అక్షర

వగచడం దేనికి సంకేతం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రష్యాలో విప్లవం
-ఆల్బర్ట్ రీస్ విలియమ్స్
(అమెరికా పాత్రికేయుడు)
పేజీలు: 306 వెల: రూ.250
విశాలాంద్ర పబ్లిషింగ్ హౌస్ విజయవాడ

** ** ***

రష్యా విప్లవం వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గత అక్టోబర్ - నవంబర్ మాసాల్లో ఎంతో సాహిత్యం, సమాచారం మరోసారి వెలుగు చూసింది. అందులో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు అమెరికా పత్రికా రచయిత ఆల్బర్ట్ రీస్ విలియమ్స్ గతంలో రాసిన ‘రష్యాలో విప్లవం’ పుస్తకం పునర్ముద్రణ ఒకటి. పబ్లిషింగ్ హౌస్ సంపాదకులు గడ్డం కోటేశ్వరరావు ఈ పునర్ముద్రణకు 19 పేజీల పీఠిక రాశారు. ‘పార్టీని ఆయుధంగా చేసుకుని స్వప్రయోజనాలకు వాడుకునే నయవంచక గుంటనక్కలూ ఉండవచ్చు. అంత మాత్రంచేత మానవాళికి విముక్తి ప్రదాతగా నిలవాలనే సంకల్పంతో ప్రారంభమైన మార్క్సిస్టు - లెనినిస్టు పార్టీని, కమ్యూనిస్టు కార్యకర్తలను నిందించి, నిరుత్సాహపడి ప్రయోజనం లేదు. జరిగిన పొరపాట్లకు కారణాలను అనే్వషించి, ఆ పొరపాట్లు చేయకుండా ముందుకు పోవడమే అక్టోబర్ విప్లవానికి నిజమైన నీరాజనం...’ (పేజీ 19) అన్నారు.
ఇలాంటి అభిప్రాయాల్ని, ఆలోచనల్ని, అవగాహనను, ఆత్మశోధనను ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వ్యక్తం చేసి ఉంటారు. అందులో కోటేశ్వరరావు ఒకరు.
మానవాళికి విముక్తి ప్రదాతగా మార్క్సిజం - లెనినిజాన్ని 21వ శతాబ్దంలో పేర్కొనడం పూర్తిగా అన్యాయం, అసంబద్ధం, అజ్ఞానం. ‘విముక్తి’ అనే పద ప్రయోగం పూర్తిగా అనాలోచితం. నిరంతర ప్రవాహం మాదిరి కొనసాగే మానవ జీవితానికి, మానవాళికి ఆ పదం అన్వయమవదు. కాని చాలామంది మార్క్స్ అభిమానులు అలవోకగా, నిరభ్యంతరంగా ఆ పదాన్ని ప్రయోగిస్తారు. మానవాళి ఒకచోట నిలువ వున్న తటాకం లాంటిది కాదు. అది నిరంతరం చైతన్యంతో కదిలే ఝరి. మరి దాన్ని విముక్తి చేసే ప్రదాతగా మార్క్సిజం - లెనినిజాన్ని పేర్కొనడం అజ్ఞానమవుతుంది తప్ప మరొకటి ఎలా అవుతుంది? ఈ ప్రాథమిక వివేకం- వివేచన కోల్పోవడం కారణంగా విప్లవం పేర అనేకానేక అఘాయిత్యాలు జరిగాయి. అజ్ఞానమే జ్ఞానమనుకున్న ఉన్మత్త స్థితిలో కోట్లాది మంది ప్రజలను కడతేర్చారు. ఏదైతే మానవాళి విముక్తి ప్రదాత అంటున్నారో, ఆ సిద్ధాంత స్ఫూర్తితో, ప్రేరణతో కోట్లాది మంది ప్రజల ప్రాణాలు హరించి తిరిగి మళ్లీ, మళ్లీ ఆ సిద్ధాంతం మానవాళి విముక్తి ప్రదాత అనడం అన్యాయం, అసహజం, అరాచకం కాక ఏమవుతుంది? ఈ విషయమై వంద సంవత్సరాల అనంతరం కూడా జ్ఞానోదయం కలగకపోతే ఎలా?
