అక్షర

వక్రీకరణ లేని వరకవి కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరకవి భూమాగౌడ్ (చారిత్రక నవల)
-వేముల ప్రభాకర్
వెల: రూ.200
ప్రతులకు: నవోదయ బుక్‌హౌస్

** ** ****

ఒకనాటి సాంఘిక కథ నేడు చారిత్రక ఇతివృత్తంగా మారిపోతుంది. వేముల ప్రభాకర్ రచించిన ‘వరకవి భూమాగౌడ్’ అలాంటి చారిత్రక నవల కిందికే వస్తుంది. భూమాగౌడ్ క్రీ.శ.1875లో జన్మించి క్రీ.శ.1950లో పరమపదాన్ని అందుకున్న వాగ్గేయకారుడు. ఈయన చరిత్ర ఈతరం పాఠకులకు బొత్తిగా తెలియదు. ఇతడు శ్రీరామానుజ మతస్థుడు. నిరాడంబర జీవి. తమ కవితలతో ప్రజలను ప్రభావితం చేసినవాడు. ఉన్నవ లక్ష్మీనారాయణ గారి ‘మాలపల్లి’ నవలలో రామదాసు పాత్రకు గల ప్రాధాన్యం ఈ వేముల ప్రభాకర్ రచనలో భూమా గౌడ్ గారికి ఉన్నట్లు విమర్శకులు అభిప్రాయపడ్డారు. రచయిత నవలలో గౌడ్ జీవిత చరిత్రను చెపుతూనే 19, 20వ శతాబ్దాలలోని తెలంగాణ జన జీవనాన్ని చిత్రించడానికి ప్రయత్నించారు. అంటే వట్టికోట ఆళ్వారుస్వామి, దాశరథి రంగాచార్యల పరంపరలో ఈ నవల వచ్చిందని తాత్పర్యం.
భూమాగౌడ్ భక్తుడు. సమాజ సేవకుడు. వైద్యుడు. వాగ్గేయకారుడు. ఒక సంఘ సంస్కర్త. రావికల్ మాదిగలను సహ పంక్తి భోజనాలకు ఆహ్వానించి తన రామానుజ సిద్ధాంతాన్ని ఆచరించి చూపాడు. ఈయన సహధర్మచారిణి వరసుబాయి భర్త చేపట్టిన ఉద్యమాలకు చేదోడువాదోడుగా నిలిచింది. సామాన్య గీత కుటుంబంలో పుట్టిన నిరక్షరాస్యుడైన భూమాగౌడ్ భక్తి ఉద్యమం కోసం కవిత్వం నేర్చుకోవటం విశేషం. రాజరాజేంద్ర రావికల్ రామచంద్ర మకుటంతో శతక పద్యాలు చెప్పాడు. ‘పొట్టకొచ్చిన పంట కాపునకును ఆరుగాలము పని చేస్న పంట పిట్టలు దొరలు దొంగలు మట్టుపెట్టి’. ఈ పద్యాలల్లో తన ఆవేదనను వ్యక్తీకరించాడు. అంతేకాదు తిరునగరి నరసింహ దాసకవి చేత మాధవ విజయము అనే నాటకం రచింపజేయించి దానిని ఉస్మాన్ ఆలీ ఖాన్ పాలనా కాలంలో తెలంగాణాలో ప్రదర్శింపజేసే బాధ్యతను కూడా ఈ భూమాగౌడ్ స్వీకరించాడు. అంటే విశిష్టాద్వైత మత ప్రచారానికి గౌడ్ ఒక మిషనరీ వలె పని చేశాడని అర్థం. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరుగున పడిన ఇలాంటి వారి చరిత్రలను వెలికితెచ్చే ప్రయత్నం మొదలయింది. అందులో ఒక భాగంగా వేముల ప్రభాకర్ ఈ చారిత్రక నవలను రచించడం ముదావహం. ప్రభాకర్ శైలి సరళంగానూ సామాన్య పాఠకుణ్ణి దృష్టిలో పెట్టుకొని రచించినట్లు కన్పడుతున్నది. బుక్ కల్చర్ తగ్గిన రోజులలో రీడబులిటీ లేకపోతే ఒక చారిత్రక నవలను పఠించడం చాలా కష్టసాధ్యం. అందులోను ఈ నవల ఫిక్షన్ కాదు. ఇటీవలి సామాజిక చరిత్రయే. అందువలన రచయిత భూమాగూడ్ గారి జీవితమును రచనలను బాగా అధ్యయనం చేసి ఒక ప్రామాణిక రచనగా దీనిని తీర్చిదిద్దేందుకు కృషి చేశాడు. చరిత్రను మరచిన వాడు చరిత్ర హీనుడవుతాడు. దేశ చరిత్రను వక్రీకరించకుండా కన్నులకు కట్టినట్లు ప్రదర్శింపజేయటంలోనే నవలలోని కథాకథన విజయం ఆధారపడి ఉంటుంది. అంటే కథనంలో నాటకీయత జోడించాలి. ప్రభాకర్ భక్తిశ్రద్ధలతో ఈ రచన చేసినట్లు సుస్పష్టం. గత శతాబ్దపు తెలంగాణ చరిత్ర తెలుసుకోగోరే వారికి ఈ కథ ఉపయోగపడుతుంది.

-ప్రొ.ముదిగొండ శివప్రసాద్