జాతీయ వార్తలు

సారీ.. ‘హౌదీ మోదీ’కి రాలేకపోతున్నాను..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్: అమెరికాలో వారం రోజుల పాటు పర్యటించనున్న ప్రధాని మోదీ అక్కడ భారతీయ సంతతి వారితో ఆదివారంనాడు ‘హౌదీ మోదీ’ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమంలో మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని స్వాగతించిన తులసి గబ్బార్డ్ తాను ఇందులో పాల్గొనటం లేదని తెలిపారు. భారత సంతతికి చెందిన తులసి గబ్బార్డ్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు. దీంతో తాను ఈ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నందున రాలేకపోతున్నట్లు ఆమె ట్విట్టర్‌లో స్పష్టంచేశారు. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే తొలి హిందువు తులసి గబ్బార్డ్ కావటం విశేషం. ఇదిలావుండగా హౌదీ మోదీ కార్యక్రమానికి తులసి వస్తున్నారని అక్కడ పత్రికలలో వార్తా కథనాలు వచ్చాయి. అయితే ఈ కథనాలను నమ్మవద్దని ఆమె తెలిపారు.