ్ మహిళలు భూమి హక్కుకై ఏ విధంగా ప్రశ్నించారో, హరిత విప్లవంతో దెబ్బతిని, కేన్సర్ బారిన పడిన పంజాబ్‌ను తిరిగి ఎలా కాపాడుకోవాలో లాంటి సవాళ్ల స్వీకరించిన తీరును, చివరికి అమెరికా అనుభవాల్ని, వాతావరణ మార్పుల మీద పారిస్ నగరంలో జరిగిన సదస్సుకు నిరసనగా, చెప్పుల్ని, బూట్లని వదిలి, కొట్టకుండానే చెప్పుదెబ్బల్ని రుచి చూపించిన వైనాన్ని ‘సజయ’ సందర్భోచితంగా ప్రస్తావించడం కథనాలకి మరింత బలాన్ని చేకూర్చాయి.
దేశవ్యాపితంగా, ముఖ్యంగా తెలంగాణలో, అందులో తెలంగాణ ఏర్పడిన తర్వాత రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగడాన్ని ప్రశ్నిస్తూనే, అధిక దిగుబడుల పేరున అగ్ర రాజ్యాలా, ముఖ్యంగా అమెరికా కనుసన్నల్లో నడిచే మోన్‌సాంటో లాంటి విత్తన కంపెనీలు, వీటిని ఈ దేశంలో అనుమతిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతూనే, అగ్రరాజ్యానికి ఎదురొడ్డి నిలబడిన క్యూబా అనుభవాల్ని మన ముందుంచి, ఫిడెల్ కాస్ట్రో నుంచి మన నాయకులేమైనా గుణపాఠాల్ని నేర్చుకోగలరా అని నిలదీసారు. ఓ సాధారణ ఛత్తీస్‌గఢ్ గిరిజన మహిళ, గడగడా 97 రకాల ఆహార పంటల్ని ఉటంకించడాన్ని బట్టి, భారత వ్యవసాయ రంగం ప్రపంచంలోనే ఎంత ఉన్నతంగా విరాజిల్లిందో ఎత్తిచూపారు.
దాదాపు సంవత్సరంపాటు కొనసాగిన ఈ 51 కథనాలలో అత్యధిక కథనాలు, రైతు ఆత్మహత్యల తర్వాత ఆ ఇంటి మహిళలు పడే ఆవేదనను సాక్షాత్కరిస్తే, ఇవి ఆత్మహత్యలని నిర్ధారించడానికి, తెలంగాణ ప్రభుత్వం అడిగే పదమూడు రకాల చిత్రహింసలు పెట్టే డాక్యుమెంట్ల లిస్టుదాకా, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యల్ని, సవాళ్లని, నివారణల్ని, వ్యాపార పంటల నేపథ్యంలో జరుగుతున్న దోపిడీని, పంటలంటే కేవలం వరి, గోధుమలే కావని, చిరుధాన్యాల ఆవశ్యకతను, వాటి ద్వారా రోగగ్రస్తమవుతున్న భారత ప్రజల్ని రక్షించుకునే విధానాల్ని రచయిత్రి సోదాహరణంగా వివరించారు. ఈ సందర్భంగా పంజాబ్‌లో ఏర్పాటైన ఖేతి విరాసత్ మిషన్ ఉద్యమాన్ని ప్రస్తావించి, పాలకుల కళ్లు తెరిపించే ప్రయత్నం చేసారు. తాము తలచిందే అభివృద్ధి అని భావించే పాలకులకు ఇలాంటివి చేదు గుళికల లాగానే కనపడుతాయి.
‘మీ పట్నమోల్లకు మా యవసాయం ఇబ్బందులు అర్థంకావు..’ అంటూ, స్వయాన కెసిఆర్ ఇలాకా రైతు మల్లయ్యతో మాట్లాడించి, మల్లన్న సాగర్ ధ్వంస రచనను వినిపించడం, అయినా పాలకుల ఆలోచనలో మార్పు కానరాక పోవడంతో రేపటి భవిష్యత్ అంధకారంగా కనపడుతున్న కన్నీటి గాథల్ని కళ్లకు కట్టినట్లు చూపిన రచయిత్రి శక్తికి మించిన శ్రమకోర్చి రాయడం అభినందనీయం. సహజంగా వార్తా కథనాలతో, పత్రికల ద్వారా, మ్యాగజైన్ల ద్వారా దొరికే సమాచారంతో వ్యాసాల్ని రాసే రచయితలకు భిన్నంగా, అత్యధిక వ్యాసాలు సంఘటన జరిగిన ప్రాంత నేలతో సంభాషించడం, ఈ కథనాల్లోని మరో ప్రత్యేకత!
ఈ వ్యాసాలు రాయడానికి కారణమైన కేరింగ్ సిటిజన్స్ కలెక్టివ్‌ను, ప్రచురించిన లిఖిత ప్రెస్‌ను అభినందించాల్సిందే. రైతుల పట్లనే కాదు, సమాజం పట్ల బాధ్యత గుర్తెరగాలనుకున్న ప్రతీ వారు చదవాల్సిన పుస్తకమిది.
ఈ కథనాల్లో సామాజిక రుగ్మతను కూడా రచయిత సున్నితంగా తడుముతూ, యుక్త వయస్సులో ఉన్న పురుషులు ఆత్మహత్యలు చేసుకుంటే, కొత్తగా పెళ్లైన వధువును నిందించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించిన తీరు, మన లోపభూయిష్ట విద్యా విధానాన్ని, లింగ వివక్షత సమాజాన్ని దోషిగా నిలపడం ఆలోచించాల్సిన అంశాలు. దాదాపుగా రచయిత్రి ఓ పరిశోధనాత్మకంగా రాసిన కథనాలకు అనేక జోడింపుల్ని చేసింది. ఈ జోడింపుల సమాచారాన్ని ఓ లిస్టుగా చివరకు ఇస్తే బాగుండేది. ఆసక్తి ఉన్న వారికి వాటిని కొని చదివే అవకాశం ఉంటుంది. అలాగే 1980లో ఎన్‌టిఆర్ రెండు రూపాయల కిలో బియ్యం పథకం ప్రారంభించాడని.. కాని ఇది 1983 తర్వాత, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాతనే జరిగింది. పోతే, ఎన్‌టిఆర్ మాటలకు జడిసిన కోట్ల విజయభాస్కరరెడ్డి, కాంగీ హయాంలో రూ.కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించాడని సూచించాల్సింది.
మొత్తంగా, వ్యవసాయరంగ సమస్యలతోపాటుగా ఈ రంగంలో పరిశోధన చేయడానికి, వాస్తవ భూ పురిటినొప్పుల్ని అవగాహన చేసుకోవడానికి ఈ పుస్తకం బాగా పని చేస్తుంది.

-డా.జీయల్