అక్షర

పిల్లల భవిష్యత్తుకి బంగారు బాటలు ఈ కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిట్టిబాబు చిట్టి కథలు -పంతుల జోగారావు
వెల: రూ.60
ప్రతులకు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ అన్ని బ్రాంచీలు.

*** ******

చిట్టిబాబు చిట్టి కథలు - పుస్తకం పంతుల జోగారావు గారి కలం నుంచి వెలువడ్డ పిల్లల కథలు. ఇది ఇరవై కథలతో కూడిన సంపుటి. పంతుల జోగారావు గారు ఎన్నో గ్రంథాలు రాశారు. వృత్తి తెలుగు మాస్టారు కావటంతో, చక్కటి తెలుగు భాష, ఉపాధ్యాయుడు కనుక, పిల్లలకి ఎలా చెప్పాలో తెలుసున్న వ్యక్తి కావడంవల్ల కథలు పిల్లలకు నచ్చే విధంగా వున్నాయి. ముఖ్యంగా ‘చిట్టెలుక సాహసాలు’. దానికి సాహసాలు చెయ్యడం చాలా ఇష్టం. అలా ఎవరు చెప్పినా వినకుండా దాని సాహసాలు అది చేస్తూనే పోతుంది. ఒకసారి చిక్కుల్లో పడిపోతుంది చిట్టెలుక. ఒక గుహలోకి పోయి దారి తప్పిపోతుంది. ‘అమ్మా’ అంటూ ఏడుస్తుంది. అప్పుడే ఒక ముని ఆ గుహకి తపస్సు చేసుకోవడానికొచ్చి, చిట్టెలుక ఏడుపు విని జాలిపడి దాన్ని చేత్తో పట్టుకుని నిమురుతాడు. వెంటనే చిట్టెలుక రాజకుమారుడిలా మారిపోతుంది. తన రూపం చూసి ఆశ్చర్యపోతుంది. అప్పుడు ముని ‘పనికిమాలిన సాహసాలు చెయ్యను అని చెప్తే, మళ్లీ నిన్ను చిట్టెలుకగా మారుస్తాను’ అంటాడు. కానీ చిట్టెలుక ‘వద్దు. ఇలాగే సాహసాలు చేసే రాజుగా గడుపుతాను’ అంటాడు తప్ప, సాహసాలు చెయ్యను అనడు. అలా గమ్మత్తయిన కథ. అలాగే ‘ఒక రాజు తెలివి’ ఉపాయంతో తనకు కావలసిన దాన్ని ఎలా సాధించాలో చెప్పే కథ. ఇలా దేనికదే చక్కగా చదివిస్తాయి. అందరు పిల్లలూ చదవాలి.
ఈ పుస్తకాన్ని రచయిత తన చిననాటి స్నేహితుడు, ప్రఖ్యాత రచయిత, నవ్య వారపత్రిక సంపాదకులు ఎ.ఎన్.జగన్నాథ శర్మగారికి అంకితమిచ్చారు.

-శారదా అశోకవర్థన్