అక్షర

జళ్‌గీద్‌గా ప్రవహించిన జలగీతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జళ్‌గీద్
మూలం: డా.ఎన్.గోపి -జలగీతం
బంజారా భాషానువాదం
ఎం.కృష్ణ నాయక్ చవాణ్
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో
*
అనువాదానికి ఇరు భాషలపై పట్టుండాలి. సమానార్థాలను, పదాలను, వాక్యాలను అతికినట్లుగా వాడగలగాలి. ఇవి సాధ్యంకాదని భావిస్తే స్వేచ్ఛానువాదం చేయడం జరుగుతుంది. పోతే, స్వేచ్ఛానువాదం మూల రచన వాసనకన్నా, అనువాదకుడి రచనగా రూపాంతరం చెందుతుంది. ఎం.కృష్ణనాయక్ చవాణ్ తన మాతృభాషపై పట్టుండటంలో విశేషం లేకపోవచ్చు! కాని, తన మాతృభాష గోర్‌చోలి భాషలో వాడుక పదాలు పరిమితంగా వున్నా, సంతృప్త ద్రావణంలా పదకోశాన్ని పుష్కలంగా కలిగి వున్న తెలుగు నుంచి అనువాదం చేయడం అభినందనీయం. పైగా లిపే లేని గోర్ భాషను తెలుగు లిపిలో రాయడం, దాన్ని పాఠక లోకానికి అందించాలని తపన పడటం, పరోక్షంగా బంజారా భాషను సులభంగా తెలుగు పాఠకులు నేర్చుకునేలా దోహదపడుతుంది.
అనువాదకుడు ముందే చెప్పినట్లు, డా.ఎన్.గోపి జలగీతాన్ని గోర్ భాషలో, తెలుగు జలగీతంలా లయబద్దంగా జల ప్రవాహంగా పరుగెత్తించడం జరిగింది. మలుపులు తిరిగే నీటి వయ్యారంలా అనువాద భాషలో సొంపులు తిరగడం గమనార్హం! అయితే, పద సంపద తక్కువగా వుండటంతో, సందర్భానుసారంగా కొన్ని కొత్త పదాల్ని, మరికొన్ని హిందీ, సంస్కృత పదాల్ని, విధిలేని పరిస్థితిలో ఆంగ్ల పదాల్ని వాడి ఓ కొత్త ఒరవడిని చూపాడు. ఈ సందర్భంగా కొన్ని కొత్త పదాలకు నాందీ ప్రస్తావన చేయడం, భాష ఎదుగుదలకు దోహదపడుతుంది.
బంజారా పాఠకులకే కాక, ఆ భాషా పరిజ్ఞానం పెంపొందించుకోవాలనుకునే తెలుగు పాఠకులకి కూడా ఉపయుక్తంగా అనువదించిన కృష్ణనాయక్ అభినందనీయులే! విభిన్న భాషల పట్ల మక్కువ గలవారు నిజంగా చదవాల్సిన అనువాదం ఇది.

-డా.జీయల్