రాష్ట్రీయం

అమరావతి కమిషనరేట్ ఏర్పాటుపై నిర్ణయం ప్రభుత్వానిదే: డిజిపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ , నవంబర్ 30: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కమిషనరేట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర డిజిపి జెవి రాముడు తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే ప్రతిపాదనలు పంపామని, ప్రస్తుతం పరిశీలనలో ఉన్నందున నిర్ణయం ప్రభుత్వమే తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు కొత్త కమిషనరేట్‌ల ఏర్పాటుపై ప్రతిపాదనలేమీ లేవన్నారు. మరోవైపు రాజధాని అమరావతికి అంతర్జాతీయ ప్రమాణాలు, సంబంధాలు అనివార్యమైన క్రమంలో టెక్నాలజీ వినియోగం తప్పనిసరని చెప్పారు. ఇందుకోసం పోలీసు శాఖ ఇఎస్‌ఎఫ్ ల్యాబ్స్‌తో కలిసి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు అడుగులు వేస్తోందన్నారు. ప్రపంచం డిజిటైజ్ అవుతున్న క్రమంలో భవిష్యత్తులో సైబర్ నేరాలు పెరిగిపోయే అవకాశం ఉందని, వాటిని ఛేదించేందుకు, తీవ్రవాద కార్యకలాపాలను నివారించేందుకు సైబర్ క్రైం పరిశోధన దోహదపడుతుందన్నారు. విజయవాడలో డిజిపి క్యాంపు కార్యాలయం ప్రారంభం సందర్భంగా ఇఎస్‌ఎఫ్ ల్యాబ్స్ ముద్రించిన ‘సైబర్ క్రైం - ఇంక్యుబేషన్ టెక్నాలజీ’ అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. రాష్ట్ర పోలీసు శాఖ కార్యకలాపాలు ఇక్కడి నుంచే కొనసాగుతాయని చెప్పారు. వారంలో ఒకరోజు ప్రతి అధికారి హెడ్ క్వార్టర్స్‌లో ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. విజయవాడను కూడా ఫ్రీజోన్‌గా చేస్తే బావుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. విజయవాడ ఫ్రీజోన్ కోసం కూడా పంపిన ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయన్నారు. చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసు విషయానికొస్తే నిందితుడు చింటూ లొంగిపోయిన క్రమంలో మరింత సమాచారం కోసం విచారణ జరగాల్సిన అవసరముందన్నారు. డిజిపి నూతన కార్యాలయాన్ని రాముడు సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. అదనపు డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారులు ఆర్‌పి ఠాకూర్, విఎస్ కౌముది, వినయ్ రంజన్, సిహెచ్ ద్వారకాతిరుమలరావు, ఎన్‌వి సురేంద్రబాబు, ఎఆర్ అనూరాధ, ఇంటలిజెన్స్ అదనపు డిజి ఎబి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. (చిత్రం) విజయవాడలో డిజిపి కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న డిజిపి