రాష్ట్రీయం

ఆఫీసులు తరలిస్తే ఖర్చు తడిసి మోపెడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాబు నిర్ణయం..ఖజానాకు భారం రాజధాని ప్రాంతంలో పక్కా భవనాలు లేవు
ఆఫీసుల్ని ముందుగా విజయవాడకే తరలించాలి అక్కడినుంచి అమరావతికి

హైదరాబాద్, డిసెంబర్ 3 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలను హైదరాబాద్ నుండి విజయవాడకు తరలించే అంశం రాద్ధాంతంగా మారింది. 2016 జూన్ 1లోగా రాష్టస్థ్రాయి ప్రభుత్వ కార్యాలయాలు కొత్తరాజధాని ప్రాంతానికి తరలించాలని సర్క్యులర్‌లో పేర్కొన్నప్పటికీ, కొత్త రాజధానికి ఎంపిక చేసిన ప్రాంతంలో ప్రస్తుతం ఎలాంటి భవనాలు లేవు. అందువల్ల తొలుత హైదరాబాద్ నుండి విజయవాడకు తరలించాలి. అమరావతిలో కొత్త భవనాల నిర్మాణం పూర్తయ్యాక మళ్లీ అక్కడికి పర్యాయం తరలించాల్సి ఉంటుంది. అంటే హైదరాబాద్ నుండి విజయవాడకు ఒక పర్యాయం, విజయవాడ నుండి అమరావతికి రెండో పర్యాయం తరలించాల్సి వస్తుంది. ఇలాఉండగా విజయవాడలో చాలీచాలని అద్దె భవనాలు, వాటి నిర్వహణ కోసం ఏటా దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల రాష్ట్ర రాజధాని అమరావతి నగరానికి చేసిన శంకుస్థాపన తర్వాత భవనాల నిర్మాణానికి మూడునాలుగేళ్లు పడుతుంది. రాష్ట్ర సచివాలయం, శాసనసభ భవనాలు, ఇతర రాష్ట్ర స్థాయికి చెందిన అత్యవసర భవనాలను రెండేళ్లలో పూర్తి చేసేందుకు వీలుంది. ఈ భవనాలకు నిధులు ఎలా సేకరిస్తారో ఇంకా స్పష్టం కాలేదు. సాంకేతికంగా సింగపూర్, జపాన్ తదితర దేశాలకు చెందిన సంస్థలు సహకారం అందించేందుకు ముందుకు వచ్చాయి. వీటికి నిధులు ప్రధాన సమస్యగా మారుతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రోజువారీ ఖర్చులకే ఇబ్బంది పడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రణాళికా ఖర్చులకు నిధులు లేకపోవడంతో ఇక్కట్లు ఎదురౌతున్నాయి. ఈ పరిస్థితిలో అమరావతిలో భవనాల నిర్మాణానికి నిధుల కొరత పెద్ద అడ్డంకిగా మారింది. కేంద్రంతో పాటు ఇతర మార్గాల ద్వారా నిధులు సమకూర్చుకున్నప్పటికీ భవనాల నిర్మాణం పూర్తయేందుకు మూడునాలుగు సంవత్సరాలు అవుతుందని అధికారవర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం హైదరాబాద్‌లో సచివాలయం, అసెంబ్లీ భవనం, సిసిఎల్‌ఎ, డిజిపి కార్యాలయం తదితర శాఖల భవనాలు సజావుగా సాగుతున్నాయి. వీటికోసం ప్రత్యేకంగా నిధులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. గత ఏడాజి జూన్ నుండి ఈ కార్యాలయాలన్నీ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగుతున్నాయి. పైగా రాష్ట్ర విభజన తర్వాత ఎపికి కేటాయించిన చాలా భవనాలకు మరమ్మతులు చేయడంతో పాటు అవసరమైన ఫర్నీచర్, విద్యుత్తు పరికరాలు, ఇతర కమ్యూనికేషన్ సదుపాయాలు కల్పించేందుకు దాదాపు 100 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఎపి రాజధాని కార్యాలయాలను కొంత కాలం పాటు హైదరాబాద్ నుండే నడిపించాలన్నది ప్రధాన డిమాండ్‌గా ఉంది. విభజన వల్ల ఏర్పడ్డ ఇబ్బందికరమైన పరిస్థితి నుండి గట్టేక్కేందుకే 10 సంవత్సరాల పాటు హైదరాబాద్‌ను రెండు రాష్ట్రాలు కూడా ‘కామన్ క్యాపిటల్’గా వాడుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం విభజనచట్టంలో పేర్కొంది. అంటే పదేళ్ల వరకు రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీతో పాటు ఇతర రాష్ట్ర కార్యాలయాలను హైదరాబాద్ నుండే నడిపేందుకు వీలుంది. రాష్ట్ర విభజన తర్వాత స్వల్ప సంఘటనలు మినహాయించి, తెలంగాణ ప్రభుత్వం నుండి పూర్తిస్థాయి సహకారం లభిస్తోంది. రాష్ట్ర సచివాలయానికి ఐదు బహుళ అంతస్థుల భవనాలను కేటాయించారు. డిజిపి కార్యాలయానికి లక్డీకాపూల్‌లో ప్రత్యేక భవనం కేటాయించారు. సిసిఎల్‌ఎ కార్యాయానికి ప్రత్యేక భవనం కేటాయించారు. అలాగే ఇతర హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్స్‌కు కూడా అవసరమైన భవనాలు సమకూరాయి. ఈ పరిస్థితిలో హైదరాబాద్ నుండి విజయవాడకు రాజధాని కార్యాలయాలను తరలించేందుకు భవనాల కొరత తీవ్రమైన అడ్డంకిగా మారింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉపయోగిస్తున్న భవనాల విస్తీర్ణంలో సగం వైశాల్యం కలిగిన భవనాలు కూడా అందుబాటులో లేవు. విజయవాడలో రాష్ట్ర సచివాలయం కోసం ఎంపిక చేసిన మేథాటవర్స్ ప్రస్తుతం సచివాలయంలోని ఒక భవనమంత విస్తీర్ణం కూడా లేదని అధికార వర్గాలు వెల్లడించాయి.
ఈ పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం తొందరపడకూడదని ఉద్యోగులంతా కోరుతున్నారు. 13 జిల్లాల నుండి హైదరాబాద్ వచ్చే ప్రజలకు కూడా పెద్దగా ఇబ్బంది లేదు. కొత్త రాజధాని అమరావతిలో నూతన భవనాల నిర్మాణం త్వరగా చేపట్టి యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి రాజధానిని తరలించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.