అంతర్జాతీయం

అమెరికాలో తీవ్ర హిమపాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: అమెరికాను తీవ్ర హిమపాతం వణికిస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా హిమపాతం కురుస్తుండటంతో దాదాపు తొమ్మిది కోట్ల అమెరికన్లు ఇబ్బందులు పడుతున్నారు. రహదారులన్నీ మంచుతో నిండిపోయాయి. హిమపాతం వల్ల చలి తీవ్రత అధికంగా ఉంది. దాదాపు 2.5 కోట్ల మంది ప్రజలు 20 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలో జీవిస్తున్నారని అమెరికా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అధిక హిమపాతం వల్ల దాదాపు వెయ్యి విమానాలను రద్దుచేశారు. పోస్టల్ సర్వీసులను, పాఠశాలలను మూసివేశారు. యూనివర్శిటీ ఆఫ్ విస్కానె్సన్, యూనివర్శిటీ ఆఫ్ మినె్నసోటాలు తరగతులను రద్దుచేశాయి. ఆర్కిటెక్ నుంచి వీస్తున్న చలిగాలుల వల్ల ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల కంటే పడిపోయాయి.