అక్షర

సాకిరేవు కతలు (పరిచయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-మూరిశెట్టి గోవింద్
వెల: రూ.120
ప్రతులకు: రచయిత చిన్నదొరవారికండిగ (గ్రా.పో)
కార్వేటి నగరం మండలం చిత్తూరు జిల్లా 9440849755

** *******
ఒకనాడు మన పల్లెలు మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి పథంలో నడిచేవి. ప్రపంచీకరణ పుణ్యమాని నానాటికి తీసికట్టుగా తయారవుతున్నాయి. నాటి పల్లె వైభవం నేటి తరానికి ఎంతో కొంత తెలుసు. రాబోవు తరాల వారికి చెప్పాలన్న సదుద్దేశంతో ఈ కథలు రాశారు. పల్లెలు, అక్కడి మనుషుల మనస్తత్వాలు, కులాలు, వాళ్ల వృత్తులు, వారి మధ్యనున్న అంతరాలు, నమ్మకాలు, కరువు కాటకాలు, నాటి ఆహారపు అలవాట్లు, మారుతున్న కాలానుగుణంగా వచ్చిన మార్పులు చేర్పులు, వీటన్నింటినీ కలగలిపి ఈ కథలు అందించారు. చాకలి వ్యవస్థ అన్నది ఎంతో పూర్వం నుంచే సమాజ అంతర్భాగంగా ఉన్నది. రామాయణ కాలంలోనే వీరి ప్రస్తావన వస్తుంది. రామాయణాన్ని మలుపు తిప్పిన ప్రాచీన కులం ఇది. ‘ఆది నుంచి మాది ఎంతో గొప్పకులం’ అని చెప్పుకుంటున్న వారికి, భారత జాతికి ప్రామాణిక గ్రంథాలైన రామాయణ, మహాభారతాల్లో చోటు దక్కటం, చాకలి కులానికున్న ప్రత్యేకతను తెలియజేస్తుంది. ఒక గ్రామంలో ఉండే ప్రతి కుటుంబంతోను చాకలి వారికి సన్నిహిత సంబంధం ఉంటుంది. ఒక ఊరి సమాచారం మొత్తం చాకలి వారికి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. ఈ కథలలోని సంఘటనలన్నీ చాలా వరకు యథార్థాలేనని రచయిత చెప్పుకొన్నారు. ఇందులోని పాత్రలన్నీ సజీవాలే.