రష్యాలో ఏడు దశాబ్దాల అనంతరం అక్కడి ప్రభుత్వం, వ్యవస్థ కుప్పకూలిపోవడాన్ని జీర్ణించుకోలేక వగచడం ఎక్కువగా కనిపిస్తోంది. విప్లవం విజయవంతమైనంత మాత్రాన అది ఆచంద్ర తార్కారం కొనసాగాలని భావించడం భావ దారిద్య్రం తప్ప మరొకటి కాదు. ఆ విప్లవ సారాంశంలో కాలానుగుణమైన ప్రయోజన లక్షణం, మానవాళికి ఉపకరించే మెరుగైన దారి, దర్శనం ఉంటే ఎవరైన ఎందుకు తిరస్కరిస్తారు?.. ఆ విప్లవ నాయకుడైన లెనిన్ విగ్రహాలను ఎందుకు ధ్వంసం చేస్తారు? అలా జరిగిందంటే తీవ్రమైన తప్పిదం జరిగిందనే కదా? ఈ పార్శ్వాన్ని విస్మరించి తాతల కాలంనాటి చైతన్య స్రవంతి, సైబీరియా మంచులా ఘనీభవించి ఉండాలని ఆశించడం పూర్తిగా అన్యాయం, అశాస్ర్తియం. శాస్ర్తియ సిద్ధాంతమని పదేపదే పేర్కొనే మార్క్సిజం జడ పదార్థంగా చూసేందుకే ఇష్టపడేవారే ఎక్కువగా వగచడం కనిపిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా రష్యా విప్లవంపై ఇటీవల వెలువడిన, వెలువడుతున్న రచనలు, అభిప్రాయాలు, ఆలోచనలు ఎక్కువగా ఇదే మూస ధోరణిలో వెలువడటం విషాదం.
ఆల్బర్ట్ రీస్ విలియమ్స్ పుస్తకం కొత్త కోణాన్ని ఏమీ చూపలేదు. చర్విత చరణంగా అవే విషయాల్ని ఆయన చెప్పారు. అమెరికా పత్రికా రచయిత చెప్పినంత మాత్రాన శంఖంలో పోసిన నీళ్లు తీర్థంగా మారవు కదా?
2017 సంవత్సరం అక్టోబర్ - నవంబర్ నాటి కాలమాన పరిస్థితులేమిటి? ఈ కాలపు జ్ఞాన సంచయమేమిటి అన్న ఆలోచన మార్క్స్, రష్యా విప్లవ అభిమానులు వేసుకున్న, వేసుకుంటున్న పాపాన పోవడంలేదు. గత మూడు వందల సంవత్సరాల కాలంలో జరగని అభివృద్ధి, సాంకేతిక పురోభివృద్ధి గత మూడు నాలుగు దశాబ్దాల్లో జరిగింది. ఆవిరి యంత్రాల కాలంనాటి రష్యా విప్లవం నాటి అభిప్రాయాలకు, ఆలోచనలకు నాల్గవ పారిశ్రామిక విప్లవం విస్తృతమవుతున్న 2017 సంవత్సరపు ఆలోచనలకు, అభిప్రాయాలకు, మానవ అభివృద్ధికి ఎంత తేడా ఉందో పోల్చుకోలేక, తేల్చుకోలేక కేవలం వగచడం వల్ల ఎవరైనా సాధించేది ఏమీ కనిపించదు.
వేల సంవత్సరాల మానవ జాతి చరిత్రలో ఆయా దేశ కాల పరిస్థితుల్లో ఎందరో విప్లవకారులు పుట్టారు. వారివారి ప్రభావాన్ని చూపారు. కాలం కొత్త మలుపు తిరిగినప్పుడల్లా కొత్త అనే్వషణ, ఆవిష్కరణలు జరగడం సహజం. ఇప్పుడు అదే జరిగింది. జరుగుతోంది. ఇందులో వగచడానికి ఏముంది? కమ్యూనిస్టులు మాత్రం నాష్టాల్జియాలో చిక్కుకుని లెనిన్ కాలం దాటి ముందుకు కదలడానికి ఇష్టపడకపోవడం విడ్డూరం. ఇంకా ఎన్ని దశాబ్దాలపాటు వగచడం?
ఇక ఈ పుస్తకం అనువాదం అంత అభినందనీయంగా లేదు. ఉదాహరణకు.. విప్లవ ప్రతీఘాత సేనలు ఒకటి తరువాత ఒకటిగా ఇసుకలా రాలిపోయాయి (పే.303), నైయిల్ - కొల్లాక్ యుద్ధ శ్రేణిలో ఉరితీయబడ్డాడు (పే.304)

-వుప్పల నరసింహం 9985781799