అక్షర

ఆంగ్లంలో ‘వేయిపడగలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

థౌజెండ్ హుడ్స్ తెలుగు వేయిపడగలు
నవలకు ఆంగ్లానువాదం
మూలం: విశ్వనాథ సత్యనారాయణ
అనువాదం: వేల్చాల కొండలరావు
వెల: రూ.500
ప్రతులకు: విశ్వనాథ సాహితీ పీఠం
31-3-7, విశ్వనాథపురం మారుతీనగర్ విజయవాడ-4.

** ** ****

వేల్చాల కొండలరావు ప్రసిద్ధ రచయిత. లోగడ స్వతంత్ర రచనలు చేసి తెలుగు వారిని అలరించారు. ఇప్పుడు వారొక బృహత్ ప్రయత్నం చేశారు. అది తెలుగులోని ‘వేయి పడగలు’ నవలను ఆంగ్లంలో థౌజెండ్ హుడ్స్’ అనే పేరుతో అనువదించారు. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ 1934లో ఈ నవలను ఒక విజ్ఞాన సర్వస్వంగా రూపొందించారు. తర్వాతి కాలంలో దీనిని వివిధ భారతీయ భాషలలోనికి అనువదింపజేశారు. అంతేకాక టీవీ సీరియల్‌గా హిందీలో వచ్చింది. వేయి పడగలు నవల జ్ఞానపీఠ పురస్కారానికి ప్రతిపాదింపబడింది. కాని దానికి బదులు తర్వాతి కాలంలో శ్రీమద్రామాయణ కల్పవృక్షం గ్రంథానికి వచ్చింది. 20వ శతాబ్దం నాటి తెలుగు సంస్కృతికి ఈ నవల అద్దం పడుతున్నది. పాత వ్యవస్థలు మారిపోతున్నాయి. కొత్త నీరు ప్రవహిస్తున్నది. పాశ్చాత్య భాషా పాలనా ప్రభావంతో భారతీయుల జీవనశైలి మారిపోయింది. సామాన్య దృష్టికి హరప్ప నాయుడు ఒక సంస్థానాధిపతి. కాని అతడు రాజు. ధర్మారావు ధర్మమునకు ప్రతీక. వేయి పడగలు అంటే కుండలినీ యోగము. అరుంధతి కథ భారతీయ దాంపత్య వ్యవస్థకు చిహ్నము. ఇదొక పురుషార్థము. గుణాచారి దివికి భువికి లంకె. పల్లవిక పర్యావరణ సంకేతము. ఇదొక సంకేత ప్రధానమైన రచన. ఇందలి గిరికా నృత్యము ఒక దృశ్య కావ్యము. ఇలాంటి గ్రంథాన్ని ఆంగ్లంలోకి అనువదించటం కష్టసాధ్యము. సంస్కృత గ్రంథాన్ని భారతీయ భాషలలోకి అనువదించటం సులభం. కాని ఒక తెలుగు పుస్తకం ఇంగ్లీషు ఫ్రెంచి గ్రీకు భాషలలోకి పోయినప్పుడు తప్పనిసరిగా పరిభాషలో తేడా వస్తుంది. వేల్చాల కొండలరావు గ్రంథ రచనలో అందె వేసిన చేయి కావటంతో ఈ తెలుగు గద్య ప్రబంధాన్ని ప్రపంచీకరణం చేయగలిగారు.
ఈ ఆంగ్ల కృతికి ముందు మాన్యశ్రీ పి.వి.నరసింహారావు, ప్రొ.ఎస్.లక్ష్మణమూర్తి, ప్రొ.మాదిరాజు రంగారావు వంటి కొందరు సుప్రసిద్ధుల అభిప్రాయాలు, శుభాకాంక్షలు కూడా ఆంగ్లంలోనే ముద్రించారు.
ఆ గ్రామము పేరు సుబ్బన్నపేట. దైవము పేరు సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఇదొక భారతీయ సాంస్కృతిక మహేతిహాసము. ‘ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫర్ ఎవర్’ అన్నాడు కీట్స్ - అది వేయి పడగల గ్రంథమేనన్నారు ప్రచురణకర్తలు.
"Oh! My! The times! All the old things that perished and the new things cropped up. How could that be the best? Even a baby donkey is cute when born! Alas' ఇంధులో విశ్వనాథ వారి భావ తీవ్రత వ్యక్తమవుతున్నది. ప్రస్తుతము మనమొక సంధి యుగములో ఉన్నాము. కొత్త పాతల మేలు కలయికలో గతం కాదు నాస్తి అది అనుభవాల ఆస్తి అని గ్రహించడానికి ఈ గ్రంథం ఉపయోగపడుతుంది. తెలుగు వాడి వాడి వేడి విశ్వానికి అందించడానికి ఈ ఆంగ్లానువాదం ఎంతగానో తోడ్పడుతుంది. ఈ విధంగా కొండలరావుగారి కృషికి ఏడుకొండల వాడు ఆశీస్సుల నందించినట్లయింది.

-ప్రొ.ముదిగొండ శివప్రసాద్