రాష్ట్రీయం

2500 మెగావాట్ల సోలార్ విద్యుత్ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలిసి పనిచేసేందుకు అమెరికా సంసిద్ధత

హైదరాబాద్, మార్చి 17: ఈ సంవత్సరం 2500 మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్లయించినట్టు పరిశ్రమలు, ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్‌కుమార్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ సంప్రదాయేత ఇంధన వనరుల రంగం పనుల్లో భాగస్వామ్యంగా ఉండేందుకు అమెరికా సంస్థలు ఆసక్తి చూపించాయి. సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో సాంకేతిక సహాయాన్ని అందించనున్నట్టు అమెరికా ప్రతినిధులు తెలిపారు. ఎనర్జీ ప్రన్సిపల్ సెక్రటరీని కలిసి చర్చించారు. అమెరికా ఎకనమిక్, బిజినెస్ వ్యవహారాల సహాయ కార్యదర్శి చార్లెస్ రివికిన్ నాయకత్వంలోని బృందం అరవింద్‌కుమార్‌ను గురువారం సచివాలయంలో కలిసింది. తెలంగాణ సౌర విద్యుత్ విధానం పట్ల దేశంలోని పరిశ్రమల రంగం ఆసక్తి చూపిస్తోందని అరవింద్‌కుమార్ తెలిపారు. దేశంలో ఈ సంవత్సరం 8000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి కేంద్రం అనుమతి ఇవ్వగా, దీనిలో 2500 మెగావాట్లు తెలంగాణ నుంచే ఉత్పత్తి చేయనున్నట్లు చెప్పారు. సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు వచ్చే సంవత్సరం ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు, స్టార్టప్‌లకు ప్రోత్సహించనున్నట్టు చెప్పారు.